నల్గొండ జిల్లాలో నాలుగు రోజుల క్రితం మతిస్తిమితం లేని ఓ వ్యక్తి తల మహాంకాళీ విగ్రహం కాలి వద్ద కనిపించడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే, ఆ సమయంలో ఆ వ్యక్తి మొండెం దొరకలేదు. మూడు రోజుల తర్వాత ఎట్టకేలకు ఆ వ్యక్తి మొండేన్ని పోలీసులు కనుగొన్నారు. ఈ కేసులో రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్‌లోని ఓ భవనంపై పోలీసులు మొండెం గుర్తించారు. మొండెంను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. విచారణలో భాగంగా పోలీసులు క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌తో ఘటనా స్థలంలో పలు ఆధారాలు సేకరించారు. నిందితుల ఆచూకీ కోసం సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
నాలుగు రోజుల క్రితం నల్గొండ జిల్లా చింతపల్లి మండలం నాగార్జున సాగర్ - హైదరాబాద్ జాతీయ రహదారి పక్కనే విరాట్ నగర్ కాలనీలో మెట్టు మహంకాళీ అమ్మవారి విగ్రహం వద్ద దుండగులు మొండెం లేని తలను గుర్తించారు. ఆ తర్వాత పోలీసులు అది జహేందర్ నాయక్ అనే మతిస్తిమితం లేని వ్యక్తి తల అని గుర్తించారు. సోమవారం (జనవరి 10) ఉదయం అమ్మవారి పాదాల వద్ద మొండెం లేని తల ఉండడాన్ని ఆలయ పూజారి బ్రహ్మచారి గుర్తించారు. వెంటనే స్థానిక పెద్దలకు, పోలీసులకు సమాచారం అందించారు. మృతుడిని గుర్తించే క్రమంలో తల ఫొటోను సోషల్ మీడియాలో పెట్టారు. పలువురి సమాచారం ఆధారంగా మృతుడు జహేందర్ నాయక్ (30) అని, అతడిది సూర్యా పేట జిల్లా పాలకవీడు మండలం శూన్యపహాడ్ గ్రామం అని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.
అయితే, ఈ ఘటన నరబలి అనే బలంగా విశ్వసిస్తున్నారు. గుప్తనిధుల కోసం ఎవరైనా నరబలి ఇచ్చారా? అనే అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇదే జిల్లాలోని శాలిగౌరారం, నాంపల్లి మండలం ముష్టిపల్లి, దేవరకొండ గుట్టల్లో గుప్త నిధుల కోసం నరబలి ఘటనలు జరిగిన నేపథ్యంలో పాత నేరస్థుల గురించి ఆరా తీస్తున్నారు. విచారణలో భాగంగా పోలీసులు క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌తో ఘటనా స్థలంలో పలు ఆధారాలను సేకరించారు. నిందితుల ఆచూకీ కోసం సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
Also Read: Mahabubnagar: బైక్‌పై లవర్స్ త్రిబుల్ రైడింగ్.. మధ్యలో శవం, ఇంతలో షాకింగ్ సీన్
Also Read: Nalgonda Crime: గుడి ముందు మనిషి తలకాయ, ఈ మిస్టరీ కీలక వివరాలు వెలుగులోకి.. మృతుడు ఎవరంటే..
Also Read: అరె ఏంట్రా ఇది.. లోన్ రిజెక్ట్ చేశారని ఏకంగా బ్యాంకునే తగలెట్టేశాడు, అంతా బూడిదే