కుటుంబ సభ్యులు దూరమైతే కలిగే దు:ఖం వర్ణనాతీతం. తల్లిదండ్రులు లేదా రక్తం పంచుకొని పుట్టినవారు, జీవిత భాగస్వాములు ఉన్నట్టుండి దూరమైతే ఆ బాధ నుంచి కోలుకోవడం చాలా కష్టం. ఆ బాధను దిగమింగుకొని సాధారణ జీవనం కొనసాగించడానికి చాలా సమయం పడుతుంది. అయితే, గతంలో అయిన వారి మరణాన్ని తట్టుకోలేని ఎంతో మంది గుండె పగిలి అక్కడికక్కడే కుప్పకూలిన ఘటనలు, గుండెపోటుతో మరణించిన ఘటనలు ఎన్నో వెలుగుచూశాయి. తాజాగా తల్లి చనిపోయిందనే బాధ తట్టుకోలేక ఓ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి అంత్యక్రియలు పూర్తి చేసిన వెంటనే అదే శ్మశానంలో ఆత్మహత్య చేసుకున్నాడు.
చిన్నప్పటి నుంచి కూలీ చేసుకుంటూ పెంచి పెద్ద చేసిన తల్లి మరణాన్ని ఆ యువకుడు తట్టుకోలేకపోయాడు. ఇంత కాలం తనను కంటికి రెప్పలా చూసుకున్న తల్లి దూరంకావడం భరించలేక తనువు చాలించాడు. ఆమె అంత్యక్రియలు చేసిన శ్మశానవాటికలోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ హృదయవిదారక ఘటన హైదరాబాద్‌లోని కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నగరంలోని గోల్నాక శ్యామ్ నగర్‌లో నాగేందర్, లక్ష్మీబాయి (60) దంపతులు ఉండేవారు. వీరికి ఇద్దరు కుమారులు. ఈ పిల్లల చిన్నతనంలోనే నాగేందర్ చనిపోయాడు.
దీంతో తల్లి లక్ష్మి బాయి కూలీ పనులకు వెళ్లి కుమారులు వినోద్ కుమార్(36), విజయ్ కుమార్‌లను పెంచి పెద్ద చేసింది. విజయ్ కుమార్‌కు వివాహం కావడంతో అతను వేరే దగ్గర ఉంటున్నాడు. వినోద్ కుమార్ అవివాహితుడు కావడం వల్ల తల్లి దగ్గరే ఉంటున్నాడు. ఇతను ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అయితే, కొంత కాలం క్రితం లక్ష్మీ బాయికి క్యాన్సర్ వ్యాధి సోకింది. దీంతో లక్ష్మిబాయి చనిపోగా బుధవారం గోల్నాక హర్రాస్ పెంట శ్మశాన వాటికలో అంత్యక్రియలు చేశారు. తల్లి ప్రేమను మరచిపోలేని వినోద్ అంత్యక్రియల తర్వాత ఇంటికి వచ్చి.. మళ్లీ ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లిపోయాడు. శ్మశాన వాటిక షెడ్డులోనే ఉరి వేసుకుని చనిపోయాడు. ఆయనను గురువారం కాటికాపరి గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు.
Also Read: Mahabubnagar: బైక్‌పై లవర్స్ త్రిబుల్ రైడింగ్.. మధ్యలో శవం, ఇంతలో షాకింగ్ సీన్
Also Read: Nalgonda Crime: గుడి ముందు మనిషి తలకాయ, ఈ మిస్టరీ కీలక వివరాలు వెలుగులోకి.. మృతుడు ఎవరంటే..
Also Read: అరె ఏంట్రా ఇది.. లోన్ రిజెక్ట్ చేశారని ఏకంగా బ్యాంకునే తగలెట్టేశాడు, అంతా బూడిదే