Makara Jyothi: శబరిమలలో మకరజ్యోతి దర్శనార్థం వచ్చిన భక్తుల శరణు ఘోష .. 18 పడిమెట్లు వెనుకున్న ఆంతర్యం ఏంటి...

అయ్యప్ప ఆలయంలో 18 మెట్లు ఎందుకు ఉన్నాయి? ఈ 18 నంబర్ కి అయ్యప్పకి ఉన్న సంబంధమేంటి ? ఈ బంగారు మెట్లు ఎక్కుతున్న వారికి ప్రతి మెట్టు ఏం బోధిస్తుంది. మకర జ్యోతి సందర్భంగా ఏబీపీ దేశం స్పెషల్ స్టోరీ..

Continues below advertisement

ఏటా లక్షల మంది భక్తులు అయ్యప్పను దర్శించుకుని తరిస్తారు. స్వామి ఆలయం ముందున్న 18 మెట్లను  ‘పదునెట్టాంబడి’ అంటారు.  ఈ సోపానాలు అధిరోహించడానికి ప్రతి భక్తుడు 41 రోజులు మండల దీక్ష తీసుకుని ఇరుముడి తలపై పెట్టుకుని ఆ మెట్లు ఎక్కుతారు.
18 మెట్లు ఎందుకంటే ...
మణికంఠుడు...అయ్యప్ప స్వామిగా శబరిగిరిలో కొలువైయ్యేందుకు  4వేదాలు, 2శాస్త్రాలు, అష్టదిక్పాలకులు, విద్య, అవిద్య, జ్ఞానం, అజ్ఞానం అనే దేవతా రూపాలు 18 మెట్లుగా మారడంతో ఒక్కో మెట్టుపై అడుగేస్తూ ఉన్నత స్థానాన్ని అధిష్ఠించారని చెబుతారు. పట్టబంధాసనంలో  కూర్చుని చిన్ముద్ర, అభయహస్తాలతో దర్శనమిచ్చి యోగసమాధిలోకి వెళ్లిన స్వామి జ్యోతి రూపంగా అంతర్ధానమయ్యారంటారు.  ఆ సందర్భంగా మెట్టుకో అస్త్రాన్ని విడిచిపెట్టాడు అయ్యప్ప స్వామి.

Continues below advertisement

Also Read: శనివారం మకర సంక్రాంతి... మీపై శనిప్రభావం ఉండకూడదనుకుంటే ఇలా చేయండి..
అయ్యప్పస్వామి 18 మెట్ల దగ్గర జారవిడిచిన అస్త్రాలు
1. శరం 2. క్షురిక 3. డమరుకం 4. కౌమోదకం 5. పాంచజన్యం 6. నాగాస్త్రం 
7. హలాయుధం 8. వజ్రాయుధం 9. సుదర్శనం 10. దంతాయుధం 
11. నఖాయుధం 12. వరుణాయుధం 13. వాయువ్యాస్త్రం 14. శార్ఞాయుధం 
15. బ్రహ్మాస్త్రం 16. పాశుపతాస్త్రం 17. శూలాయుధం 18. త్రిశూలం

Also Read: బసవన్నగా శివయ్య , హరిదాసుగా శ్రీహరి .. ఆ సంబరమే వేరప్పా…
18 మెట్ల పేర్లు
1. అణిమ 2. లఘిమ 3. మహిమ 4. ఈశ్వత 5. వశ్యత 6. ప్రాకామ్య 
7. బుద్ధి 8. ఇచ్ఛ 9. ప్రాప్తి 10. సర్వకామ 11. సర్వ సంపత్కర 12. సర్వ ప్రియకర 
13. సర్వమంగళాకార 14.సర్వ దుఃఖ విమోచన 15.సర్వ మృత్యుప్రశమన 
16. సర్వ విఘ్ననివారణ 17.సర్వాంగ సుందర 18.సర్వ సౌభాగ్యదాయక

Also Read:  సంక్రాంతి అనగానే మహానగరాల నుంచి పల్లెబాట పడతారెందుకు...
18 మెట్లు అష్టాదశ దేవతలు
1.మహాంకాళి 2. కళింకాళి 3.భైరవ 4.సుబ్రహ్మణ్య 5.గంధర్వరాజ
6.కార్తవీర్య 7. కృష్ణ పింగళ 8. హిడింబ 9.బేతాళ 10. నాగరాజ 
11. కర్ణ వైశాఖ 12. పుళిందిని 13. రేణుకా పరమేశ్వరి 14. స్వప్న వారాహి 
15.ప్రత్యంగళి 16.నాగ యక్షిణి 17. మహిషాసుర మర్దని 18. అన్నపూర్ణేశ్వరి
మెట్లపై ఏం వదిలేయాలంటే 
ఒక్కో సంవత్సరం ఒక్కో మెట్టుమీద ఒక్కో మాయాపాయాన్ని వదిలేయాలని గురుస్వాములు చెబుతారు.  

Also Read:  భోగి పళ్లుగా రేగు పళ్లు ఎందుకు పోస్తారు… వీటికి-దిష్టికి ఏంటి సంబంధం…
ఏ మెట్టు దేనికి సూచన
మొదటి 5 మెట్లు పంచేంద్రియాలకు సూచన. మనుషుల చూపు ఎప్పుడు మంచివాటిపైనే ఉండాలని సూచిస్తుంది. మంచి వినాలి, మంచి మాట్లాడాలి, తాజా శ్వాస పీల్చుకోవాలని సూచన.
తర్వాతి  8 మెట్లు అష్టరాగాలకు సంకేతం. అంటే కామం, క్రోధం, లోభం, మోహం, మధం, మాస్తర్యం, అసూయ, దర్పాన్ని  విడిచిపెట్టి మంచి మార్గంలో వెళ్లాలని సూచిస్తాయి.
ఆ తర్వాత 3 మెట్లు సత్వం, తామసం, రాజసానికి సూచన
చివరి రెండు మెట్లు విద్య- అవిద్యను సూచిస్తాయి. విద్య అంటే జ్ఞానం. అంతా జ్ఞానం పొందేందుకు అవిద్య అనే అహంకారాన్ని వదిలిపెట్టాలని సంకేతం.

Also Read:  మీ సరదా సరే..దయచేసి భోగి మంటల్లో ఇవి మాత్రం వేయకండి..
శబరిగిరిచుట్టూ ఉన్న కొండలకు ఈ 18 మెట్లు ప్రతీక 
1.పొన్నాంబళమేడు 2. గౌదవమల 3. నాగమల 4. సుందరమల 5. చిట్టమ్బలమల 6. ఖలిగిమల 7. మాతంగమల 8. దైలాదుమల 9. శ్రీపాదమల 10. దేవరమల 11. నీల్కల్‌మల 12. దాలప్పార్‌మల 13. నీలిమల 14. కరిమల 15. పుత్తుశేరిమల 16. కాళైకట్టి మల 17. ఇంజప్పార మల 18. శబరిమల
ఇలా  ఆధ్యాత్మికత నుంచి ఓ మనిషికి ఉండాల్సిన లక్షణాలు, వదిలేయాల్సిన దుర్గుణాల వరకూ అన్నింటికీ ఈ 18 ఓ సంకేతం. అందుకే  18 కొండలు దాటి 18 మెట్లు ఎక్కిన తర్వాత స్వామి దర్శనం కలుగుతుంది. 

Also Read:  అన్నమయ్య పాటల్లోనూ సంక్రాంతి గొబ్బిళ్లకు ప్రత్యేక స్థానం...
Also Read: ఏడాదంతా పండుగలే.. మరి సంక్రాంతినే పెద్దపండుగ అంటారెందుకు...
Also Read: గతేడాది ఎలా చేశారో తెలియదు కానీ… ఈ సంక్రాంతికి ఇలా చేయండి
Also Read:  మకర సంక్రాంతి రోజు సూర్యుడి ఆశీర్వాదం కావాలంటే ఇలా చేయకుండా ఉంటే చాలు...
Also Read:  సంక్రాంతికి శ్రీశైలం మల్లన్న కల్యాణం, భక్తులకు ఈ నిబంధనలు తప్పనిసరి...
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Continues below advertisement