లేత చివురులపై మంచు ముత్యాలు...ఉదయభానుడి లేలేత కిరణాలు, కోడి కూతల సుప్రభాతాలు, తొలకరి మట్టి వాసనలు, ఎర్రగా పండిన గోరింటాకు చేతులు, వెచ్చని బావి నీళ్ళు, బంతి చామంతిల కమ్మని సువాసనలు, వేప చెట్ల తీపి గాలులు, రంగవల్లులూ, గంగిరెద్దులూ, హరిదాసులు.. చదివితుంటేనే వామ్మో ఇన్నా అనిపిస్తోంది కదా..మరి ఇన్ని ఆనందాలన్నీ అనుభవిస్తే ఇంకెలా ఉంటుంది...కాంక్రీట్ జంగిల్లో ఇవన్నీ సాధ్యమయ్యేనా..అందుకే సంబరాల ఉత్సాహాన్ని క్షణం క్షణం రెట్టింపు చేసే పల్లెలంటే అందరీ అంతిష్టం.
Also Read: భోగి పళ్లుగా రేగు పళ్లు ఎందుకు పోస్తారు… వీటికి-దిష్టికి ఏంటి సంబంధం…
ప్రకృతితో మనిషి మమేకమయ్యే అసలైనపండగ సంక్రాంతి. చల్లని గాలులు, పచ్చని పైరులు, ధాన్యపు రాశులతో నిండే ఇళ్లూ. ముంగిట్లో ఇంద్ర ధనస్సును నిలిపే రంగవల్లులు, డూ డూ బసవన్నల నృత్యాలు, ఉషోదయాన హరిదాసులు చేసే సందడి...ఇవన్నీ పల్లెకే సొంతమైన అందమైన దృశ్యాలు. ఇంకా భోగిమంటలు, భోగిపళ్లు, బొమ్మల కొలువులు, రంగవల్లులు, గంగిరెద్దులు, హరిదాసులు, కోడిపందేలు, పతంగులు, ఎడ్లపందాలు, ధాన్యపురాశులు, పశువుల పూజలు, అంతకు మించి అమ్మ చేసే పిండివంటలు....ఇవన్నీ కలగలిసి చేసుకునే అపురూపమైన అతి పెద్ద పండగిది. అందుకే పల్లెకు ఎంతెంత దూరంలో ఉన్నా..సంక్రాంతికి పల్లెకు పరుగులుతీస్తారు. ఊరుని తలుచుకోగానే వచ్చే ఆనందం ఒకెత్తైతే.... పుట్టిన ఊరి మట్టివాసన తగలగానే ఆ ఉత్సాహమే వేరు. పంటపొలాల చుట్టూ పరుగులు పెట్టిన జ్ఞాపకాలు, చెరువుల్లో ఈతలు, చిన్ననాటి స్నేహితులతో ముచ్చట్లు...ఇలా ఎన్నో తీపి గుర్తులను మనతో పాటూ తీసుకెళ్లే పండుగే సంక్రాంతి.
Also Read: అన్నమయ్య పాటల్లోనూ సంక్రాంతి గొబ్బిళ్లకు ప్రత్యేక స్థానం...
సంక్రాంతి పండుగ వచ్చేనాటికి ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికొస్తుంది. రైతు కళ్లు ఆనందంతో చెమరుస్తాయి. ఆ ఆనందం పండుగకు కొత్త కళ తెస్తాయ్. అన్నదాత ఆనందంగా ఉంటే ప్రతిరోజూ పండుగే అన్న మాట కూడా వాస్తవమేనేమో అనిపిస్తుంది. దుక్కు దున్నినప్పటి నుంచీ యజమానికి సహకరించే ఎద్దులు, పండిన పంటను బస్తాలకెత్తి ఇంటికి చేర్చేప్పుడు సంబరంగా పరుగులు తీస్తాయ్. తనని పూజిస్తున్న యజమానికి వరాలిచ్చాం అన్నంత ఆనందంగా కనిపిస్తాయ్. ఇంకా భోగిమంటలు, రంగు ముగ్గులు,గొబ్బెమ్మలు,ఇల్లంతా అలంకరణలు, పాడిపశువుల పూజలు...ఇలా మలుపూ ఆసక్తే....ప్రతిక్షణమూ సంబరమే. అసలు పండుగకి ఊరెళ్లేదే....పల్లెకే పరిమితమైన సంబరాన్ని చూసేందుకు.
Also Read: ఏడాదంతా పండుగలే.. మరి సంక్రాంతినే పెద్దపండుగ అంటారెందుకు...
Also Read: గతేడాది ఎలా చేశారో తెలియదు కానీ… ఈ సంక్రాంతికి ఇలా చేయండి
Also Read: తిరుమల శ్రీవారిని మొదటి గడప నుంచి దర్శించుకునే అవకాశం.. సామాన్యుడి కల తీరినట్టేనా....!
Also Read: మకర సంక్రాంతి రోజు సూర్యుడి ఆశీర్వాదం కావాలంటే ఇలా చేయకుండా ఉంటే చాలు...
Also Read: సంక్రాంతికి శ్రీశైలం మల్లన్న కల్యాణం, భక్తులకు ఈ నిబంధనలు తప్పనిసరి...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి