By: ABP Desam | Updated at : 27 Jul 2022 10:44 AM (IST)
ఒక్క నెల కరెంటు బిల్లు చూసి ఆస్పత్రిలో అడ్మిట్ అయిన యజమాని, బిల్లు ఎంతంటే?
Electricity Bill: మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ నగర శివ్ విహార్ కాలనీలో నివాసం ఉంటుంన్న ప్రియాంక గుప్తా కుటుంబం అయిదారు రోజుల క్రితం తమ ఇంటికి వచ్చిన విద్యుత్ బిల్లను చూసి అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ఒక్కసారిగా కల్లు తేలేసి... పిచ్చి పిచ్చిగా ప్రవర్తించింది. మొత్తం 3 వేల 419 కోట్ల విద్యుత్ బిల్లు రావడం చూసిన ఈ ఇంటి పెద్ద (ప్రియాంక మామ) తీవ్ర అస్వస్థతకు గురైంది. ప్రియాంక గుప్తా భర్త సంజీవ్ కంకణె మాట్లాడుతూ... జులై 20న వచ్చిన ఈ బిల్లును విద్యుత్తు శాఖ పోర్టల్ ద్వారా పరిశీలించినా అంతే మొత్తం వచ్చినట్లు చెప్పారు.
1300 కు బదులుగా మూడున్నర వేల కోట్ల బిల్లు..
ఈ విషయాన్ని రాష్ట్ర పవర్ కంపెనీ దృష్టికి తీసుకెళ్లగా... జరిగిన పొరపాటును గుర్తించారు. అది మానవ తప్పిదమే అని చెప్తూ.. మీకు కేవలం 1300 రూపాయల బిల్లు మాత్రమే వచ్చిందని వివరించారు. అదే బిల్లును సవరించి ఇచ్చారు. ఇంతకూ ఏం జరిగిందంటే... విద్యుత్తు బిల్లు పంపిణీకి వచ్చిన ఉద్యోగి సాప్ట్ వేర్ లో యూనిట్లు అని ఉన్నచోట పొరపాటున వినియోగదారు లంఖ్యను రాశారు. దీంతో బిల్లు రూ. కోట్లలోకి వెళ్లిపోయింది. అయితే పలు మార్లు సరిచూసుకోమ్మని చెప్పినా అతను అంతే వచ్చిందని చెప్పాడంటూ బాధితులు వాపోయారు. అయితే రాష్ట్ర విద్యుత్త్ శాఖ అధికారులు... సంబంధిత విద్యుత్ ఉద్యోగిపై చర్యలు తీసుకుంటామని వివరించారు. ఈ విషయంపై ఆ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి ప్రద్యుమ్న సింగ్ తోమర్ తెలిపారు.
తెలంగాణలోనూ ఇలాంటి ఘటనే..
గత మూడు నెలల క్రితం తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ సామాన్య మధ్య తరగతికి చెందిన ఓ వ్యక్తికి దాదాపు 3 కోట్లకు పైగా బిల్లు వచ్చింది. అపార్ట్ మెంట్ లోని ఓ ఫ్లాట్ లో ఉండే వారికి ప్రతి నెల 200 రూపాయల కంటే ఎక్కువ రాదు. కానీ ఈ నెలలో ఫిబ్రవరి నెలలో మాత్రం వచ్చిన కరెంటు బిల్లును చూస్తే వారికి నిజంగానే షాక్ కు గురి చేసింది. కానీ కరెంటు బిల్లు అక్షరాలా.. 3 కోట్ల రూపాయల 20 లక్షల 5 వేల 218 రూపాయల కరెంటు బిల్లు వచ్చింది. సర్వీసు నెంబర్ కు ఉన్నన్ని సంఖ్యల్లా ఉన్న బిల్లు మొత్తాన్ని చూసి ఇంటి యజమాని షాక్ అయ్యాడు.
మహబూబాబాద్ పట్టణంలో కృష్ణవేణి స్కూల్ సమీపంలోని బొల్లం నాగేశ్వరరావు అపార్ట్ మెంట్ లో ప్లాట్ నెంబర్ 302కు భారీ మొత్తంలో విద్యుత్ బిల్లు వచ్చింది. ప్రతి నెల రూ.200లోపు వచ్చే బిల్లు.. ఈసారి రూ.3 కోట్లకు పైగా రావడంతో ఇంటి యజమానితో పాటు అపార్ట్ మెంట్ వాసులు అవాక్కయ్యారు. విద్యుత్ బిల్లు విషయంలో ఎక్కడో తప్పు జరిగి ఉంటుందని.. సరి చేసి ఇవ్వాలని కోరగా.. బిల్లుపై ప్రింట్ తప్పు పడిందని అధికారులు చెప్పారు. త్వరలోనే సరిచేసి ఇస్తామని హామీ ఇచ్చి ఆ తర్వాత కరెక్టు బిల్లును మార్చి ఇచ్చారు.
Nikhat Zareen Gold Medal : నిఖత్ జరీన్ కు సీఎం కేసీఆర్ ఫోన్, స్వర్ణ పతకం సాధించడంపై సంతోషం వ్యక్తం
Commonwealth Games 2022: కాంస్యం గెలిచిన మహిళా హాకీ జట్టుకు ప్రధాని అభినందనలు!
ప్రధాని మోదీకి పాకిస్థాన్‌లో ఓ సిస్టర్ ఉంది, రాఖీ కూడా పంపింది
Flag Hoisting: జాతీయ జెండాను RSS ఎందుకు ఎగరేయటం లేదు? కాషాయ రంగుని మాత్రమే గుర్తిస్తోందా?
JEE Advanced 2022 registration : నేటి నుంచి జేఈఈ అడ్వాన్స్ డ్ రిజిస్ట్రేషన్, ఇలా దరఖాస్తు చేసుకోండి!
CM Jagan : వ్యవసాయం, విద్యా రంగాలకు అత్యంత ప్రాధాన్యత- సీఎం జగన్
Nikhat Zareen Wins Gold: తెలంగాణ అమ్మాయి పంచ్ పవర్ - బాక్సర్ నిఖత్‌కు స్వర్ణం
Shruti Haasan: నాకోసం అమ్మ నాన్న ఎవరికీ ఫోన్లు చేయలేదు - కష్టం ఎవరికైనా ఒకటే: శ్రుతిహాసన్
Moto G62 5G: మోటొరోలా చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - రూ.15 వేలలోపే!