అన్వేషించండి

సూసైడ్ చేసుకుంటాను.. 2012 యూపీ ఎన్నికలకు ముందు Manmohan Singh అంత మాట అన్నారా ? సంచలన విషయాలు

భారత ఎన్నికల మాజీ కమిషనర్ ఎస్.వై. ఖురేషీ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు సంబంధించి ఒక పెద్ద విషయాన్ని వెల్లడించారు. మన్మోహన్ గొప్ప నేత అని తన పుస్తకంలో రాశారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • 2012లో, యూపీ ఎన్నికల సమయంలో ఖుర్షీద్ వ్యాఖ్యలపై ఈసీ చర్య.
  • ఈసీపై మంత్రుల విమర్శలు ఖురేషీని రాజీనామాకు పురికొల్పాయి.
  • ఆందోళనగా మన్మోహన్
  • ఈసీ మన ప్రజాస్వామ్యానికి ఆత్మంటూ మన్మోహన్ విమర్శలు ఆపారు.

2012లో ప్రధానమంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్, అప్పటి భారత ఎన్నికల కమిషనర్ (CEC) ఎస్.వై. ఖురేషీతో ‘నేను ఆత్మహత్య చేసుకుంటాను..’ అని అన్నారు. ఎన్నికల సంఘం పనితీరుపై కొందరు మంత్రులు చేసిన అర్థరహిత వ్యాఖ్యల పట్ల తీవ్ర అసంతృప్తికి లోనైన ఖురేషీ, తన రాజీనామా లేఖను ప్రధానమంత్రి కార్యాలయానికి పంపిన తరువాత ఈ ఘటన జరిగింది. అంతేకాకుండా, ‘ఈసీ కేవలం భారత కీర్తి కిరీటమే కాదు, దేశ ప్రజాస్వామ్యానికి ఆత్మ వంటిది. ఒకవేళ మనం దాన్ని కోల్పోతే, సర్వస్వం కోల్పోయినట్లే’ అని మాజీ ప్రధాని మన్మోహన్ అప్పటి సీఈసీ ఖురేషీతో అన్నారు.

సల్మాన్ ఖుర్షీద్‌తో మొదలైన వివాదం
ఈ ఆసక్తికరమైన సంభాషణను ఖురేషీ తన విడుదల కానున్న బుక్ ‘ఇండియా అండ్ ఐ: ఏ హండ్రెడ్ మెమోరీస్, నాట్ ఏ మెమోయిర్’లో ప్రస్తావించారు. తన పుస్తకంలో, మాజీ ఎన్నికల కమిషనర్ మాజీ ప్రధాని మన్మోహన్ ను ఒక ఉన్నతమైన నాయకుడిగా పేర్కొన్నారు. మన్మోహన్ సింగ్‌కు రాజ్యాంగబద్ధమైన మర్యాదలు కేవలం ప్రసంగాలకే పరిమితం కాదని, ఆయన ప్రవర్తన, ఆలోచనలలో అంతర్భాగం అన్నారు. 

ఖురేషీ తెలిపిన వివరాల ప్రకారం.. జనవరి 2012లో ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో అప్పటి కేంద్ర న్యాయశాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ఒక ఎన్నికల ర్యాలీలో.. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఉద్యోగాలలో ముస్లిం రిజర్వేషన్లను 4.5 శాతం నుండి 9 శాతానికి పెంచుతామని హామీ ఇచ్చారు.

కాంగ్రెస్, బీజేపీల మధ్య పోరు

దీనిపై ఖురేషీ ఇలా పేర్కొన్నారు. ‘ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై, ఎన్నికల నియామకవళి అమలులోకి వచ్చాక ఎలాంటి కొత్త పథకాలు ప్రకటించకూడదు. ఇది స్పష్టంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘనేనని బీజేపీ వెంటనే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.‘మేము న4 రోజుల పాటు దీనిపై విచారణ జరిపాం. కాంగ్రెస్ తరఫున అభిషేక్ మను సింఘ్వి, బీజేపీ తరఫున అరుణ్ జైట్లీ తమ వాదనల్ని వినిపించారు. ఇద్దరు ప్రముఖ లాయర్లు.. ఎన్నికల హామీలకు, ఓటర్లను ప్రలోభపెట్టడానికి మధ్య గీత ఎక్కడ గీయాలనే అంశంపై ఆలోచిస్తున్నారు. చివరకు ఎన్నికల సంఘం ఖుర్షీద్‌ను తప్పుబడుతూ అభిశంసించింది’ అన్నారు.

Also Read: Nagarjuna Yadav Arrest: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్

ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతల కామెంట్లు

ఎన్నికల నియామకవళి ప్రకారం కమిషన్‌ తీసుకున్న అత్యంత కఠినమైన చర్య ఇదేనని జూలై 2010 నుండి జూన్ 2012 వరకు సీఈసీగా పనిచేసిన ఖురేషీ పేర్కొన్నారు. ఈసీ తీసుకున్న ఈ చర్యపై ఖుర్షీద్ అసంతృప్తితో ఉన్నారని ఆయన తెలిపారు. ఎన్నికల సంఘం అహంకారపూరితంగా లేదా ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ కాంగ్రెస్ పార్టీ నుంచి వినిపించింది. దీనిపై ఖురేషీ పుస్తకంలో ఇలా రాశారు. ‘విమర్శలు నన్ను ఇబ్బంది పెట్టవు. కానీ వ్యవస్థల విశ్వసనీయతను దెబ్బతీసేలా పరోక్షంగా చేసే వ్యాఖ్యలు నన్ను కలవరపెట్టాయి. ఇలాంటి అర్థరహితమైన వ్యాఖ్యలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కావు’.

ఈద్ పండగ సందర్భంగా తన నివాసంలో ఖురేషీ వార్షిక మిలన్ వేడుకను ఏర్పాటు చేశారు. అతిథులలో అప్పటి ప్రధాని ప్రెస్ సెక్రటరీ హరీష్ ఖరే కూడా ఉన్నారు. సంభాషణల మధ్య ఖురేషీ తన అసంతృప్తిని ఆయనకు తెలిపారు. "నేను ఈ విషయాన్ని ప్రధాని మన్మోహన్‌కు చెప్పాలా?" అని హరీష్ ఖరే అడగ్గా, ‘నేను మీకు ఈ విషయం అందుకే చెప్తున్నానని’  ఖురేషీ సమాధానమిచ్చారు. మరుసటి రోజు ఖురేషీ ‘ర్యాక్స్’ (రిస్ట్రిక్టెడ్ యాక్సెస్ ఎక్స్ఛేంజ్) ఫోన్ మోగగా.. అవతలి వైపు నుండి, "ప్రధాని మీతో అత్యవసరంగా మాట్లాడాలనుకుంటున్నారు" అని చెప్పారు. మన్మోహన్ సింగ్ లైన్లోకి వచ్చారు. ఆయన గొంతులో తీవ్ర ఆందోళన కనిపిస్తోంది. ఖురేషీ గారూ, నేను మిమ్మల్ని వెంటనే కలవవచ్చా? అని మన్మోహన్ అడిగారు.

నేను ఆత్మహత్య చేసుకుంటా: మన్మోహన్ సింగ్
ఖురేషీ తెలిపిన వివరాల ప్రకారం.. మన్మోహన్ సింగ్ మాట్లాడిన తీరు చూస్తే ఆయనే స్వయంగా తనను కలవడానికి వచ్చేలా ఉన్నారు. ‘సర్, మీరు దేశ ప్రధాని. మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు నేను వస్తానని చెప్పాను. ఆ రోజు రాత్రి 7 గంటలకు మీటింగ్ ఖరారైంది. సాయంత్రం ఖురేషీ ప్రధాని నివాసానికి చేరుకున్నారు. ‘మన్మోహన్ సింగ్ స్వయంగా తలుపు వద్ద నా కోసం వేచి చూస్తున్నారు. నన్ను లోపలికి తీసుకువెళ్లారు. మేం ఇంకా సరిగ్గా కూర్చోకముందే, ఆయన అత్యంత బాధతో.. ‘మీరు అన్న మాటల్ని హరీష్ నాకు చెప్పారు. ఒకవేళ మీరు కూడా అలాగే భావిస్తే, నేను ఆత్మహత్య చేసుకుంటానని’ మన్మోహన్ అన్నారు. ఇది విని తాను ఒక్కసారిగా షాకయ్యారని ఖురేషీ తన బుక్ లో రాశారు.

తన ఫిర్యాదు కేవలం కొందరు మంత్రుల గురించేనని, మన్మోహన్ సింగ్ గురించి కాదన్నారు. ఖురేషీ ప్రకారం, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఎల్లప్పుడూ ఎన్నికల సంఘాన్ని దేశ కీర్తిగా, దేశం సాఫ్ట్ పవర్‌గా అభివర్ణించేవారు. ఖురేషీకి తన ఉద్దేశాలపై అనుమానం కలిగిందనే ఊహను కూడా అప్పటి ప్రధాని తట్టుకోలేకపోయారు. మన్మోహన్ సింగ్ ఆయనతో, ‘ఒకవేళ ఈ విషయం నాకు తెలిసి ఉంటే, నేను వారిని తీవ్రంగా మందలించేవాడిని. మీకు ఏదైనా చెప్పాలనిపిస్తే, కేవలం ఫోన్ చేసి నాతో మాట్లాడండని’ చెప్పారు.

Also Read: CM Revanth Reddy: కిలాడీల కమిటీ ఢిల్లీ వెళ్లి ఎన్డీఎస్‌ఏను ఒప్పించాలి - కాళేశ్వరంపై హరీష్ , కేటీఆర్, ఈటలకు రేవంత్ సవాల్

ఈసీ మన ప్రజాస్వామ్యానికి ఆత్మ: మన్మోహన్ సింగ్
‘ఎన్నికల సంఘం కేవలం భారత కీర్తి మాత్రమే కాదు, మన ప్రజాస్వామ్యానికి ఆత్మ. దీనిని మనం కోల్పోతే, అన్నింటినీ కోల్పోయినట్లే’ అని మన్మోహన్ అన్న మాటల్ని ఖురేషీ గుర్తుచేసుకున్నారు. ఈ ఘటన తననుకదిలించిందని పేర్కొన్నారు.  దానికి కారణం రాజ్యాంగబద్ధమైన మర్యాదలు కేవలం ప్రదర్శన కోసం కాకుండా, తన ప్రవర్తనలో, ఆలోచనలలో అంతర్భాగం చేసుకున్న ఒక గొప్ప నాయకుడిని తాను చూశానన్నారు. 

ఖురేషీ ఈ సంభాషణల వివరాలను అప్పటి పీఎం ప్రధాన కార్యదర్శి టి.కె.ఎ. నాయర్, జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్‌లకు తెలిపారు. హరీష్ ఖరే కూడా తన మిత్రులతో ఈ విషయాన్ని షేర్ చేసుకున్నారు. ఈ సమావేశం తర్వాత ఈసీపై వస్తున్న విమర్శలు పూర్తిగా ఆగిపోయాయని ఖురేషీ తెలిపారు.

Frequently Asked Questions

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఎవరితో

ఆయన అప్పటి భారత ఎన్నికల కమిషనర్ (CEC) ఎస్.వై. ఖురేషీతో అలా అన్నారు. ఎన్నికల సంఘం పనితీరుపై మంత్రులు చేసిన వ్యాఖ్యల పట్ల ఖురేషీ రాజీనామా లేఖ పంపిన తర్వాత ఈ ఘటన జరిగింది.

ఎన్నికల సంఘంపై మంత్రుల వ్యాఖ్యలకు ప్రధాన కారణం ఏమిటి?

2012 ఉత్తరప్రదేశ్ ఎన్నికల సమయంలో ముస్లిం రిజర్వేషన్లపై సల్మాన్ ఖుర్షీద్ హామీ ఇచ్చారు. దానిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవడంతో కొందరు కాంగ్రెస్ నాయకులు ఈసీ పనితీరును విమర్శించారు.

ఎన్నికల సంఘం గురించి మన్మోహన్ సింగ్ అభిప్రాయం ఏమిటి?

ఆయన ఎన్నికల సంఘాన్ని భారత కీర్తి కిరీటంగా, దేశ ప్రజాస్వామ్యానికి ఆత్మగా భావించారు. ఈసీని కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్లేనని ఆయన పేర్కొన్నారు.

ఈ ఆసక్తికరమైన సంభాషణను ఎక్కడ ప్రస్తావించారు?

ఎస్.వై. ఖురేషీ తన విడుదల కానున్న బుక్ ‘ఇండియా అండ్ ఐ: ఏ హండ్రెడ్ మెమోరీస్, నాట్ ఏ మెమోయిర్’లో ఈ సంభాషణను ప్రస్తావించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
IRCTC Japan Tour Package : IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే
IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
Advertisement

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Amaravati Seed Access Road: అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
LPG Lite Instant Cylinder: విశాఖలో భారత్ గ్యాస్ 'జిప్ సిలిండర్' ప్రారంభం.. కేవలం 4 గంటల్లోనే డెలివరీ!
విశాఖలో భారత్ గ్యాస్ 'జిప్ సిలిండర్' ప్రారంభం.. కేవలం 4 గంటల్లోనే డెలివరీ!
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Embed widget