Goa News: గోవా బీచ్‌లో దారుణం- బ్రేకప్ చెప్పిందని యువతిని కత్తితో పొడిచి, బాడీని పొదల్లో పారేశాడు!
Goa News: తనకు బ్రేకప్ చెప్పిందనే కోపంతో ప్రియురాలిని కత్తితో పొడిచి చంపాడు ఓ యువకుడు.
Goa News: అమ్మాయి ప్రేమించలేదని, బ్రేకప్ చెప్పిందనే కోపంతో వారిపై దాడులు చేస్తోన్న ఘటనలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. తనను కాదని వెళ్లిపోయిందనే బాధ, కోపం తట్టుకోలేక కొందరు యువతుల ప్రాణాలను తీసేస్తున్నారు. తాజాగా ఇలాంటి షాకింగ్ ఘటనే జరిగింది. తనకు బ్రేకప్ చెప్పిందని ప్రియురాలిని కిరాతకంగా హత్య చేశాడు ఓ యువకుడు.
గోవా బీచ్‌లో
గోవాకు చెందిన కిషన్ కలంట్కర్(26) అనే యువకుడు కాలేజీలో చదువుతున్న19 ఏళ్ల యువతిని ప్రేమించాడు. కొనాళ్లపాటు వీరి ప్రేమ బాగానే సాగింది. అయితే మనస్పర్థల కారణంగా రిలేషన్‌షిప్ కొనసాగించడం ఇష్టం లేదని యువతి చెప్పింది. అనంతరం విడిపోదామని యువతి చెప్పి, అప్పటి నుంచి యువకుడితో కాల్స్, మెసేజస్ చేయడం కట్ చేసింది. దీంతో యువకుడు మనస్తానికి గురయ్యాడు.
బ్రేకప్‌ను తట్టుకోలేక యువతిని చంపేయాలని నిందితుడు అనుకున్నాడు. బుధవారం సౌత్ గోవాలోని వెల్సాన్ బీచ్‌కు వచ్చిన తన మాజీ ప్రియురాలిని తన వెంట తెచ్చుకున్న కత్తితో పొడిచి చంపాడు.
యువతి చనిపోవడంతో మృతదేహాన్ని బీచ్ పక్కనే ఉన్న పొదల్లో పడేసి అక్కడి నుంచి పారిపోయాడు. అయితే బీచ్ సమీపంలోని పొదల్లో యువతి మృత దేహాన్ని పోలీసులు గుర్తించారు. ఘటన జరిగిన 24 గంటల్లోపే నిందితుడిని పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు.
ఇటీవల
ఆంధ్రప్రదేశ్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఇటీవల ఇలాంటి దారుణమే జరిగింది. ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో ప్రియురాలిని యువకుడు గన్‌తో కాల్చాడు. అనంతరం ప్రేమికుడు కూడా తనను కాల్చుకుని చనిపోయాడు. యువతి ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయింది.
తాటిపర్తికి చెందిన మాలపాటి సురేష్ రెడ్డి, పొలకూరు కావ్య సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. కావ్యను ఇష్టపడిన సురేశ్ రెడ్డి తనను ప్రేమించాలని యువతిని పదేపదే విసిగించేవాడు. గతంలో బెంగళూరులో పనిచేసేవారు.. కానీ వర్క్‌ఫ్రమ్ హోం కావడంతో ఊర్లోనే ఉంటున్నారు. దీంతో తన బంధువుల ద్వారా కావ్య తల్లిదండ్రులతో పెళ్లి గురించి సంప్రదింపులు చేశాడు సురేశ్. అయితే సురేష్‌తో పెళ్లికి కావ్య కుటుంబసభ్యులు అంగీకరించలేదు. ఆ కక్షతోనే సురేశ్ రెడ్డి యువతిని కాల్చి అనంతరం తాను కాల్చుకున్నాడు.