అన్వేషించండి

Lok Sabha Elections: ఎన్నికల తేదీల్లో ప్రవేశ, నియామక, పోటీ పరీక్షలు - విద్యార్థులు, అభ్యర్థుల్లో ఆందోళన

ఎన్నికల తేదీల్లోనే పోటీపరీక్షలతోపాటు, ఉద్యోగ నియామక పరీక్షలు నిర్వహించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ మే నెలలో పలు ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. దీంతో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Loksabha Elections: దేశంలో లోక్‌సభ ఎన్నికలకు ఎన్నికల సంఘం మార్చి 16న నగరా మోగించింది. మొత్తం 7 దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. జూన్ 4న ఫలితాలను వెల్లడించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మే 13న ఒకే విడతలో అసెంబ్లీ/ లోక్‌సభ ఎన్నికలు జరగబోతున్నాయి.  లోక్‌సభ పోలింగ్ అదే రోజు లోక్‌సభ ఎన్నికలు నిర్వహించనున్నారు. అయితే ఎన్నికల తేదీల్లోనే జాతీయస్ధాయి పోటీపరీక్షలతోపాటు, ఉద్యోగ నియామక పరీక్షలు నిర్వహించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ మే నెలలో పలు ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. దీంతో ఆయా పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ఎన్నికల వల్ల  పరీక్ష సెంటర్ల కేటాయింపులు, ప్రజా రవాణా సౌకర్యాలకు ఇబ్బందులు తలెత్తవచ్చని భావిస్తున్నారు. దూరంగా సెంటర్ పడితే, అక్కడ సరైన సౌకర్యాలు లేకపోతే కష్టమవుతుందని భయపడుతున్నారు. మరోవైపు కొంతమంది తమ ఓటు హక్కు వినియోగించుకోడానికి అవకాశం లేకుండా పోతుందేమో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని ఏ విధమైన ఆటంకాలు, ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహించడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఎన్నికల షెడ్యూలుకు అనుకూలంగా గతంలో పలు పరీక్షల తేదీల్లో మార్పులు జరిగిన సందర్భాలూ ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఆ మేరకు మార్పులు జరిగే అవకాశం లేకపోలేదు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పరీక్షల తేదీల్లోనూ మార్పులు జరుగవచ్చని భావిస్తున్నారు.  

ఏయే తేదీల్లో ఏయే పరీక్షలు ఉన్నాయంటే?

➥ ప్రధానంగా తెలంగాణలో మే 9 నుంచి 12 వరకు TS EAPCET, ఏపీలో మే 13 నుంచి 19 వరకు AP EAPCET పరీక్షలు నిర్వహించబోతున్నారు. ఈ పరీక్షలకు దాదాపు 5 లక్షల మంది విద్యార్దులు హాజరుకానున్నారు. తెలంగాణలో మే 13న పోలింగ్‌ జరుగనుంది. అంటే మే 12న పోలింగ్‌ కేంద్రాలను పోలీసులు, అధికారులు స్వాధీనం చేసుకొంటారు. ఈ నేపథ్యంలో ఎప్‌సెట్‌ పరీక్షల నిర్వహణ సాధ్యమవుతుందా? లేదా..? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నా యి. ఇంజినీరింగ్‌ పరీక్షలను సజావుగా నిర్వహించవచ్చని, అగ్రికల్చర్‌, ఫార్మసీ పరీక్షలకు ఆటంకం ఏర్పడుతుందన్న భావన అధికారుల్లో వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో అగ్రికల్చర్‌, ఫార్మసీవిభాగం పరీక్షను వాయిదా వేయడ మా.. ? లేదా మొత్తానికి మొత్తం పరీక్షలను వాయిదా వేయాలా..? అని అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.

➥ ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్‌ ఐసెట్‌ పరీక్షలు వాయిదాపడనున్నాయి. ఐసెట్‌ పరీక్షలను జూన్‌ 4, 5న నిర్వహిస్తామని కాకతీయ యూనివర్సిటీ అధికారులు గతంలో ప్రకటించారు. పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్లలెక్కింపు కూడా జూన్‌ 4న జరుగనున్నది. అంటే, ఈ లెక్కన ఐసెట్‌ వాయిదావేయాల్సిన పరిస్థితి తలెత్తింది. 

➥ తెలంగాణలోని  ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతుల కోసం మే 13 నుంచి 21 వరకు నిర్వహించే డిపార్టుమెంటల్‌ పరీక్షలు జరుగుతాయా? లేదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో పార్లమెంట్‌ ఎన్నికలు మే 13న జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షల నిర్వహణపై అధికారులు ఒక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉన్నదని తెలిసింది.

➥ మరోవైపు ఉద్యోగ నియామక పరీక్షలకు సంబంధించి ఎన్నికల సమయంలోనే డిల్లీ పోలీసు, సెంట్రల్ ఆర్మ్‌డ్‌ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్)లో సబ్-ఇన్‌స్పెక్టర్ నియామకాలకు  మే 9, 10, 13 తేదీల్లో రాత పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు తెలుగు రాష్ట్రాల నుంచి వేలమంది అభ్యర్థులు హాజరవుతుంటారు.

➥ ఇక మే 2 నుంచి 13 వరకు ఐసీఏఐ సీఏ ఇంటర్, ఫైనల్ పరీక్షలు నిర్వహించనుంది. ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో విద్యార్థులు రాస్తుంటారు.

➥ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్షను మే 26న నిర్వహించనున్నట్లు యూపీఎస్సీ ఇప్పటికే ప్రకటించింది.

➥ కేంద్రీయ విద్యాలయాల్లో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్దేశించిన సీయూఈటీ యూజీ పరీక్షలు మే 15 నుంచి 31 వరకు నిర్వహించనున్నారు.

➥ ఇక జేఈఈ 2024 మెయిన్ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు మే 26న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష నిర్వహించడానికి షెడ్యూలు ఖరారు చేశారు.

ఏప్రిల్ 19 నుంచి లోక్‌సభ ఎన్నికలు, 7 విడతల్లో పోలింగ్..
లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్‌ని కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా విడుదల చేసింది. పోలింగ్ వివరాలు వెల్లడించింది. సీఈసీ రాజీవ్ కుమార్ పూర్తి షెడ్యూల్‌ని వెల్లడించారు. లోక్‌సభతో పాటు ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం ఎన్నికల తేదీలు ప్రకటించారు. 7 విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నట్టు ప్రకటించారు. ఏప్రిల్ 19 నుంచి ఈ ఎన్నికల ప్రక్రియ మొదలు కానుంది. జూన్ 4వ తేదీన కౌంటింగ్‌ జరగనున్నట్టు ఈసీ వెల్లడించింది.

ఏప్రిల్ 19న తొలి విడత లోక్‌సభ పోలింగ్‌ మొదలవుతుంది. ఏప్రిల్ 26న రెండో దశ  ఎన్నికలు జరుగుతాయి. మే7వ తేదీన మూడో దశ, మే 13 న నాలుగో దశ పోలింగ్ జరుగుతుందని ఈసీ స్పష్టం చేసింది. మే 20న ఐదో దశ, మే 25న ఆరో దశ, జూన్ 1వ తేదీన ఏడో దశ పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఒకేసారి ఫలితాలు విడుదలవుతాయి. తెలంగాణలో లోక్‌సభకు, ఏపీలో అసెంబ్లీకి, లోక్‌సభకు ఒకే విడతలో ఎన్నికలు జరుగనున్నాయి.

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి... 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IND vs SA 3rd T20: ధర్మశాలలో భారత్- దక్షిణాఫ్రికా మూడో టీ20.. పిచ్, వెదర్ రిపోర్ట్ సహా లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
ధర్మశాలలో భారత్- దక్షిణాఫ్రికా మూడో టీ20.. పిచ్, వెదర్ రిపోర్ట్ సహా లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
Pawan Kalyan Helps Cricketers: అంధ క్రికెటర్లు దీపిక, ప్లేయర్ కరుణ కుమారి కుటుంబాలకు అండగా నిలిచిన పవన్ కళ్యాణ్
అంధ క్రికెటర్ల కుటుంబాలకు అండగా నిలిచిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
The Paradise : నేచరల్ స్టార్ నాని 'ది ప్యారడైజ్' మేకింగ్ వీడియో - రక్తం పడిన తర్వాతే హిస్టరీ ఓపెన్
నేచరల్ స్టార్ నాని 'ది ప్యారడైజ్' మేకింగ్ వీడియో - రక్తం పడిన తర్వాతే హిస్టరీ ఓపెన్
Premante OTT : ఓటీటీలోకి లవ్ రొమాంటిక్ కామెడీ 'ప్రేమంటే' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి లవ్ రొమాంటిక్ కామెడీ 'ప్రేమంటే' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Abhishek Sharma to Break Virat Record | కోహ్లీ అరుదైన రికార్డుపై కన్నేసిన అభిషేక్
India vs South Africa 3rd T20 | భారత్ x సౌతాఫ్రికా మూడో టీ20
Robin Uthappa on Gambhir Ind vs SA | గంభీర్ పై ఉత్తప్ప కామెంట్స్
Suryakumar Yadav Form in SA T20 Series | సూర్య కుమార్ యాదవ్ పై ట్రోల్స్
Leonel Messi Kolkata Tour Hightension | కోల్ కతా సాల్ట్ లేక్ స్టేడియంలో తీవ్ర ఉద్రిక్తత | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SA 3rd T20: ధర్మశాలలో భారత్- దక్షిణాఫ్రికా మూడో టీ20.. పిచ్, వెదర్ రిపోర్ట్ సహా లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
ధర్మశాలలో భారత్- దక్షిణాఫ్రికా మూడో టీ20.. పిచ్, వెదర్ రిపోర్ట్ సహా లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
Pawan Kalyan Helps Cricketers: అంధ క్రికెటర్లు దీపిక, ప్లేయర్ కరుణ కుమారి కుటుంబాలకు అండగా నిలిచిన పవన్ కళ్యాణ్
అంధ క్రికెటర్ల కుటుంబాలకు అండగా నిలిచిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
The Paradise : నేచరల్ స్టార్ నాని 'ది ప్యారడైజ్' మేకింగ్ వీడియో - రక్తం పడిన తర్వాతే హిస్టరీ ఓపెన్
నేచరల్ స్టార్ నాని 'ది ప్యారడైజ్' మేకింగ్ వీడియో - రక్తం పడిన తర్వాతే హిస్టరీ ఓపెన్
Premante OTT : ఓటీటీలోకి లవ్ రొమాంటిక్ కామెడీ 'ప్రేమంటే' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి లవ్ రొమాంటిక్ కామెడీ 'ప్రేమంటే' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Top Mileage Cars in India: వ్యాగన్ ఆర్ నుంచి టాటా పంచ్ వరకు.. రూ.10 లక్షలలోపు అధిక మైలేజ్ ఇచ్చే కార్లు
వ్యాగన్ ఆర్ నుంచి టాటా పంచ్ వరకు.. రూ.10 లక్షలలోపు అధిక మైలేజ్ ఇచ్చే కార్లు
Maruti Brezza లేదా Nissan Magnite లలో ఏ SUV బెటర్- ధర, ఫీచర్లు చూసి డిసైడ్ అవ్వండి
Maruti Brezza లేదా Nissan Magnite లలో ఏ SUV బెటర్- ధర, ఫీచర్లు చూసి డిసైడ్ అవ్వండి
Shocking News: పాఠాలు వింటూ కుప్పకూలిన విద్యార్ధిని.. కోన‌సీమ జిల్లా రామ‌చంద్ర‌పురంలో విషాదం
పాఠాలు వింటూ కుప్పకూలిన విద్యార్ధిని.. కోన‌సీమ జిల్లా రామ‌చంద్ర‌పురంలో విషాదం
Masaka Masaka Song : ఓల్డ్ రొమాంటిక్ 'మసక మసక చీకటిలో...' - పాప్ సింగర్ స్మిత ర్యాప్ మిక్స్ విత్ న్యూ ట్రెండ్
ఓల్డ్ రొమాంటిక్ 'మసక మసక చీకటిలో...' - పాప్ సింగర్ స్మిత ర్యాప్ మిక్స్ విత్ న్యూ ట్రెండ్
Embed widget