Bharat Gaurav yatra: ఈ నెల 22 నుంచి భారత గౌరవ్ రైలు యాత్ర ప్రారంభం, తీర్థస్థలాలు సందర్శించేలా IRCTC ప్లాన్
Bharat Gaurav Train Yatra: ఈనెల 22 నుంచి భారత్ గౌరవ్ రైల్ యాత్ర ప్రారంభం కానుంది. ఎనిమిది రాత్రులు, తొమ్మిది పగళ్ళు యాత్రలో భాగంగా ఉండనున్నాయి. ఈ మేరకు రైల్వే అధికారులు వివరాలను ప్రకటించారు.
Bharat Gaurav Train : దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలో ఈనెల 22 నుంచి భారత గౌరవ్ రైల్ యాత్ర ప్రారంభం కానుంది. ఈ మేరకు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో యాత్రకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఐఆర్సిటిసితో కలిసి జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ యాత్ర పేరుతో టూరిస్ట్ సర్క్యూట్ ను ప్రారంభిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ యాత్ర ఈనెల 22న ప్రారంభం కానుంది. ఎనిమిది రాత్రులు, తొమ్మిది పగళ్ళు ఈ యాత్రలో భాగంగా ఉండనున్నాయి.
అరుణాచలం, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, త్రివేండ్రం, తిరుచ్చి, తంజావూరు వంటి దివ్య తీర్థ స్థలాలను సందర్శించేలా తొమ్మిది రోజులపాటు ఈ యాత్ర కొనసాగనుందని రైల్వే అధికారులు వెల్లడించారు. గూడూరు జంక్షన్ లో ఈ రైలు బయలుదేరుతుంది. సికింద్రాబాద్ జంక్షన్, హైదరాబాద్, కాజీపేట, వరంగల్, ఖమ్మం, నెల్లూరు, ఒంగోలు, తెనాలి, విజయవాడ, రేణిగుంట, కన్యాకుమారి, మధురై, రామేశ్వరం జంక్షన్, తంజావూర్, తిరుచి, త్రివేండ్రం వంటి ప్రాంతాలు మీదుగా ఈ యాత్ర ఉంటుందని రైల్వే అధికారులు వెల్లడించారు. మరిన్ని వివరాలకు ఐఆర్సిటిసి వెబ్ సైట్ ను సంప్రదించవచ్చు.