వర్క్ ఫ్రమ్ హోమ్ కుదరదు, నెలకు పది రోజులు ఆఫీస్‌కి రావాల్సిందే - ఇన్‌ఫోసిస్ ఆదేశాలు
Infosys Return to Office: ఉద్యోగులు నెలకు పది రోజులు ఆఫీస్‌కి రావాల్సిందేనని ఇన్‌ఫోసిస్ ఆదేశించింది.
Infosys Return to Office:
రిటర్న్ టు ఆఫీస్
కొవిడ్ సమయంలో ఐటీ కంపెనీలన్నీ వర్క్ ఫ్రమ్ హోమ్ (Work From Home) ఆప్షన్ ఇచ్చాయి. కరోనా పరిస్థితులు అంతా అదుపులోకి వచ్చినా ఇంకా చాలా మంది ఉద్యోగులు ఆఫీస్‌కి రావడం లేదు. తప్పనిసరిగా రావాలని కంపెనీలు వార్నింగ్ ఇస్తున్నప్పటికీ పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలోనే బడా కంపెనీలన్నీ ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా వ్యవహరిస్తున్నాయి. రిటర్న్ టు ఆఫీస్ (Return To Office) అమలు చేస్తున్నాయి. వారానికి కచ్చితంగా మూడు రోజులు రావాల్సిందే అని కొన్ని కంపెనీలు రూల్ పెడుతుంటే మరి కొన్ని మొత్తంగా ఐదు రోజులు రావాల్సిందే అని కండీషన్ పెడుతున్నాయి. ఇన్‌ఫోసిస్ (Infosys Return to Office) మాత్రం నెలకు కనీసం 10 రోజులు ఆఫీస్‌కి వచ్చి పని చేయాలని తేల్చి చెబుతోంది. ఇన్‌ఫోసిస్ వైస్‌ప్రెసిడెంట్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. కేటగిరీ 5,6 లోని ఉద్యోగులంతా నెలకు పది రోజుల పాటు ఆఫీస్‌కి రావాలని ఆదేశించారు. మిడ్ లెవల్ మేనేజర్స్, ప్రాజెక్ట్ లీడర్స్, ఎంట్రీ లెవల్ స్టాఫ్ ఈ రూల్‌ని పాటించాలని తేల్చి చెప్పారు. నవంబర్ 20 నుంచే ఈ రూల్ అమల్లోకి వచ్చింది. ఇప్పటికే ఆయా కేటగిరీల్లోని ఉద్యోగులకు ఈమెయిల్స్ పంపింది కంపెనీ. ఆఫీస్‌ని ఆపరేట్ చేసేందుకు అవసరమైన మినిమమ్ స్టాఫ్ ఉండాలని కంపెనీ తెలిపింది. Wipro, TCS, Capgemini ఇప్పటికే రిటర్న్ టు ఆఫీస్ రూల్‌ని ఫాలో అవ్వాలని ఉద్యోగులకు మెయిల్ పంపాయి. రెండు నెలల క్రితమే టీసీఎస్ వారానికి ఐదు రోజుల పాటు ఆఫీస్‌కి రావాలని ఆదేశించింది. ఇప్పటికే ఈ నిబంధన అమల్లోకి వచ్చింది.
అమెజాన్ కూడా..
ఇండియాలో రెండో అతి పెద్ద ఐటీ సంస్థ అయిన ఇన్‌ఫోసిస్ ఈ నిర్ణయం కాస్త ఆలస్యంగానే తీసుకుంది. ఇకపై రిమోట్ వర్క్ కల్చర్ క్రమంగా మారిపోనుంది. రిటర్న్ టు ఆఫీస్‌తో ఉద్యోగులు ఒకరితో ఒకరు కమ్యూనికేట్ అయ్యేందుకు వీలుంటుందని, టీమ్ వర్క్ కల్చర్ కూడా పెరుగుతుందని చెబుతోంది. అమెజాన్ రిటర్న్ టు ఆఫీస్ (Amazon return-to-office policy) పాలసీపై చాలా స్ట్రిక్ట్‌గా ఉంటోంది. వారానికి మూడు రోజుల పాటు కచ్చితంగా ఆఫీస్‌కి రావాల్సిందే అని రూల్ పెట్టింది. కానీ కొందరు ఉద్యోగులు ఈ రూల్‌ని పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలోనే అమెజాన్ సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. వారానికి మూడు రోజులు ఆఫీస్‌కి రాని ఉద్యోగులను తొలగించే అధికారాలను మేనేజర్‌లకి ఇచ్చింది. అటెండెన్స్ రిక్వైర్‌మెంట్‌కి తగ్గట్టుగా పని చేయని ఉద్యోగులను ఇంటికి పంపేయాలని ఆదేశించింది. ఈ విషయంలో ఎంత కచ్చితంగా ఉందో ఈ నిర్ణయాన్ని బట్టే అర్థమవుతోంది. ఇప్పటికే అమెజాన్ గ్లోబల్ మేనేజర్ గైడెన్స్‌ని అప్‌డేట్ చేసింది. సంస్థలోని ఇంటర్నల్ పోర్టల్‌లో మేనేజర్‌లందరికీ ఈ అప్‌డేట్‌ని షేర్ చేసినట్టు Insider రిపోర్ట్‌లు వెల్లడించాయి. ఉద్యోగులందరూ వారానికి మూడు రోజులు కచ్చితంగా ఆఫీస్‌కి వచ్చేలా చూసుకోవాలని ఆర్డర్ వేసింది కంపెనీ. అయితే...ఒకేసారి తొలగించకుండా దీనికో ప్రాసెస్‌ని కూడా పెట్టింది.
Also Read: Manipur Violence: మణిపూర్‌లో అప్పటి వరకూ ఇంటర్నెట్ బంద్, సోషల్ మీడియాని కట్టడి చేసేందుకేనట