Independence Day 2023 LIVE: ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేసిన ప్రధాని - దేశం అవకాశాల గని- యువతకు వినియోగించుకోవాలని సూచన
Independence Day 2023 LIVE Updates: 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని దేశం జరుపుకుంటోంది. చారిత్రాత్మక ఎర్రకోట నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ఈ వేడుకలకు నేతృత్వం వహిస్తారు.
LIVE

Background
విజయవాడలో జాతీయ జెండాను ఎగరేసిన సీఎం జగన్
విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పంద్రాగస్టు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించారు.
ఇది న్యూ ఇండియా దూసుకెళ్తుంది: మోదీ
ఎర్రకోటపై నుంచి ప్రధాని మోదీ మాట్లాడుతూ.. 'భారత నూతన పార్లమెంట్ ఇటీవలే నిర్మించాం. ఇది న్యూ ఇండియా. యావత్ ప్రపంచం ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్నప్పటికీ ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు భారత్ ఎన్నో ప్రయత్నాలు చేసింది. దేశంలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు అనేక చర్యలు తీసుకున్నామని, ఆ దిశగా తమ ప్రయత్నాలు కొనసాగుతాయన్నారు.
వచ్చే నెలలో విశ్వకర్మ యోజన ప్రారంభం
సంప్రదాయ నైపుణ్యాలున్న వారి కోసం వచ్చే నెలలో విశ్వకర్మ పథకాన్ని ప్రారంభించనున్నట్లు ఎర్రకోటపై నుంచి ప్రధాని మోదీ ప్రకటించారు. విశ్వకర్మ పథకంలో రూ.15,70 కోట్లు పెట్టుబడి పెడతామన్నారు.
దేశ ప్రజల ముందు గత పదేళ్ల చరిత్ర ఉంచుతున్నాం: మోదీ
2014లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 10వ స్థానంలో ఉన్నాం. ఈ రోజు మనం 5వ స్థానానికి చేరుకున్నాం. గతంలో ఇలా జరగలేదు. అప్పుడు అవినీతి దేశాన్ని పట్టిపీడించింది. 10 సంవత్సరాల లెక్కలను దేశ ప్రజల ముందు ఉంచుతున్నాను. గతంలో పేదలకు ఇళ్లు నిర్మించేందుకు రూ.90 వేల కోట్లు ఖర్చు చేశారు. నేడు నాలుగు లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నాం. గత ఐదున్నరేళ్లలో 5.13 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు.
'మేం తీసుకునే నిర్ణయాలు స్వర్ణ చరిత్రకు నాంది పలుకుతాయి'
ఎర్రకోటపై నుంచి ప్రధాని మోదీ మాట్లాడుతూ.. 'నేను 1000 సంవత్సరాల గురించి మాట్లాడుతున్నాను ఎందుకంటే దేశం ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని నేను చూస్తున్నాను. మనం జీవిస్తున్న యుగంలో ఏం చేస్తాం, వేసే అడుగులు, తీసుకుంటున్న నిర్ణయాలు ఒకదాని తర్వాత ఒకటి సువర్ణ చరిత్రకు నాంది పలుకుతాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

