అన్వేషించండి

శివసేన గుర్తుపై ఉద్ధవ్ థాక్రే సమాధానం కోరిన ఎన్నికల సంఘం

నవంబర్ 3న జరిగే అంధేరి (తూర్పు) అసెంబ్లీ ఉపఎన్నికలకు ముందు గుర్తుపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఏక్నాథ్ శిందే వర్గం కోరింది.

శివసేన విల్లు, బాణం గుర్తు తమకు ఇవ్వాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే వర్గం పోరాటం చేస్తోంది. దీనికి శనివారం మధ్యాహ్నం 2 గంటలలోగా సమాధానం ఇవ్వాలని ఎన్నికల సంఘం ఉద్ధవ్ ఠాక్రే వర్గాన్ని కోరింది. ఈ కేసులో విచారణ ప్రారంభించడానికి వీలుగా అక్టోబర్ 7 లోగా తమ వాదనలు వినిపించాలని, లిఖితపూర్వక ప్రకటన ఇవ్వాలని ఈసి గతంలో రెండు వర్గాలను కోరింది.

ఈ చిహ్నాన్ని దుర్వినియోగం చేయకుండా ఉండటానికి నవంబర్ 3 అంధేరి ఈస్ట్ సీటు ఉపఎన్నికకు ముందే ఈ గుర్తును తమకు కేటాయించాలని శిందే వర్గం కోరుతోంది. తమ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని శిందే వర్గం అక్టోబర్ 4న రాసిన లేఖలో ఈసిని కోరింది. ఈ ఏడాది మేలో శివసేన ఎమ్మెల్యే రమేష్ లట్కే మరణంతో ఈ స్థానం ఖాళీ అయింది. శివసేన ఎన్నికల చిహ్నం విల్లు బాణంను తనకు ఇవ్వాలని శిందే వర్గం డిమాండ్ చేసింది.

శిందే వర్గం వాదన ఏమిటి?

తమకు మెజారిటీ శివసేన సభ్యుల మద్దతు ఉందని పేర్కొంది శిందే శిబిరం. థాకరే నేతృత్వంలోని శివసేనకు మెజారిటీ మద్దతు లేదని పేర్కొంది. దీనిపై ఆ పార్టీ ఇంకా ఎలాంటి డాక్యుమెంట్స్ ఇవ్వలేదని ఆరోపిస్తోంది. శివసేనలో తిరుగుబాటు జరిగినప్పటి నుంచి అసలు సిసలైన శివసేన గురించి వివాదం నడుస్తోంది. ఏక్నాథ్ శిందే, ఉద్ధవ్ ఠాక్రే వర్గాలు తమను తాము నిజమైన శివసేన అని పిలుచుకుంటున్నాయి. ఈ పరిస్థితిలో ఎన్నికల సంఘం విచారణ చాలా ముఖ్యమైంది. ఏ వర్గానికి 'విల్లు, బాణం' గుర్తు పొందాలో నిర్ణయించాల్సి వస్తోంది. అలా కేటాయించిన పార్టీయే నిజమైన శివసేనగా మారనుంది. అందుకే ఈ గుర్తు కోసం రెండు వర్గాలు హోరాహోరీగా తలపడుతున్నాయి. 

ఎన్నికల గుర్తుల వాడకంపై నిషేధం ఉంటుందా?

వచ్చే ఎన్నికల్లో థాకరే వర్గీయులు విల్లు, బాణం గుర్తు ఉపయోగించకుండా చేసేందుకు శిందే వర్గీయులు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వాడుకుంటోందా వర్గం. అందులో భాగంగానే ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించింది. అంధేరి ఉపఎన్నికల్లో గుర్తు వాడకాన్ని నిషేధిస్తే మాత్రం ఠాక్రే నేతృత్వంలోని శివసేనకు పెద్ద ఎదురుదెబ్బ కానుంది.

సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

శివసేన ఎవరిదన్న అంశంలో మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ శిందే, మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే వర్గాల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. సుప్రీం కోర్టునీ ఆశ్రయించాయి ఇరు వర్గాలు. చాలో రోజుల్లో పెండింగ్‌లో ఉన్న విచారణపై ఈ మధ్య సుప్రీం కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఈ అంశంలో ఉద్ధవ్‌ ఠాక్రేకు సుప్రీం కోర్టులో భారీ షాక్ తగిలింది. ఉద్ధవ్ ఠాక్రే, ఏక్‌నాథ్ శిందే మధ్య ఏ వర్గాన్ని 'నిజమైన' శివసేన పార్టీగా గుర్తించాలి అనే అధికారం ఎన్నికల సంఘానికి ఉందంటూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది.

ఏక్‌నాథ్ శిందే గ్రూప్‌ను అసలైన శివసేనగా గుర్తించకుండా ఈసీని నిలువరించాలని ఉద్ధవ్ ఠాక్రే సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఒక రోజు సుదీర్ఘ విచారణ తర్వాత ఉద్ధవ్ ఠాక్రే గ్రూప్ దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది. 

టాప్ హెడ్ లైన్స్

Indias First Bullet Train: ముంబై నుంచి అహ్మదాబాద్‌కు కేవలం 2 గంటల జర్నీ.. 2027లో భారత్‌లో తొలి బుల్లెట్ రైలు పరుగులు
2 గంటల్లోనే ముంబై నుంచి అహ్మదాబాద్‌కు.. 2027లో భారత్‌లో తొలి బుల్లెట్ రైలు పరుగులు
Uttar Pradesh Elections Polarisation: అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
IRCTC South India Tour Package 2026 : IRCTC టూర్ ప్యాకేజీ 2026.. తిరుపతి, రామేశ్వరం, కన్యాకుమారి, శ్రీశైలం యాత్ర.. పూర్తి వివరాలు ఇవే
IRCTC టూర్ ప్యాకేజీ 2026.. తిరుపతి, రామేశ్వరం, కన్యాకుమారి, శ్రీశైలం యాత్ర.. పూర్తి వివరాలు ఇవే
Alluri Crime News: 8 ఏళ్ల చిన్నారిపై పాస్టర్ అమానుషం.. వేడి అట్లకాడతో వాతలు పెడుతూ ఫోన్ లో రికార్డ్
8 ఏళ్ల బాలికపై పాస్టర్ అమానుషం.. అట్లకాడతో వాతలు పెడుతూ ఫోన్లో రికార్డ్- అల్లూరి జిల్లాలో ఘటన

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rythu Bharosa Scheme: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
AP Local Body Elections 2026 Delay: ఏపీ లోకల్ పోల్స్‌పై చంద్రబాబు మౌనం - ఇంకెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు?
ఏపీ లోకల్ పోల్స్‌పై చంద్రబాబు మౌనం - ఇంకెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు?
IRCTC South India Tour Package 2026 : IRCTC టూర్ ప్యాకేజీ 2026.. తిరుపతి, రామేశ్వరం, కన్యాకుమారి, శ్రీశైలం యాత్ర.. పూర్తి వివరాలు ఇవే
IRCTC టూర్ ప్యాకేజీ 2026.. తిరుపతి, రామేశ్వరం, కన్యాకుమారి, శ్రీశైలం యాత్ర.. పూర్తి వివరాలు ఇవే
Musi River Cleaning Execution Deadline: మూసి ప్రాజెక్టుపై మాటల కంటే చేతలకే మైలేజ్ - రెండున్నరేళ్లలో రేవంత్ ఎంత చేయగలరు?
మూసి ప్రాజెక్టుపై మాటల కంటే చేతలకే మైలేజ్ - రెండున్నరేళ్లలో రేవంత్ ఎంత చేయగలరు?
Raksha Gowda: గుప్పెడంత మనసు సీరియల్ వసుధార.. రక్షా గౌడ రియల్ లైఫ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
గుప్పెడంత మనసు సీరియల్ వసుధార.. రక్షా గౌడ రియల్ లైఫ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
Alluri Crime News: 8 ఏళ్ల చిన్నారిపై పాస్టర్ అమానుషం.. వేడి అట్లకాడతో వాతలు పెడుతూ ఫోన్ లో రికార్డ్
8 ఏళ్ల బాలికపై పాస్టర్ అమానుషం.. అట్లకాడతో వాతలు పెడుతూ ఫోన్లో రికార్డ్- అల్లూరి జిల్లాలో ఘటన
Pawan Kalyan Health Condition: పవన్ కళ్యాణ్‌కు భుజాల్లో తీవ్ర గాయం.. వెంటనే సర్జరీ చేయించుకోవాలని ముంబై డాక్టర్ల సూచన!
పవన్ కళ్యాణ్‌కు భుజాల్లో తీవ్ర గాయం.. వెంటనే సర్జరీ చేయించుకోవాలని ముంబై డాక్టర్ల సూచన!
World Cup Black Magic: ఫుట్‌బాల్ ప్రపంచ కప్ సమయంలో ఒక ఆటగాడిపై క్షుద్రశక్తులు ప్రయోగించారా? ఇందులో వాస్తవం ఏంటి?
ఫుట్‌బాల్ ప్రపంచ కప్ సమయంలో ఒక ఆటగాడిపై క్షుద్రశక్తులు ప్రయోగించారా? ఇందులో వాస్తవం ఏంటి?
Embed widget