అన్వేషించండి

Viral News: ఓరి దేవుడా ఇదేందయ్యా ఇదీ... ఐస్ గోలా మీద చీజా.. ఛీఛీ

రుచి చూడటం కాదు, కళ్లతో చూస్తేనే కడుపులో తిప్పే ఫుడ్ మేకింగ్‌ని గొప్పగా వీడియో తీసి వ్యూస్ కోసం సోషల్ మీడియాలో పెడుతున్నారు కొందరు. ఇలాగే పెట్టిన మేకింగ్ ఆఫ్ చీజ్ ఐస్ గోలాకు వచ్చిన ఛీత్కారాలు చూడండి.

Food News: కొత్త కొత్త రెసిపీల పేరుతో ఫుడ్ మీద ఎక్స్ పెరిమెంట్లు రోజు రోజుకూ మితి మీరుతున్నాయి. రుచి చూడటం కాదు, కళ్లతో చూస్తేనే కడుపులో తిప్పే ఫుడ్ మేకింగ్‌ని గొప్పగా వీడియో తీసి వ్యూస్ కోసం సోషల్ మీడియాలో పెడుతున్నారు కొందరు.  జనాలు చూస్తున్నారు కదా అని ఏది పడితే అది తీసి దానికి ఓవర్ బిల్డప్ ఇస్తూ యూట్యూబ్‌లో, ఇన్స్‌స్టాగ్రామ్‌లో వ్యూస్ కోసం షేర్ చేస్తేన్నారు.  అది చూసిన నెటిజన్లు వాళ్లకి బాగా గడ్డి పెడుతున్నారు. ఇలాగే పెట్టిన మేకింగ్ ఆఫ్ ‘చీజ్ ఐస్ గోలా’కు వచ్చిన ఛీత్కారాలు చూడండి.

సిద్దార్థ్ షా అనే గుజరాతీ వీడియో లాగర్ కి ఇన్‌స్టాలో మంచి ఫాలోయింగ్ ఉంది. దాదాపు రెండున్నర లక్షల మంది అతని ఎకౌంట్‌ని ఫాలో అవుతారు. గుజరాతీ భాషలో వీడియోలు తీసే ఇతను ఎక్కువగా అహ్మదాబాద్‌లో ఫేమస్ ఫుడ్ రెసిపీలు తన ఖాతాలో పోస్ట్ చేస్తాడు. ఇటీవల ఈయన పోస్ట్ చేసిన వీడియో ఒకటి వైరల్ అయింది. దీనికి పాజిటివ్‌ కంటే నెగిటివ్ రియాక్షన్స్ ఎక్కువ వస్తున్నాయి. 

చీజ్ వేసిన ఐస్ గోలా ఏంట్రా బాబు.. 

సాధారణంగా పీజాల్లోనో, బర్గర్లలోనో,  శాండ్ విచ్‌ల లోనో.. ఆఖరికి ఈ మధ్య ట్రెండ్ అయిన దోశల్లోనో చీజ్ వేయడం చూశాం.  కానీ  అహ్మదాబాద్‌లోని  ‘ఉమియా ఐస్ డిష్ గోలా- జూనాగఢ్ వాలా’ అనే చిన్న పాటి వీధి వ్యాపారి ఐస్ గోలాలో చీజ్ మిక్స్ చేసి కడుపులో తిప్పే డిష్ ఒకటి ప్రిపేర్ చేశాడు. ముందుగా ఐస్‌ని గ్రేడ్ చేసి చిన్న గోలాలా తయారు చేస్తాడు. దాని మీద రకరకాల రంగుల్లో ఉన్న షుగర్ సిరప్‌లు వేశాడు. దాని మీదే కొంత మలాయి క్రీమ్ వేశాడు. తరువాత డ్రై ఫ్రూట్స్ వేశాడు. అన్నిటి కంటే ముఖ్యగా ఆఖరికి అమూల్‌ చీజ్ దాని మీద బోలెడంత గ్రేడ్ చేశాడు. మళ్లీ కొంత రంగురంగుల సిరప్‌లు వేసి.. పైన కొంత చాక్లెట్ సిరప్ పోశాడు. ఒక్కసారి ఊహించుకోండి.. దీని టేస్ట్ ఎలా ఉంటదో. పుల్ల పుల్లగా తియ్య తియ్యగా ఉంటదని, ఒక్కసారి తప్పక ట్రై చేయాలని వ్లాగర్ సిద్ధార్థ్ చెబుతున్నా.. దానిపై నెటిజన్లు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు.

నీకు నరకంలొ కూడా చోటుండదు చూడు తమ్ముడూ.. 

ఈ చీజ్ గోలా వీడియోకు ఇప్పటి వరకూ మూడు లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి. కానీ ‘ఓరి దేవుడా ఇదేందయ్యా ఇదీ... ఐస్ గోలా మీద చీజా.. ఛీఛీ’ అంటూ నెటిజనన్లు ఈ వీడియోను విమర్శిస్తున్నారు. ‘ఇంత చండాలమైన కాంబినేషన్‌ని కూడా వైరల్ చేస్తున్నారా’  అంటూ చాలా మంది మండిపడటం కామెంట్లు  చూస్తే కనిపిస్తోంది. ‘ఇట్లాంటి వీడియోలు తీసి పోస్టు చేస్తున్న నీకు నరకంలో కూడా చోటుండదు చూడు తమ్ముడూ’ అని ఒకరు కామెంట్ చేస్తే. . ‘ఇలా చేసే వాళ్లమీద పోలీసు కేసులు ఎందుకు కావట్లేదు’ అని మరొకరు.. ‘ఎందుకయ్యా ఇలాంటివి తీసి చూపించి జనాల కడుపులు ఖరాబ్ చేస్తావ్’ అని ఇంకొకరు కామెంట్ చేస్తున్నారు. ‘కలియుగం భాయ్.. ఇప్పుడు అన్నిట్లోనూ చీజ్ వేసేస్తున్నారు(హర్ చీజ్ మే చీజ్)’ అని మరికొందరు నిట్టూరుస్తున్నారు.  ఇలాంటి ఎక్స్‌పెరిమెంట్లు మానేయాలని, ఇవన్నీ చూసి ట్రై చేస్తే ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశముందని ఎక్కువ శాతం అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియాలో ఫుడ్ వ్లాగింగ్ విషయంలో ఎలాంటి నియంత్రణా లేకపోవడంతో కనిపించిన వాటినన్నింటినీ పెద్ద ఎత్తున బిల్డప్పిస్తూ వ్లాగర్లు పోస్టు చేస్తున్నారు. వీటిలో ఏది మంచో ఏది చెడో నిర్ణయించుకోవాల్సిన బాధ్యత కచ్చితంగా వీక్షకులదే.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

DMK BJP alliance rumors: కాంగ్రెస్‌పై యుద్ధం - పాత మిత్రుడిని విలన్‌గా మార్చి.. బీజేపీ వైపు డీఎంకే చూపు?
కాంగ్రెస్‌పై యుద్ధం - పాత మిత్రుడిని విలన్‌గా మార్చి.. బీజేపీ వైపు డీఎంకే చూపు?
Union Cabinet Expansion 2026: కేంద్రమంత్రివర్గంలో సంచలన మార్పులు - కొంత మంది సీఎంలను కేంద్రమంత్రుల్ని చేయబోతున్నారా?
కేంద్రమంత్రివర్గంలో సంచలన మార్పులు - కొంత మంది సీఎంలను కేంద్రమంత్రుల్ని చేయబోతున్నారా?
Petrol Diesel Price Hike: మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. 10 రోజుల్లో నాలుగో షాక్! హైదరాబాద్‌లో నేటి ధరలివే
మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. 10 రోజుల్లో నాలుగో షాక్! హైదరాబాద్‌లో నేటి ధరలివే
Tamil Nadu Politics: కాంగ్రెస్ వెన్నుపోటు పార్టీ! డీఎంకే అడ్డంగా దొరికింది.. ఇక మీ నాటకాలు ఆపండి!
కాంగ్రెస్ వెన్నుపోటు పార్టీ! డీఎంకే అడ్డంగా దొరికింది.. ఇక మీ నాటకాలు ఆపండి!

వీడియోలు

Vaibhav Suryavanshi MI vs RR IPL 2026 | ప్లేఆఫ్‌లో ఉండాలంటే రాజస్థాన్ గెలవాల్సిందే
Shreyas Iyer LSG vs PBKS Do or Die Match | మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన శ్రేయస్
IPL Playoff Race PBKS, RR, KKR | నాలుగో స్థానం కోసం మూడుముక్కలాట
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
Sachin Tendulkar Emotional Post For Arjun | కొడుకు ప్రదర్శనపై సచిన్ ఎమోషనల్ పోస్ట్ వైరల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Union Cabinet Expansion 2026: కేంద్రమంత్రివర్గంలో సంచలన మార్పులు - కొంత మంది సీఎంలను కేంద్రమంత్రుల్ని చేయబోతున్నారా?
కేంద్రమంత్రివర్గంలో సంచలన మార్పులు - కొంత మంది సీఎంలను కేంద్రమంత్రుల్ని చేయబోతున్నారా?
Hyderabad Crime News: హైదరాబాద్‌ నుంచి పాక్ ఐఎస్ఐతో ఛాటింగ్.. యూపీ యువకుడి అరెస్ట్.. గన్స్‌తో రీల్స్ వైరల్ కావడంతో ట్రాప్!
హైదరాబాద్‌ నుంచి పాక్ ఐఎస్ఐతో ఛాటింగ్.. యూపీ యువకుడి అరెస్ట్.. గన్స్‌తో రీల్స్ వైరల్ కావడంతో ట్రాప్!
Pawan Kalyan Politics: జనసేనకు పవన్ కళ్యాణ్ మార్క్ రిపేర్లు.. క్షేత్రస్థాయి పర్యటనలు మొదలుపెట్టిన డిప్యూటీ సీఎం
జనసేనకు పవన్ కళ్యాణ్ మార్క్ రిపేర్లు.. క్షేత్రస్థాయి పర్యటనలు మొదలుపెట్టిన డిప్యూటీ సీఎం
Heatwave In AP And Telangana: వడదెబ్బతో ఒక్కరోజే 76 మంది మృతి.. ఏపీలో 48.3 డిగ్రీలు, తెలంగాణలో 46.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత!
వడదెబ్బతో ఒక్కరోజే 76 మంది మృతి.. ఏపీలో 48.3 డిగ్రీలు, తెలంగాణలో 46.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత!
Maa Inti Bangaram Trailer: సమంత 'మా ఇంటి బంగారం' ట్రైలర్ లాంచ్ ఇవాళే... ఎక్కడ? ఎప్పుడు? ఫుల్ డీటెయిల్స్ తెల్సా?
సమంత 'మా ఇంటి బంగారం' ట్రైలర్ లాంచ్ ఇవాళే... ఎక్కడ? ఎప్పుడు? ఫుల్ డీటెయిల్స్ తెల్సా?
Best Mileage Cars: పెట్రోల్ ఎక్కువ ఆదా చేసే టాప్ 5 బెస్ట్ మైలేజీ కార్లు ఇవే..
పెట్రోల్ ఎక్కువ ఆదా చేసే టాప్ 5 బెస్ట్ మైలేజీ కార్లు ఇవే..
YSRCP Political Strategy Failures: వ్యూహాత్మక తప్పిదమా? లేక సెల్ఫ్ గోల్స్? జగన్ ప్రెస్ మీట్లు ఎందుకు బెడిసికొడుతున్నాయి!
వ్యూహాత్మక తప్పిదమా? లేక సెల్ఫ్ గోల్స్? జగన్ ప్రెస్ మీట్లు ఎందుకు బెడిసికొడుతున్నాయి?
Kia India Announces Massive Discounts: కియా కార్లపై అదిరిపోయే మే ఆఫర్స్ - మోడళ్లపై రూ. 2.70 లక్షల వరకు భారీ డిస్కౌంట్లు
కియా కార్లపై అదిరిపోయే మే ఆఫర్స్ - మోడళ్లపై రూ. 2.70 లక్షల వరకు భారీ డిస్కౌంట్లు
Embed widget