By: ABP Desam | Updated at : 23 Mar 2022 12:14 PM (IST)
Edited By: Murali Krishna
దిల్లీలో హై అలర్ట్- భారీ ఉగ్రదాడులకు ప్లాన్ చేసినట్లు సమాచారం
దేశ రాజధాని దిల్లీలో హైఅలర్ట్ ప్రకటించారు అధికారులు. రాజధానిలో ఉగ్రవాదులు దాడి చేసే అవకాశం ఉందని యూపీ పోలీసుల నుంచి సమాచారం రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు ఏఎన్‌ఐ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది.
దిల్లీ ప్రత్యేక పోలీస్ సెల్‌కు ఓ అనుమానాస్పద ఈ మెయిల్ వచ్చింది. దీనిపై వాళ్లు యూపీ పోలీసులను సమాచారం కోరగా.. అది ఓ ఉగ్రవాద సంస్థ నుంచి వచ్చినట్లు తెలిపారు. సంస్థ పేరు తెహ్రిక్-ఈ- తాలిబన్‌గా గుర్తించారు. ఈ మెయిల్ వివారాలను దిల్లీ పోలీసులకు అందించారు.
దిల్లీ సరోజిని నగర్ మార్కెట్ సహా వివిధ ప్రాంతాలను పోలీసులు జల్లెడ పడుతున్నారు. భద్రతా ముప్పు కారణంగా ఈ మార్కెట్‌ను మూసివేయించారు. మార్కెట్ అణువణువునా పోలీసులు గాలింపు చేపడుతున్నారు.
మరోవైపు మెయిల్ ఎక్కడ నుంచి వచ్చిందనే విషయంపై కూడా పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ఏడాదిలో ఇది మొదటి బెదిరింపు ఏం కాదు. దిల్లీలోని ఘాజీపుర్, సీమాపురి ప్రాంతాల్లో ఇంతకుముందు దిల్లీ పోలీసులకు రెండు ఐఈడీలు దొరికాయి.
అప్పుడు కూడా
రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా భారత ప్రధానిపై దాడి జరిగే అవకాశం ఉందని ఇంటలిజెన్స్ గట్టి హెచ్చరికలు చేసింది. గణతంత్ర వేడుకలకు ఉగ్ర ముప్పు పొంచి ఉందని నిఘావర్గాలు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఒక్కరే కాదని.. పలువురు ప్రముఖులపై దాడికి టెర్రరిస్టులు కుట్ర పన్నినట్లుగా ఇంటెలిజెన్స్ నివేదిక కేంద్ర హోంశాఖకు చెప్పినట్లు తెలిసింది.
వీటిపై వెంటనే అప్రమత్తమైన కేంద్ర హోంశాఖ భారీ భద్రత ఏర్పాట్లు చేసింది. రిపబ్లిక్ డే రోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్త పడింది. అయితే తాజాగా మరోసారి అలాంటి బెదిరింపులే వచ్చాయి.
Also Read: Money Laundering Case: మొన్న మేనల్లుడు, నేడు బావమరిది- సీఎంలు మారారంతే, సీనంతా సేమ్ టూ సేమ్
Kerala OTT : కేరళ ప్రభుత్వ సొంత "ఓటీటీ" - ఇక సినిమాలన్నీ అందులోనేనా ?
Sunil Jakhar Joins BJP: కాంగ్రెస్‌కు వరుస షాక్‌లు- భాజపాలోకి మరో సీనియర్ నేత
Krishna Janmabhoomi Row: శ్రీకృష్ణ జన్మభూమిలో ఈద్గా తొలగింపుపై పిటిషన్- విచారణకు కోర్టు ఓకే
Yasin Malik Convicted: వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్‌ను ఆ కేసులో దోషిగా తేల్చిన కోర్టు
Navjot Singh Sidhu: సిద్ధూకు ఏడాది జైలు శిక్ష- 34 ఏళ్ల క్రితం కేసులో సుప్రీం తీర్పు
Chandrababu Kurnool Tour: భూలోకంలో ఎక్కడ దాక్కున్నా లాక్కొచ్చి లోపలేయిస్తా: చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
RCB Vs GT Highlights: ఫాంలోకి వచ్చిన కింగ్ కోహ్లీ - గుజరాత్‌పై బెంగళూరు ఘనవిజయం!
NTR30: ఎన్టీఆర్30 టెరిఫిక్ అప్డేట్ - ఫ్యాన్స్ కు పూనకాలే!
Nikhat Zareen: తెలంగాణ బంగారు కొండ - ప్రపంచ చాంపియన్‌గా నిఖత్ జరీన్!