Qutub Minar Hearing: హిందూ, జైన దేవాలయాల పునరుద్ధరణపై వాదనలు పూర్తి- తీర్పు జూన్9కి వాయిదా వేసిన దిల్లీ కోర్టు
కుతుబ్‌మినార్ కాంప్లెక్స్‌లో ఉన్న కువ్వత్-ఉల్-ఇస్లాంను ఆలయ సముదాయం స్థానంలో నిర్మించారని పేర్కొంటూ కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజ్వర్ చేసింది.
మెహ్రౌలీలోని కుతుబ్ మినార్ కాంప్లెక్స్‌లో 27 హిందూ, జైన దేవాలయాల పునరుద్ధరణకు సంబంధించిన పిటిషన్‌ను దిల్లీలోని సాకేత్ కోర్టు మంగళవారం విచారించింది. హిందూ, జైన విగ్రహాల పునరుద్ధరణపై తీర్పును జూన్ 9వ తేదీకి కోర్టు రిజర్వ్ చేసిందని ANI వార్తా సంస్థ తెలిపింది.
మీకున్న అర్హత ఏంటి?
కుతుబ్ మినార్ కాంప్లెక్స్‌లో ఉన్న కువ్వత్-ఉల్-ఇస్లాంను ఆలయ సముదాయం స్థానంలో నిర్మించారని పేర్కొంటూ కోర్టులో పిటిషన్ దాఖలైంది. "ఇది స్మారక చిహ్నమా లేదా ప్రార్థనా స్థలమా? మీరు ఏమనుకుంటున్నారు? స్మారక చిహ్నాన్ని ప్రార్థనా స్థలంగా మార్చడానికి మీకున్న చట్టపరమైన హక్కు ఏంటని?" పిటిషనర్‌ను కోర్టు ప్రశ్నించిందని ANI పేర్కొంది.
ఆ హక్కు ఎవరికీ లేదు
పిటిషన్‌పై తన వాదన వినిపించిన భారత పురావస్తు శాఖ AMASR చట్టం 1958 ప్రకారం స్మారక చిహ్నం వద్ద ప్రార్థనలు చేయడానికి ఎటువంటి నిబంధన లేదని పేర్కొంది. కుతుబ్ మినార్ ఒక స్మారక చిహ్నమని ఈ స్థలంలో పూజలు చేసే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేసింది.
ANI చెప్పిన వివరాల ప్రకారం పురావస్తు శాఖ తన అభిప్రాయాన్ని కోర్టుకు తెలియజేసింది. "ఏ స్మారక చిహ్నం వద్ద పూజలు చేయడానికి ఎలాంటి నిబంధన లేదని దిల్లీ హైకోర్టు 27/ 01/1999నాటి ఉత్తర్వుల్లో పేర్కొందని తెలియజేశారు."
PTI వార్తా సంస్థ ప్రకారం, కుతుబ్ మినార్ కాంప్లెక్స్‌లో గుర్తించిన హిందూ, జైన విగ్రహాల ఐకాగ్రఫీని నిర్వహించడానికి సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పరిశీలిస్తున్నట్లు ఒక అధికారి తెలిపారు. ఆ స్థలంలో తవ్వకాలు జరిపేందుకు లేదా మతపరమైన ఆచారాలను ఆపడానికి ఎలాంటి ప్రణాళికలు లేవని కూడా ఆయన తెలిపారు.
అక్కడి నుంచి వివాదం
ఖువాత్-ఉల్-ఇస్లాం మసీదులోని రెండు విగ్రహాలను పక్కన పడేసి నందునే కాంప్లెక్స్ నుంచి తరలించాలని నేషనల్ మాన్యుమెంట్ అథారిటీ ఛైర్‌పర్సన్ తరుణ్ విజయ్ ASIకి లేఖ రాసిన తర్వాత ఈ కామెంట్స్ వెలుగు చూశాయి. మసీదు దేవాలయాల రాళ్లతో నిర్మించారని, అలాంటి విగ్రహాలు ఎక్కడైనా కనిపిస్తాయని, వీటిలో కొన్నింటిని ప్రదర్శించడానికి, లేబుల్ చేయడానికి మంత్రిత్వ శాఖ చర్చిస్తున్నట్లు అధికారి తెలిపారు. అయితే, ఇప్పటి వరకు విగ్రహాలను పునఃస్థాపన లేదా తరలించే ఉద్దేశం లేదన్నారాయన.
కుతుబ్ మినార్ కాంప్లెక్స్‌లో తవ్వకాలు జరపాల్సిందిగా భారత పురావస్తు శాఖని మంత్రిత్వ శాఖ ఆదేశించిందన్న వార్తలపై వివాదం చెలరేగింది. అయితే ఈ వార్తలను సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఖండించారు.