అన్వేషించండి

India Expels Canadian Diplomat: కెనడా రాయబారిని బహిష్కరించిన భారత్‌- ఐదు రోజుల్లో దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశం

India Expels Canadian Diplomat: కెనడా రాయబారిని బహిష్కరించిన భారత్‌.. ఐదు రోజుల్లో వెళ్లిపోవాలని ఆదేశం

భారత్‌, కెనడాల మధ్య పెరిగిన ఉద్రిత్త పరిస్థితులు నేపథ్యంలో భారత్‌లోని కెనడా హైకమిషనర్‌ను మంగళవారం బహిష్కరించింది. కెనడాలో భారత రాయబారిపై బహిష్కరణ వేటు వేసిన నేపథ్యంలో భారత్‌ కూడా అందుకు తగినట్లు స్పందించింది. భారత్‌లోని కెనడా రాయబారిని బహిష్కరించి వచ్చే ఐదు రోజుల్లో భారత్‌ను వీడాలని ఆదేశిస్తూ ప్రభుత్వం అధికారిక ప్రకటనలో తెలిపింది. కెనడాలో భారత రాయబారిపై వేటు వేసిన విషయాన్ని తెలియజేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. భారత అంతర్గత విషయాల్లో కెనడియన్‌ దౌత్యవేత్తల జోక్యం, భారత వ్యతిరేక కార్యకలాపాల్లో వారి ప్రమేయం పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోందని, ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

ఖలిస్థానీ సానుభూతి పరుడు, ఖలిస్థాన్‌ టైగర్స్‌ ఫోర్స్‌ నేత హర్‌దీప్‌ సిం్‌ నిజ్జర్‌ హత్య జరిగిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తితలు మరింత పెరిగాయి. నిజ్జర్‌ హత్య వెనుక భారత ఏజెంట్ల పాత్ర ఉండొచ్చని విశ్వసనీయమైన ఆరోపణలు ఉన్నాయిన కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడ్‌ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే కెనడాలోని భారత రాయబారిపై సోమవారం వేటు వేశారు. కెనడా ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. జూన్‌ 18న కెనడాలోని బ్రాంప్టన్‌ పట్టణంలోని గురుద్వారా సాహిబ్‌ పార్కింగ్‌లో హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌పై కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో అతడు మరణించాడు. అయితే ఇందులో భారత హస్తం ఉందన్నది కెనడా వాదన. 

హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన సంచలన ఆరోపణలపై భారత్ స్పందించింది. జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలను భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తీవ్రంగా ఖండించారు. కెనడా ప్రధాని వ్యాఖ్యలు పూర్తిగా అసంబద్ధమైనవని, ప్రేరేపితమైనవని అన్నారు. సర్రేలో ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ హత్యలో భారత్ పాత్ర ఉందనడాన్ని తోసిపుచ్చారు. భారత దేశానికి చట్టబద్ధమైన పాలన పట్ల బలమైన నిబద్ధత ఉందని మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. 'కెనడా పార్లమెంటులో ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో, ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి చేసిన ప్రకటన చూశాం. కెనడాలో ఏదైనా హింసాత్మక చర్యలో భారత ప్రభుత్వం ప్రమేయం ఉందనే ఆరోపణలు పూర్తిగా అసంబద్ధమైనవి, ప్రేరేపితమైనవి' అని విదేశాంగ శాఖ విడుదల చేసిన ఓ ప్రకటనలో కేంద్రమంత్రి జైశంకర్ పేర్కొన్నారు.

ఇటీవల భారత్‌లో జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సులో కూడా భారత ప్రధాని మోదీ, కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో అంటీముట్టనట్లు ఉన్న సంగతి తెలిసిందే. ఇరువురు మధ్య ద్వైపాక్షిక చర్చలు కూడా జరగలేదు. కేవలం ఒక  చిన్న సమావేశం మాత్రమే జరిగింది. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. కెనడా కేంద్రంగా భారత వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సిక్కు వేర్పాటు వాదులు అక్కడి నుంచి కార్యకలాపాలను నడిపిస్తున్నారని ఇది ఇరు దేశాలకు మంచిది కాదని అన్నారు. అక్కడ నివసిస్తున్న భారత దౌత్యవేత్తలపై హింసను ప్రేరేపిస్తున్నారని మోదీ ఆరోపించారు. అయితే ఆ సమావేశంలో ట్రూడో.. కెనడాలో విదేశీ జోక్యం జరుగుతోందని అది తమ దేశ సార్వభౌమాధికారానికి విఘాతం కలిగించడమని పేర్కొన్నారు. ఇలా ఇరుదేశాలు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
YSRCP : పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న  జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
Tiger News: రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
YSRCP : పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న  జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
Tiger News: రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Tirumala News: తిరుమల ప్రసాదాలపై చంద్రబాబు ఆరోపణలు అత్యంత దుర్మార్గం - టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన
తిరుమల ప్రసాదాలపై చంద్రబాబు ఆరోపణలు అత్యంత దుర్మార్గం - టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన
Embed widget