అన్వేషించండి

తొందర పడుతున్న నితీశ్, బ్రేక్‌లు వేస్తున్న బీజేపీ - ABP News సోర్సెస్‌ చెప్పిన ఆసక్తకిర విషయాలివే

Bihar Politics: బిహార్ రాజకీయాల్లో ఆసక్తికర మార్పులు రానున్నట్టు ABP News సోర్సెస్ వెల్లడించాయి.

Bihar Nitish Kumar Row: లోక్‌సభ ఎన్నికల ముందు బిహార్ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోతున్నాయి. మామూలుగా అయితే ఇంత ఆసక్తి ఉండకపోయేదేమో. NDAని ఢీకొట్టడానికి I.N.D.I.A కూటమి ఏర్పాటు చేయడానికి చొరవ చూపించిన నితీశ్ కుమార్..ఇప్పుడు అదే NDAలో చేరాలనుకుంటుండమే ఇంత ఆసక్తిని పెంచింది. అసలే మూడు రాష్ట్రాల్లో ఓటమి చవి చూసి డీలా పడిపోయి ఉన్న కాంగ్రెస్‌కి ఇది గట్టి దెబ్బ కొట్టనుంది. అధికారికంగా ఇంత వరకూ నితీశ్ కుమార్ (Nitish Kumar Rejoins NDA) ఎలాంటి ప్రకటన చేయకపోయినప్పటికీ...NDAలో చేరడం ఇక లాంఛనమే అన్న సంకేతాలిస్తున్నాయి విశ్వసనీయ వర్గాలు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన చర్చలు కూడా జరిగాయట. అయితే...ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే...నితీశ్ కుమార్ NDAలో చేరితే...ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారా..? లేదంటే మరెవరికైనా ఆ పదవి దక్కుతుందా అన్నదీ ఉత్కంఠ కలిగిస్తోంది. ఇప్పుడున్న సమాచారం ప్రకారమైతే...బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ నితీశ్ కుమార్‌ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని, సుశీల్ మోదీకి డిప్యుటీ సీఎం చేస్తారని తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రెండు వర్గాలూ ఇప్పటికే చర్చలు జరిపినట్టు సమాచారం. ఈ ఎన్నికల (Bihar Politics) ఫార్ములానీ చర్చించారట. అటు రాజ్యసభ ఎంపీ సుశీల్ మోదీ కూడా నితీశ్ కుమార్ చేరికపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో తలుపులు ఎప్పుడూ మూసి ఉంచవని, అవసరాన్ని బట్టి వాటిని తెరుస్తామని తేల్చి చెప్పారు. అంటే...నితీశ్ రావడానికి బీజేపీకి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పకనే చెప్పారాయన. అందుకు తగ్గట్టుగానే బీజేపీ నేతలంతా ఒక్కొక్కరుగా ఢిల్లీ నుంచి పట్నాకి క్యూ కట్టారు. అప్పటికే కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో భేటీ అయినట్టు ABP News సోర్సెస్ ద్వారా తెలిసింది. 

ఫార్ములా పాతదేనా..? 

ఇక్కడ అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే..కొత్త ప్రభుత్వం ఏర్పడితే లోక్‌సభ ఎన్నికల్లో సీట్  షేరింగ్ ఫార్ములా ఎలా  ఉంటుందనేదే. అయితే..2022లో NDA నుంచి నితీశ్ బయటకు రాకముందు ఏ ఫార్ములా అయితే ఫాలో అయ్యారో ఇప్పుడూ అదే కొనసాగుతుందని ABP News సోర్సెస్ వెల్లడించాయి. అయితే...లోక్‌సభ సీట్ల పరంగా చూస్తే మాత్రం JDU కాస్త సర్దుకుపోక తప్పదేమో అనిపిస్తోంది. ఎందుకంటే..ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం...జేడీయూ 12-15 సీట్లలో పోటీ చేసేలా బీజేపీ ప్రతిపాదిస్తోంది. అంటే అంతకు మించి ఎక్కువ స్థానాలు దక్కకపోవచ్చు. ఇక కేబినెట్‌లో బీజేపీ నేతలకూ ప్రాధాన్యత దక్కనుంది. అంటే...కొందరిని మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నాయి. ఈ ప్రపోజల్స్ అన్నీ సిద్ధమైనట్టు సమాచారం. రెండు వైపుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ...బిహార్ బీజేపీ ఇన్‌ఛార్జ్ వినోద్ తవ్‌దే అమిత్‌షాతో ఇప్పటికే భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ప్రస్తుత బిబార్ రాజకీయాల గురించి ఆయన వివరించారట. అయితే...మీడియా ముందు మాట్లాడడానికి మాత్రం ఆయన ఇష్ట పడడం లేదు. అంతా హైకమాండ్ చూసుకుంటుందని దాటవేస్తున్నారు. జేడీయూ పొత్తు విషయంలో చాలా ఆతృతగా ఉన్నప్పటికీ బీజేపీ మాత్రం ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. 

 Also Read: Maratha Movement : మహారాష్ట్రలో మళ్లీ రాజుకుంటోన్న మరాఠా కోటా ఉద్యమం, ప్రభుత్వానికి మనోజ్ జరాంగే అల్టిమేటం

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy US Visit: రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
Embed widget