![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Uddhav Thackeray: ఏ మాత్రం నైతికత ఉన్నా షిందే రాజీనామా చేయాలి - ఉద్ధవ్ థాక్రే డిమాండ్
Uddhav Thackeray: నైతిక బాధ్యత వహించి షిందే రాజీనామా చేయాలని థాక్రే డిమాండ్ చేశారు.
![Uddhav Thackeray: ఏ మాత్రం నైతికత ఉన్నా షిందే రాజీనామా చేయాలి - ఉద్ధవ్ థాక్రే డిమాండ్ If He Has Any Ethics Eknath Shinde Should Resign As CM Uddhav Thackeray After Supreme Court Ruling Uddhav Thackeray: ఏ మాత్రం నైతికత ఉన్నా షిందే రాజీనామా చేయాలి - ఉద్ధవ్ థాక్రే డిమాండ్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/11/8377707d62be328260309f8cf7b12cec1683800855976517_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Uddhav Thackeray:
రిజైన్ చేయాల్సిందే..
శివసేన వర్సెస్ శివసేన కేసులో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై రెండు వర్గాలూ సానుకూలంగానే స్పందించాయి. ఇదే సమయంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు శిందే, ఉద్దవ్ థాక్రే. శివసేన తమదే అంటున్న ఉద్దవ్ థాక్రే..సీఎం శిందేపై ఫైర్ అయ్యారు. సుప్రీంకోర్టు తీర్పుతోనైనా ఏక్నాథ్ శిందే తీరు మార్చుకోవాలని సూచించారు. నైతిక బాధ్యత వహించి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దేవేంద్ర ఫడణవీస్ కూడా డిప్యుటీ సీఎం పదవి నుంచి తప్పుకోవాలని అన్నారు. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ యాదవ్‌తో పాటు డిప్యుటీ సీఎం తేజస్వీ యాదవ్...థాక్రేతో భేటీ అయ్యారు. అదే సమయంలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. ఈ క్రమంలోనే ఆయన...ఈ డిమాండ్లు చేశారు. వెన్నుపోటు పొడిచి అధికారం లాక్కున్నారని విమర్శించారు.
"మహారాష్ట్ర ముఖ్యమంత్రి శిందే, డిప్యుటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌కి ఏ మాత్రం నైతికత ఉన్నా వెంటనే ఆ పదవులకు రాజీనామా చేయాలి. శిందే వర్గంలోని ఎమ్మెల్యేలంతా కుమ్మక్కై కుట్ర చేశారు. పార్టీకి, మా నాన్నకు వెన్నుపోటు పొడిచారు. అప్పుడు నేను రాజీనామా చేయడం న్యాయపరంగా తప్పే కావచ్చు. కానీ అది నా నైతికతకు సంబంధించిన విషయం అని ఇప్పటికీ నేను బలంగా నమ్ముతున్నాను"
- ఉద్దవ్ థాక్రే, బాలాసాహెబ్ థాక్రే శివసేన నేత
#WATCH | If the current Maharashtra CM and deputy CM have any ethics, then they should resign: Uddhav Thackeray #Maharashtra pic.twitter.com/wqNPrnG36F
— ANI (@ANI) May 11, 2023
అసెంబ్లీలో బలపరీక్షకు రావాలని పిలిచే హక్కు గవర్నర్‌కు లేదని తేల్చి చెప్పారు థాక్రే. సుప్రీంకోర్టు కూడా ఇదే చెప్పిందని అని వెల్లడించారు.
"నేను రాజీనామా చేయకపోయుంటే మళ్లీ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చునే అవకాశం ఉండేదని సుప్రీంకోర్టు చెప్పింది. కానీ నా పోరాటం నా కోసం కాదు. ఈ రాష్ట్ర ప్రజల కోసం. దేశ ప్రజల కోసం. రాజ్యాంగాన్ని కాపాడడం కోసమే మా పోరాటం. ప్రజాస్వామ్యాన్ని రక్షించడం మా కనీస బాధ్యత"
- ఉద్దవ్ థాక్రే, బాలాసాహెబ్ థాక్రే శివసేన నేత
Maharashtra | They (now Shinde faction MLAs) betrayed my party and the legacy of my father. My resignation as the CM then may have been wrong legally, but I did it on moral grounds: Uddhav Thackeray
— ANI (@ANI) May 11, 2023
సుప్రీంకోర్టు తీర్పు..
షిందే వర్గానికి చెందిన వ్యక్తిని విప్‌గా నియమించడాన్నిసుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఈ విషయంలో స్పీకర్ నిర్ణయాన్ని తోసిపుచ్చింది. శివసేన సంక్షోభాన్ని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. గోగావాలేను విప్‌గా నియమించడం సరికాదని వెల్లడించింది. ఉద్ధవ్ థాక్రే వర్గానికి ఎమ్మెల్యేల సంఖ్యాబలం లేదని తేల్చడంలో గవర్నర్ తొందరపడ్డారని తేల్చి చెప్పింది. థాక్రే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారని, తిరిగి ఆయనను సీఎం చేయడం కుదరదని సీజేఐ చంద్రచూడ్ తేల్చి చెప్పారు. గవర్నర్ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని వెల్లడించింది. శివసేన పార్టీ చీఫ్ విప్‌గా గోగావాలేను స్పీకర్ నియమించడం సరికాదని తెలిపింది. అయితే...ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు విషయంలో మాత్రం తాము జోక్యం చేసుకోమని తేల్చి చెప్పింది.
Also Read: AAP vs L-G Row: ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌కి సుప్రీంకోర్టు షాక్, ప్రభుత్వ అధికారాలకు కట్టుబడి ఉండాలని తీర్పు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)