అన్వేషించండి

Traffic Challan Discount: చలాన్లపై డిస్కౌంట్ వీళ్లకి వర్తించదు - 100 శాతం కట్టాల్సిందే!

Telangana News: పెండింగ్‌ చలానాలు వసూలు చేసుకునేందుకు తెలంగాణ పోలీసు శాఖ, రవాణా శాఖ కలిసి డిస్కౌంట్‌ ఆఫర్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Telangana Traffic Challans: తెలంగాణలో పెండింగ్ లో ఉన్న ట్రాఫిక్ చలాన్లు క్లియర్ చేయడానికి జనాలు ఎగబడుతున్న సంగతి తెలిసిందే. పెండింగ్ చలాన్లను వసూలు చేసే ఉద్దేశంతో వాటిపై రాయితీ ఇస్తామని ఇటీవల ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి.. అందుకు తగ్గట్లే జీవో కూడా విడుదల చేశారు. డిసెంబర్ 26 నుంచే పెండింగ్ చలాన్లపై రాయితీ వర్తిస్తుందని జీవోలో చెప్పారు. కొంత మంది డిసెంబర్ 26 తర్వాత కొత్తగా పడ్డ ట్రాఫిక్ చలాన్లకు కూడా ప్రభుత్వం ప్రకటించిన రాయితీ వస్తుందని భావిస్తున్నారు. కానీ, డిసెంబర్ 26 తర్వాత ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతూ చలాన్ పడ్డ వారికి ఈ రాయితీ వర్తించబోదని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ప్రభుత్వ జీవో ప్రకారం డిసెంబరు 25కు ముందు పడ్డ చలాన్లకు మాత్రం నిర్దేశిత డిస్కౌంట్ వర్తించనుంది.

రూ.10 కోట్ల వసూలు
పెండింగ్‌ చలానాలు వసూలు చేసుకునేందుకు తెలంగాణ పోలీసు శాఖ, రవాణా శాఖ కలిసి డిస్కౌంట్‌ ఆఫర్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో పెండింగ్‌ చలానాలు భారీగా క్లియర్ అవుతున్నాయి. కోట్ల రూపాయాల్లో ప్రభుత్వానికి ఆదాయం వచ్చి పడుతోంది. ఇప్పటికే రూ.10 కోట్ల రూపాయల మేర వసూలు అయినట్టు సమాచారం. ఇలా ఈ చలాన్ వెబ్ సైట్ పై విపరీతంగా ఒత్తిడి పడుతుండడంతో అప్పుడప్పుడు సైట్ క్రాష్ కూడా అవుతోంది. చాలా మంది యూజర్లు ఈ చలాన్ వెబ్ సైట్ ఓపెన్ చేసి ట్రాఫిక్ చలానాలు క్లియర్ చేసే క్రమంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

దాదాపు పది లక్షల చలాన్లు క్లియర్

డిసెంబర్‌ 28వ తేదీ రాత్రి అంటే గురువారం రాత్రి 10:30 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 9.80 లక్షలకు పైగా చలాన్లు క్లియర్ అయ్యాయి. అత్యధికంగా హైదరాబాద్‌‌ కమిషనరేట్‌ పరిధిలో 3.84 లక్షల చలాన్లకు రూ.2.90 కోట్లు, సైబరాబాద్‌‌ పరిధిలో 2.2 లక్షల చలాన్లకు రూ.1.90 కోట్లు, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 97వేల  చలాన్లకు రూ.81 లక్షలు వాహనదారుల నుంచి వసూలు చేశారు. చలాన్ సైట్‌పై తాకిడి పెరగడంతో సర్వర్లు కూడా మొరాయిస్తున్నాయి. దీన్ని బట్టి.. పెండింగ్‌ చలానాల  పేమెంట్లు కట్టేందుకు ఎంత స్పందన వస్తుందో అర్థమవుతోంది. 

టూవీలర్లు, త్రీ వీలర్లకు 80 శాతం, బస్సులకు 90 శాతం, కార్లు, హెవీ మోటార్ వెహికిల్స్‌కు 60 శాతం డిస్కౌంట్ ఇచ్చింది. పెండింగ్‌‌ చలాన్లకు రాయితీ ఇవ్వడంతో.... దొరికిందే ఛాన్స్‌ అని... ఆలస్యం చేయకుండా చలానాలు కట్టేస్తున్నారు  వాహనదారులు. గత ఏడాది కూడా పెండింగ్‌ చలానాల వసూళ్ల కోసం ఇలాంటి ఆఫర్‌నే ప్రకటించారు. అప్పుడు కూడా పెండింగ్ చలాన్ల ద్వారా ఏకంగా 300 కోట్ల ఆదాయం సమకూరింది. కాగా..  ఈ ఏడాది కూడా సుమారు 2 కోట్ల చలానాలు పెండింగ్‌లో ఉండటంతో.. మరోసారి పెండింగ్‌ చలాన్లపై డిస్కౌంట్‌ ప్రకటించారు. డిసెంబర్ 26ను ఈ ఆఫర్ ప్రారంభించారు. జనవరి  10వ తేదీ వరకు డిస్కౌంట్‌తో పెండింగ్ చలానాలు కట్టే అవకాశాన్ని ట్రాఫిక్ పోలీసులు కల్పించారు. 

టాప్ హెడ్ లైన్స్

BCCI Coaching Sack: టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!
టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!
ABP Desam Top 10, 28 July 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
ABP Desam Top 10, 28 July 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
Breaking News: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్-మిర్యాలగూడలో అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్!
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్-మిర్యాలగూడలో అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్!
Priyanka Gandhi Parliament Speech: వారేమైనా తీవ్రవాదులా? - లోక్‌సభలో కేంద్రాన్ని నిలదీసిన ప్రియాంకా గాంధీ
వారేమైనా తీవ్రవాదులా? - లోక్‌సభలో కేంద్రాన్ని నిలదీసిన ప్రియాంకా గాంధీ

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy HYDRA Comments: అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Bonda Uma TDP: అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ - త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
BCCI Coaching Sack: టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!
టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!
Healthy Night Routine : మంచి నిద్ర కావాలంటే నైట్ రొటీన్ ఇలా సెట్ చేసుకోండి.. వైద్యులు సూచించే సింపుల్ అలవాట్లు ఇవే
మంచి నిద్ర కావాలంటే నైట్ రొటీన్ ఇలా సెట్ చేసుకోండి.. వైద్యులు సూచించే సింపుల్ అలవాట్లు ఇవే
Uday Krishna Reddy Arrest: పరారీలో ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్ - మిర్యాలగూడ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు!
పరారీలో ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్ - మిర్యాలగూడ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు!
PCOS vs Iron Deficiency : PCOS ఉంటే ఐరన్ తగ్గిపోతుందా? రెండింటి మధ్య సంబంధం ఏంటి? గైనకాలజిస్ట్ సూచనలివే
PCOS ఉంటే ఐరన్ తగ్గిపోతుందా? రెండింటి మధ్య సంబంధం ఏంటి? గైనకాలజిస్ట్ సూచనలివే
Embed widget