అన్వేషించండి

Amazon India Layoff: కొనసాగుతున్న అమెజాన్‌ లేఆఫ్‌లు, ఎమోషనల్ అవుతున్న ఉద్యోగులు

Amazon India Layoff: అమెజాన్‌లో లేఆఫ్‌లు కొనసాగుతున్నాయి.

Amazon India Layoff:

లింక్డ్‌ఇన్‌లో పోస్ట్‌లు..

ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ కంపెనీల్లో లేఆఫ్‌లు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ విషయంలో ట్విటర్ సంచలనం సృష్టించగా...అమెజాన్ కూడా అదే బాట పట్టింది. సీనియర్ పొజిషన్‌లో ఉన్న వారినీ ఇంటికి పంపుతోంది. ఏళ్ల పాటు కంపెనీలోనే సేవలందించిన వాళ్లకూ పింక్ స్లిప్ చూపించి వెళ్లిపొమ్మంటోంది. ఇండియాలో కనీసం 1000 మందిని తొలగించాలని టార్గెట్‌గా పెట్టుకుంది అమెజాన్. అందులో భాగంగానే వరుసగా కొందరిని సాగనంపుతోంది. ఇలా ఉద్యోగం కోల్పోయిన వాళ్లంతా లింక్డ్‌ఇన్‌లో పెడుతున్న పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి. #amazonlayoffs కూడా ట్రెండ్ అవుతోంది. కొంత మంది ఎమోషనల్‌ నోట్‌ కూడా పెడుతున్నారు. ఇటీవలే గుడ్‌గావ్‌కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఓం ప్రకాశ్ శర్మ అనే ఉద్యోగిని జనవరి 11న తొలగించింది అమెజాన్. ఐదేళ్ల పాటు సీనియర్ డెవలప్‌మెంట్ ఇంజనీర్‌గా పని చేసిన ఆ ఉద్యోగి తనకు ఎదురైన అనుభవాలను పంచుకున్నాడు. ఉద్యోగం కావాలని, హెల్ప్ చేయాలని పోస్ట్ పెట్టాడు. నాన్న చనిపోయిన కొద్ది రోజులకే ఉద్యోగం పోగొట్టుకోవడం బాధగా ఉందని ఎమోషనల్ అయ్యాడు. 


Amazon India Layoff: కొనసాగుతున్న అమెజాన్‌ లేఆఫ్‌లు, ఎమోషనల్ అవుతున్న ఉద్యోగులు

ఎమోషనల్‌ నోట్‌..

"2022 నా జీవితంలో అత్యంత ఛాలెంజిగ్ ఫేజ్. దాదాపు 2, 3 నెలల పాటు ఐసీయూలో మృత్యువుతో పోరాడి చివరకు నాన్న చనిపోయారు. దాదాపు నాలుగు నెలల పాటు వర్క్‌ ఫ్రమ్ హోమ్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు లేఆఫ్‌ల కారణంగా జనవరి 11న నన్ను ఉద్యోగంలో నుంచి తీసేశారు" అని లింక్డ్‌ ఇన్‌లో పోస్ట్ పెట్టాడు. అమెజాన్‌లో ఐదేళ్ల పాటు పని చేయడం చాలా ఆనందంగా అనిపించిందని చెప్పాడు. ఎలాంటి పరిస్థితి వచ్చినా పాజిటివ్‌గా ఉండాలని మోటివేట్ కూడా చేశాడు. ఓం ప్రకాశ్‌ మాత్రమే కాదు. ఇలా ఉద్యోగం కోల్పోయి లింక్డ్‌ ఇన్‌ వేదికగా పోస్ట్‌లు పెడుతున్న వాళ్లు చాలా మందే ఉన్నారు. బెంగళూరు అమెజాన్‌లో పని చేస్తున్న హర్ష అనే యువకుడూ ఇదే విధంగా లేఆఫ్‌కి గురయ్యాడు. "2023 ఇలా స్టార్ట్ అవుతుందని ఊహించలేదు. లేఆఫ్‌ల్లో భాగంగా నన్ను ఉద్యోగం నుంచి తొలగించారు" అంటూ పోస్ట్ పెట్టాడు.  


Amazon India Layoff: కొనసాగుతున్న అమెజాన్‌ లేఆఫ్‌లు, ఎమోషనల్ అవుతున్న ఉద్యోగులు

వేలాది మంది..

వాల్‌స్ట్రీట్ జర్నల్‌లో వెల్లడించిన వివరాల ప్రకారం...గతేడాది నవంబర్ నుంచి ఈ కోతలు కొనసాగుతున్నాయి. అయితే...మరో 10 వేల మందిని తొలగించనున్నట్టు ఆ మధ్య వార్తలు వచ్చాయి. కానీ...ఇప్పుడా సంఖ్య ఏకంగా 18 వేలకు పెరిగింది. సంస్థ  దీనిపై 
ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినా...కచ్చితంగా ఇంత మందని తొలగిస్తారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అమెరికాలోని సియాటెల్‌లోని కంపెనీలో దాదాపు 10 వేల మందిని తొలగించేందుకు ఇప్పటికే ప్లాన్ రెడీ చేసుకుంది అమెజాన్. రిటెయిల్, హెచ్‌ఆర్ విభాగంలోని ఉద్యోగులను ఇంటికి పంపనుంది. కొవిడ్ సంక్షోభ సమయంలో ఆన్‌లైన్ షాపింగ్ పెరిగింది. అప్పుడు వేలాది మంది ఉద్యోగులను అదనంగా రిక్రూట్ చేసుకుంది కంపెనీ. అయితే...ఇప్పుడు బిజినెస్ డల్ అవడం వల్ల వారి అవసరం లేదని భావిస్తోంది. అందుకే....క్రమంగా వారిని తొలగిస్తూ వస్తోంది. 

Also Read: Rajamouli on James Cameron: RRRను రెండుసార్లు చూసిన కామెరూన్ - రాజమౌళితో ఆయన ఏమన్నారో తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Crime News: ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
Tilak Varma News: సౌత్ జోన్ కెప్టెన్ గా తిలక్ వర్మ .. వైస్ కెప్టెన్ గా రికీ భుయ్  ఎంపిక
సౌత్ జోన్ కెప్టెన్ గా తిలక్ వర్మ .. వైస్ కెప్టెన్ గా రికీ భుయ్  ఎంపిక.. 23 నుంచి దులీప్ ట్రోఫీ
US Iran War: దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
Taslima Nasrin Back To Kolkata: రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Iran War: దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
Hyderabad Crime News: ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
Taslima Nasrin Back To Kolkata: రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
Jasprit Bumrah Out.!: లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
YSRCP MLA Virupakshi: కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Embed widget