అన్వేషించండి

Viral News: రూ.20 లంచం కేసులో 30 ఏళ్ల తరువాత నిర్దోషిగా తీర్పు, అంతలోనే విషాదం

Gujarat High Court: 20 రూపాయల లంచం కేసులో ఒక కానిస్టేబుల్ దశాబ్దాలపాటు జైలు శిక్ష అనుభవించాడు. 30 ఏళ్ల తర్వాత కోర్టు అతన్ని నిర్దోషిగా ప్రకటించింది. మరుసటి రోజు గుండెపోటుతో చనిపోయాడు.

న్యాయం గెలిచింది.. కానీ మనిషి ఓడిపోయాడు: 30 ఏళ్ల పోరాటం తర్వాత విషాదాంతం

అహ్మదాబాద్: భారత న్యాయ వ్యవస్థలో కేసుల విచారణలో జరిగే జాప్యం ఒక్కోసారి మనుషుల జీవితాన్ని తలకిందులు చేస్తుంది. కొన్ని సందర్భాలలో ప్రాణాలు పోయాక సైతం తీర్పులు వచ్చిన కేసులు చాలానే ఉన్నాయి. గుజరాత్‌లో దాదాపుగా అలాంటి ఘటన ఒకటి తాజాగా జరిగింది. కేవలం 20 రూపాయల లంచం తీసుకున్నారనే ఆరోపణలతో 30 ఏళ్ల పాటు న్యాయపోరాటం చేసిన ఒక మాజీ పోలీసు కానిస్టేబుల్ ఎట్టకేలకు నిర్దోషి అని నిరూపించుకున్నాడు. కోర్టు తనను నిర్దోషిగా ప్రకటించిన మరుసటి రోజే గుండెపోటుతో కన్నుమూయడంతో విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటన హాలీవుడ్ క్లాసిక్ 'ది షాషాంక్ రిడెంప్షన్' కథను తలపిస్తోంది.

అసలేం జరిగింది?

అహ్మదాబాద్‌లో పోలీసు కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న బాబూభాయ్ ప్రజాపతి 20 రూపాయల లంచం తీసుకున్నారనే ఆరోపణతో 1996లో అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదైంది. 1997లో ఛార్జ్‌షీట్ దాఖలు కాగా, 2004లో సెషన్స్ కోర్టు ఆయనకు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ. 3,000 జరిమానా విధించింది. తాను ఏ తప్పు చేయలేదని, సెషన్స్ కోర్టు తీర్పును సవాలు చేస్తూ ఆయన గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. ఆ అప్పీలు ఏకంగా 22 ఏళ్ల పాటు పెండింగ్‌లో ఉండిపోయింది.

చివరి క్షణంలో న్యాయం

ఎట్టకేలకు ఈ ఏడాది ఫిబ్రవరి 4న గుజరాత్ హైకోర్టు తుది తీర్పు వెలువరించింది. సాక్ష్యాధారాల్లో పొంతన లేదని, ప్రాసిక్యూషన్ ఆరోపణలను నిరూపించడంలో విఫలమైందని పేర్కొంటూ మాజీ పోలీస్ కానిస్టేబుల్ బాబూభాయ్‌ను నిర్దోషిగా విడుదల చేసింది. తీర్పు విన్న ఆయన ఎంతో ఉద్వేగానికి లోనయ్యారు. నా జీవితంపై పడిన పెద్ద మచ్చ తొలగిపోయింది, ఇప్పుడు దేవుడు నన్ను తీసుకువెళ్లినా బాధ లేదు అని తన లాయర్ వద్ద కన్నీరు పెట్టుకున్నారు.

20 ఏళ్లకు న్యాయం గెలిచింది.. ప్రాణం పోయింది..

కోర్టు తీర్పుతో తన గౌరవం తిరిగి దక్కిందన్న సంతోషంతో బాబూభాయ్ ఇంటికి వెళ్లిపోయాడు. మరుసటి రోజే ఆయన గుండెపోటుతో చనిపోయారు. చేయని తప్పిదానికి 30 ఏళ్లు ఎంతో నరకయాతన అనుభవించి, సుదీర్ఘ పోరాటం తర్వాత దక్కిన విజయాన్ని అనుభవించకుండానే బాబూభాయ్ కన్నుమూయడం ఆయన కుటుంబాన్ని, ఆయన లాయర్లను తీవ్రంగా కలిచివేసింది. న్యాయం ఆలస్యమవ్వడం అంటే న్యాయాన్ని నిరాకరించడమే అనే మాటకు ఈ ఘటన ఒక నిదర్శనం అని అతడి కుటుంబసభ్యులు అంటున్నారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Mobile Recharge Price Hike: త్వరలో పెరగనున్న మొబైల్ రీచార్జ్ ప్లాన్ ధరలు.. కంపెనీలు ఏం చెబుతాయి
త్వరలో పెరగనున్న మొబైల్ రీచార్జ్ ప్లాన్ ధరలు.. కంపెనీలు ఏం చెబుతాయి
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
CM Revanth Reddy US Visit: రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget