Uttar Pradesh: వధువుకి బలవంతంగా ముద్దు పెట్టిన వరుడు, తండ్రి అభ్యంతరం - వేదికపై కర్రలతో కొట్టుకున్న కుటుంబాలు
Uttar Pradesh News: యూపీలో వరుడు వధువుకి ముద్దు పెట్టడంపై రెండు కుటుంబాలు గొడవకు దిగి వేదికపైనే కర్రలతో కొట్టుకున్నాయి.
Groom Kisses Birde: పెళ్లి అవుతుండగానే వరుడు వధువు ముద్దు పెట్టాడని రెండు కుటుంబాలు స్టేజ్‌పైనే కర్రలతో కొట్టుకున్నాయి. యూపీలో హపూర్‌లోని అశోక్ నగర్‌లో ఈ ఘటన జరిగింది. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు పెళ్లి దండలు వేసుకుంటున్న సమయంలో వరుడు అమ్మాయికి ముద్దు పెట్టాడు. దీనిపై వరుడు, వధువు కుటుంబాల మధ్య వాగ్వాదం జరిగింది. పెళ్లి కూతురు కుటుంబ సభ్యులు వరుడి కుటుంబంపై దాడి చేశారు. ఆ గొడవ కర్రలతో కొట్టుకునేంత వరకూ వెళ్లింది. ఈ ఘటనలో మొత్తం ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల్లో పెళ్లి కూతురు తండ్రి కూడా ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఫంక్షన్ హాల్‌కి వచ్చారు. మొత్తం ఏడుగురుని అదుపులోకి తీసుకున్నారు. గాయపడ్డ వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం...వధువు తండ్రి మరో కూతురి పెళ్లి కూడా అదే రోజున జరిపించాడు. మొదటి కూతురి పెళ్లి సజావుగానే సాగినప్పటికీ రెండో కూతురు పెళ్లి మాత్రం ఇలా గొడవలకు దారి తీసింది. పెళ్లి కొడుకు అందరూ చూస్తుండగానే స్టేజ్‌పైనే బలవంతంగా తన కూతురికి ముద్దు పెట్టాడని వధువు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అటు వరుడు మాత్రం అమ్మాయి బలవంత పెడితేనే ముద్దు పెట్టానని చెప్పాడు. అయితే...ఈ ఘటనపై రెండు కుటుంబాలు ఎలాంటి కంప్లెయింట్ ఇవ్వలేదని పోలీసులు వెల్లడించారు.