అన్వేషించండి

African Killer Bees: తాగీ తాగగానే కిక్‌ ఇచ్చే తేనెటీగల బీర్‌, త్వరలోనే మార్కెట్‌లోకి - స్పెషాల్టీ ఇదే

African Killer Bee Beer: ఆఫ్రికన్‌ కిల్లర్‌ బీస్‌గా పిలుచుకునే తేనెటీగల నుంచి కొత్త రకం బీర్ తయారు చేసేందుకు పరిశోధనలు జరుగుతున్నాయి.

Telugu News: యూకేకి చెందిన  Cardiff University కిక్ ఎక్కించే బీర్ తయారు చేసే పనిలో పడింది. ఆల్కహాల్ తక్కువగా ఉండే బీర్‌ని కూడా మత్తుగా మార్చేలా ఓ ప్రయోగం చేస్తోంది. ఆఫ్రికాలో అత్యంత ప్రమాదకరమైన తేనెటీగల నుంచి ఈ బీర్‌ తయారు చేయనుంది. African killer bees గా పిలుచుకునే ఈ తేనెటీగల్లోని ఈస్ట్‌ని (Yeast) వెలికి తీసి దాంతో బీర్‌ తయార చేయనున్నారు. దీనికి The Killer Bee Beer అనే పేరు కూడా పెట్టారు. యూనివర్సిటీ వెల్లడించిన వివరాల ప్రకారం...తేనెటీగలపై అధ్యయనం చేసే క్రమంలో ఈ ప్రయోగం చేశారు. సింపుల్‌గా చెప్పాలంటే..కాలక్షేపం కోసం చేసిన ఓ సరదా ఎక్స్‌పరిమెంట్ ఇది.

తేనె, తేనె తుట్టల నుంచి తీసిన వ్యాక్స్‌తో పాటు ఇతరత్రా బైప్రొడక్ట్స్ మన శరీరంలోని యాంటీబయోటిక్ రెసిస్టెన్స్‌ని పెంచడంలో ఎలాంటి పాత్ర పోషిస్తాయని పరిశోధించారు. అందులో భాగంగానే కిల్లర్ బీస్‌నిపైనా స్టడీ చేశారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా కార్డిఫ్ యూనివర్సిటీకి చెందిన మైక్రోబయాలజిస్ట్‌లు నమీబియా వెళ్లారు. ఆఫ్రికన్ హనీ బీస్‌పై అధ్యయనం చేశారు. తేనెటీగల సంతానోత్పత్తిలో కీలకమైన Yeast తో పాటు Welsh honey bees లోని ఈస్ట్‌నీ కలిపి బీర్‌ తయారు చేయనున్నారు. అంటే బ్యాచ్‌ల వారీగా వీటిని అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశాలున్నాయి. 

African Killer Bees: తాగీ తాగగానే కిక్‌ ఇచ్చే తేనెటీగల బీర్‌, త్వరలోనే మార్కెట్‌లోకి - స్పెషాల్టీ ఇదే

ఆఫ్రికన్ బీస్ మహా డేంజరస్..

ఆఫ్రికన్ బీస్‌ హైబ్రిడ్ తేనెటీగలు. ఈస్ట్ ఆఫ్రికన్ తేనెటీగలు, యురేపియన్ తేనెటీగలు కలిస్తే వచ్చేవే క్రాస్‌బ్రీడ్ ఈ African killer bees.ఇవి చాలా అగ్రెసివ్‌గా ఉంటాయి. బడా బడా జంతువులతో పాటు గుర్రాల్ని, మనుషుల్ని కుట్టి చంపేయగలవు. ఈ అధ్యయనం చేసేందుకు కార్డిఫ్ యూనివర్సిటీలోనే పలు చోట్ల తేనె తుట్టల్ని పెంచారు. వాటి నుంచి సేకరించిన ఈస్ట్‌నే బీర్‌ల తయారీకి వినియోగించనున్నారు. వీలైనంత త్వరగా ఈ బీర్‌లను మార్కెట్‌లోకి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. 

Also Read: Bird Feather: వేలంలో రూ.23 లక్షల ధర పలికిన పక్షి ఈక, అందులో అంత స్పెషల్ ఏముంది?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
Adilabad Tiger News: ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
Adilabad Tiger News: ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
Pushpa 2: యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
Ram Charan: మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Embed widget