Dream11 Jackpot Winner :గ్యాస్ సిలిండర్లు మోసే వ్యక్తి తలుపుతట్టిన లక్ష్మీదేవి.. ఏకంగా 1.5 కోట్లు!
Jackpot in one day: మొన్నిటి వరకు గ్యాస్ సిలిండర్లు మోసే వ్యక్తి ఇప్పుడు కోటీశ్వరుడు అయ్యాడు. 49 రూపాయలతో కోటిన్నర డబ్బులు గెలుచుకున్నాడు.
1.5Crores Price money: అదృష్టం ఎప్పుడు ఎవరిని వరిస్తుందో అర్థంకాదు. లక్ష్మీ దేవి కటాక్షం ఉంటే రాత్రికి రాత్రి కోటీశ్వర్లు అయిపోవచ్చు అంటారు. అనేదేముంది చాలా సంఘటనలు జరిగాయి కూడా. లాటరీ తగిలి రాత్రికి రాత్రి కోటీశ్వర్లు అయినవాళ్లు చాలామందే ఉన్నారు. అయితే, అలా లాటరీల్లో డబ్బులు పెట్టి పోగొట్టుకున్నవాళ్లూ లేకపోలేదు. ఇక ఇప్పుడు ఒక సిలిండర్ డెలివరీ బాయ్ తలుపు తట్టింది లక్ష్మీదేవి. ఒకేసారి అతని ఖాతాకు కోటిన్నర వచ్చిపడ్డాయి. ఎలా అంటారా?
డ్రిమ్ - 11 యాప్ ద్వారా జాక్‌పాట్
మొన్నటి వరకు ప్రతి ఇంటికి సిలిండర్‌లు మోసి నయానా బయానా సంపాదించుకునేవాడిని డ్రీమ్ - 11 ఫాంటసీ క్రికెట్ గేమ్ కోటీశ్వరుడిని చేసింది. డ్రీమ్-11 యాప్ ద్వారా ఏకంగా రూ.కోటిన్నర గెలుచుకున్నాడు. మిలియనీర్ కావాలనే తన కల నెరవేరిందని ఆనందం వ్యక్తం చేస్తున్నాడు సాదిక్ అనే యువకుడు. 49 రూపాయలు పెట్టి.. ఇప్పుడు ఏకంగా కోట్లు గెలుచున్నానని తెగ సంబరపడిపోతున్నాడు.
బీహార్‌లోని అరారియా జిల్లా సదర్ మండలం పటేగనా గ్రామానికి సాదిక్ ఇంటింటికి తిరిగి గ్యాస్ సిలిండర్‌లు సప్లై చేసేవాడు. అయితే, అతనికి క్రికెట్ అంటే పిచ్చి. దాంట్లో భాగంగానే డ్రీమ్ - 11లో ఫాంటసీ గేమ్స్ ఆడుతుండేవాడు. దాంట్లో భాగంగానే జనవరి 14న జరిగిన భారత్- అఫ్గానిస్థాన్ మ్యాచ్‌లో రూ.49 పెట్టి డ్రీమ్-11లో ఫాంటసీ గేమ్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో 974.5 పాయింట్లు సాధించి తొలిస్థానంలో నిలిచాడు సాదిక్. అలా రాత్రికి రాత్రి కోటిన్నర వచ్చి ఆయన అకౌంట్‌లో పడ్డాయి అని గ్యాస్ ఏజెన్సీ ఓనర్ జీతేందర్ చెప్పారు.
గతంలో కూడా చాలాసార్లు ఫ్యాంటసీ గేమ్ ఆడాడు సాధిక్. అయితే, ఎప్పుడూ ఇంత డబ్బు రాలేదు. ఒక్కసారిగా ఇంక పెద్దమొత్తంలో డబ్బు రావడంతో ఆశ్చర్యానికి లోనయ్యాడు. ఇక ఇదే విషయాన్ని కుటుంబసభ్యులు, స్నేహితులకు చెప్పినా ఎవ్వరూ మొదట్లో సాధిక్‌ని నమ్మలేదట. ఆ తర్వాత బ్యాంక్‌లో డబ్బుల వచ్చి పడటంతో ఇప్పుడు అందరూ సాధిక్ ఇంటికి క్యూ కట్టారు. ఇక ఆయన కుటుంబసభ్యులు ఆనందంతో సంబరాలు చేసుకున్నారు. ఇంత పెద్ద అమౌంట్ వచ్చిందంటే తానే నమ్మలేకపోతున్నానని ఆనందం వ్యక్తం చేశాడు సాదిక్. ఇన్నిరోజులు గ్యాస్ ఏజెన్సీ సాధిక్ అని, ఇప్పుడు కోటీశ్వరుడు సాధిక్ అంటున్నారు గ్రామస్థులంతా. అయితే, సాధిక్ ఖాతాలోని డబ్బులు మాత్రం ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసినట్లు గ్యాస్ ఏజెన్సీ యజమాని జితేందర్ మీడియాతో చెప్పాడు.
గతంలో కూడా కేరళలో ఒక ఆటో డ్రైవర్ లాటరీలో కోట్లు గెలిచిన విషయం తెలిసిందే. ఆ టైంలో ఆయన ఆ డబ్బుతో ఎంతో ఇబ్బందులు పడ్డారని చెప్పారు. అయితే, సాధిక్ అలా కాకుండా ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసుకుని మంచి పని చేశాడు అంటున్నారు అందరూ. ఇదిలా ఉంటే.. పోయిన ఏడాది అక్టోబర్‌లో మహారాష్ట్రకి చెందిన ఒక ఎస్‌ఐకి ఇలానే 1.5 కోట్లు రాగా.. ఆయన్ను ఉన్నతాధికారులు విధుల్లో నుంచి సస్పెండ్ చేశారు.
Also Read: డీప్‌ఫేక్ వీడియోతో రష్మికను ఇబ్బంది పెట్టిన తెలుగు వ్యక్తి - ప్రధాన నిందితుడి అరెస్ట్