అన్వేషించండి

USA Arrest : అమెరికాలో మనుషుల అక్రమ రవాణా - నలుగురు తెలుగు వ్యక్తుల అరెస్ట్

America Arrest : అమెరికాలో హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో నలుగురు తెలుగువాళ్లు అరెస్టయ్యారు. వీరు వీసా స్కాంకు పాల్పడి అక్రమంగా మనుషుల్ని అమెరికా తీసుకు వచ్చి పని చేయించుకుంటున్నట్లుగా గుర్తించారు.

Four Telugu people   arrested in uman trafficking Case : అమెరికాలో తెలుగు యువతీయువకులు ముఠాగా ఏర్పడి నిర్వహిస్తున్న  మనుషుల అక్రమ రవాణాను అక్కడి పోలీసులు అరికట్టారు. చదువులు,  ఉద్యోగం కోసం అమెరికా వెళ్లిన మహిళలు, పురుషులను నిర్బంధించి అతి తక్కువ జీతాలనికి వెట్టి చాకిరీకి పాల్పడుతున్నారు.  షెల్ కంపెనీల్లో నిబంధనలకు విరుద్ధంగా వాళ్లతో పని చేయించుకుంటున్నారు.  ప్రిన్స్ టన్ పోలీసులకు సమాచారం రావడంతో వారు ఉంటున్న అపార్టుమెంట్ పై దాడి చేశారు. నిజమే అని తేలడంతో బాధితులకు విముక్తి కల్పించి నలుగురు నిందితుల్ని అరెస్టు చేశారు. 

అరెస్ట్ అయిన వారిలో  చందన్ దాసిరెడ్డి, ద్వారక గుండా, సంతోష్ కట్కూరి, అనిల్ మాలే ఉన్నారు.  అపార్ట్మెంట్ లో ఎక్కువ మంది ఉండటం గమనించిన పెస్ట్ కంట్రోల్ వ్యక్తి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వటంతో ఈ ముఠాను పోలీసులు పట్టుకోగలిగారు.  మార్చ్ 13, 2024న అతని నుండి ఫిర్యాదు అందుకున్న ప్రిన్స్ టన్ పోలీసులు ఆ అపార్ట్మెంట్ తనిఖీ చేశారు. ఈ ముఠా ఒక్క ప్రిన్స్ టన్ లో మాత్రమే కాకుండా మెలిస్సా, మిక్ కెన్నీ వంటి ఇతర నగరాల్లో కూడా అమ్మాయిల అక్రమ రవాణాకు పాల్పడినట్లు   పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుండి లాప్ టాప్స్, సెల్ ఫోన్స్, ప్రింటర్స్, ఫేక్ డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. డ‌ల్లాస్ కేంద్రంగా ఇదంతా జ‌రుగుతోంద‌ని... ఓ భార‌త ఏజెన్సీలోని న‌లుగురు త‌మ‌తో బ‌ల‌వంతంగా ప‌ని చేయిస్తున్నార‌ని ప‌ట్టుబ‌డ్డ నిందితులు వాంగ్మూలం ఇచ్చారు. 

ఇటీవల బానిసత్వం, హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులు తెలుగువారిపై ఎక్కువగా నమోదవుతున్నాయి. గత డిసెంబర్‌లో  సత్తారు వెంకటేష్ రెడ్డి అనే వ్యక్తిని అమెరికాలో సెయింట్ లూయిస్ పోలీసులు అరెస్ట్ చేశారు.   అమెరికాలో హ్యూమన్ ట్రాఫికింగ్‌ చేయడం సహా అనేక నేరాల కింద కేసు నమోదు చేశారు.  ఇరవై ఏళ్ల యువకుడ్ని చదువు పేరుతో అమెరికాకు తీసుకు వచ్చి ఇంట్లో వెట్టి చాకిరీ చేయించుకుంటున్నాడని కేసు నమోదు అయింది.  చెప్పిన మాట వినకపోతే ఇష్టం వచ్చినట్లుగా దాడి చేస్తున్నాడు. పీవీసీ పైపులతో కొడుతున్నారు. రోజుకు కనీసం మూడు గంటలుకూడా నిద్రపోనీయకుండా పని చేయించుకుంటూ… పదే పదే హింహిస్తూండటంతో ఆ ఇరవై ఏళ్ల యువకుడు పూర్తిగా బలహీనపడ్డాడు. ఇతని పరిస్థితి చూసిన ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సత్తారు వెంకటేష్ రెడ్డితో పాటు మరో ఇద్దర్ని అరెస్టు చేశారు. 

చదువులు, ఉపాధి కోసం అమెరికా వెళ్తున్న వారు అక్కడకు వెళ్లాకా ఇబ్బంది పడుతున్నారు. కనీస అవసరాలకు డబ్బులు లేక చిన్న చిన్న ఉద్యోగాలు అయినా చేసుకుంటున్నారు. ఇలాంటి వారి అవసరాలను గుర్తించి.. వారితో వెట్టి చాకిరీ చేయించుకునే  ప్రయత్నం చేయడంతో తెలుగువాళ్లు అరెస్టవుతున్నారు. బాధితుల్లో కూడా ఎక్కువ మంది తెలుగువాళ్లే ఉంటున్నారు.                                        
  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
KCR News: ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
Game Changer Teaser: ‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
AP Cabinet: ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నడి సంద్రంలో ఇద్దరే మహిళలు, భూగోళాన్ని చుట్టే్సే అద్భుత యాత్రట్రంప్ ఎన్నికతో మస్క్ ఫుల్ హ్యాపీ! మరి కూతురికి భయమెందుకు?ఉడ్‌బీ సీఎం అని  లోకేశ్ ప్రచారం - అంబటి రాంబాబుఅధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
KCR News: ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
Game Changer Teaser: ‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
AP Cabinet: ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
Hyderabad News: భాగ్యనగర వాసులకు అలర్ట్ - ఈ నెల 11న ఈ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా బంద్
భాగ్యనగర వాసులకు అలర్ట్ - ఈ నెల 11న ఈ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా బంద్
Royal Enfield Flying Flea C6: మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను పరిచయం చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ - లాంచ్ ఎప్పుడంటే?
మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను పరిచయం చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ - లాంచ్ ఎప్పుడంటే?
Pawan Kalyan: ఆ కుటుంబాలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ, సొంత ట్రస్ట్ నుంచి రూ. 2 లక్షల సాయం
ఆ కుటుంబాలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ, సొంత ట్రస్ట్ నుంచి రూ. 2 లక్షల సాయం
Lucky Car: 1500 మంది అతిథులు, రూ.4 లక్షల ఖర్చు - అదృష్టం తెచ్చిన కారుకు అంత్యక్రియలు
1500 మంది అతిథులు, రూ.4 లక్షల ఖర్చు - అదృష్టం తెచ్చిన కారుకు అంత్యక్రియలు
Embed widget