పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కొత్త పార్టీ పేరు ప్రకటించారు. 'పంజాబ్ లోక్‌ కాంగ్రెస్' పేరుతో పార్టీ పెట్టినట్లు తెలిపారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారికంగా రాజీనామా చేశారు అమరీందర్ సింగ్. ఈ మేరకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాశారు.






సోనియా గాంధీకి రాసిన లేఖలో పీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూపై అమరీందర్ సింగ్ పలు ఆరోపణలు చేశారు. తన పేరును దెబ్బతీసేందుకు సిద్ధూ ప్రయత్నించారని అందుకు రాహుల్, ప్రియాంక గాంధీ మద్దతు ఇచ్చారని కెప్టెన్ విమర్శించారు. పార్టీ అధిష్ఠానం ప్రోద్బలంతో తనపైనా, తన ప్రభుత్వంపైన సిద్ధూ విమర్శలు చేశారని సోనియా గాంధీకి రాసిన లేఖలో అమరీందర్ సింగ్ ఆరోపించారు.


రసవత్తరంగా రాజకీయం..


2022లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పంజాబ్‌లో గత రెండు నెలలుగా రాజకీయం రసవత్తరంగా మారింది. ముఖ్యంగా అమరీందర్ సింగ్, సిద్ధూ మధ్య మొదలైన కోల్డ్‌వార్ కాంగ్రెస్ కొంపముంచింది. అమరీందర్ సింగ్ సీఎం పదవికి రాజీనామా చేసి కొత్త పార్టీని ప్రకటించారు. మరోవైపు పంజాబ్ పీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ కూడా కొన్ని రోజులు అలకపాన్పు ఎక్కి చివరికి కాంగ్రెస్ అధిష్ఠానం బుజ్జగించడంతో మళ్లీ లైన్లో పడ్డారు. అయితే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ నుంచి గట్టి పోటీ ఉండే అవకాశం ఉందని ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి కెప్టెన్ కొత్త పార్టీ ఏ మేరకు ప్రభావం చూపుతుందో చూడాలి.


Also Read: By Election Results 2021: ఉపఎన్నికల్లో భాజపాకు షాక్.. పుంజుకున్న కాంగ్రెస్.. దీదీ క్లీన్‌స్వీప్!


Also Read: Ajit Pawar Income Tax: డిప్యూటీ సీఎంకు ఐటీ శాఖ షాక్.. రూ.1000 కోట్ల విలువైన ఆస్తులు జప్తు!


Also Read: Corona Cases: దేశంలో భారీగా తగ్గిన కరోనా ఉద్ధృతి.. కొత్తగా 10 వేల కేసులు


Also Read: VS Achuthanandan Hospitalized: ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రికి అస్వస్థత.. ఐసీయూలో చికిత్స


Also Read: By Election Results 2021:అసోం, మధ్యప్రదేశ్‌లో భాజపా ముందంజ.. బంగాల్‌లో టీఎంసీ హవా


Also read: తీపి అధికంగా తింటున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే


Also read: ఈ పాపులర్ బ్రేక్‌ఫాస్ట్ మీ గుండెకు హాని చేయచ్చు... జాగ్రత్త


Also read: వారానికి రెండు సార్లు తింటే చాలు... మతిమరుపు మీ మెదడును చేరదు


Also read: నిమ్మరసం చేర్చిన కాఫీ తాగితే కెలోరీలు కరిగిపోయే ఛాన్స్... ఇది నిజమేనా?


Also Read: ఆ రాష్ట్రాల్లో దీపావళి అంటే బాణసంచాతో మినీ యుద్ధమే.. ఇంతకీ క్రాకర్స్ ఎందుకు కాల్చాలో తెలుసా..!


Also Read:యక్ష ప్రశ్నలంటే ఏంటి.. వాటికి సమాధానం ఎవరు ఎవరికి ఏ సందర్భంలో చెప్పారు..


Also Read: మడి వంట అంటే ఏంటి... ఇది పాటించకపోతే ఏమవుతుంది..!


Also Read: కాకులకు చావు ఉండదా. కాకికి-కర్మ కాండలకు సంబంధం ఏంటి ...!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి