ప్రస్తుతం టాలీవుడ్ లో కాస్త ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్ ఇష్యూ ఇంకా కొలిక్కి రాలేదు. ప్రేక్షకులు కూడా ఇంతకముందులా థియేటర్లకు రావడంతో లేదు. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు బిజినెస్ బాగా తగ్గింది. ఇలాంటి సిట్యుయేషన్ లో కూడా హీరోలు తమ రెమ్యునరేషన్ ను పెంచేస్తున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం.. మాస్ మహారాజా రవితేజ రెమ్యునరేషన్ రూ.18 కోట్ల మార్క్ ను అందుకున్నట్లు తెలుస్తోంది. 


Also Read: ప్రజెంట్ 'గాడ్ ఫాదర్'... 15 నుంచి 'భోళా శంకర్'... మెగాస్టార్ స్పీడు మామూలుగా లేదుగా!


చాలా కాలంగా హిట్స్ లేక ఇబ్బందిపడ్డాడు రవితేజ. ఎన్ని సినిమాలు చేసినా.. వర్కవుట్ అవ్వలేదు. మూస ధోరణిలో సినిమాలు చేస్తున్నాడంటూ చాలా మంది విమర్శించారు. అలాంటి సమయంలో 'క్రాక్' అంటూ ఓ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఫస్ట్ వేవ్ తరువాత విడుదలైన ఈ సినిమా భారీ హిట్ అందుకుంది. దీంతో రవితేజ మళ్లీ ట్రాక్ లో పడ్డాడు. వరుస సినిమాలను ప్రకటిస్తున్నాడు. దానికి తగ్గట్లే రెమ్యునరేషన్ కూడా పెంచేశాడు. 


ప్రస్తుతం ఆయన 'ఖిలాడి' సినిమాలో నటిస్తున్నాడు. దీంతో  పాటు 'రామారావు ఆన్ డ్యూటీ', 'ధమాకా' లాంటి సినిమాలు లైన్ లో ఉన్నాయి. వీటన్నింటికీ కూడా పదిహేను నుంచి పదహారు కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు. రీసెంట్ గా సుధీర్ వర్మతో మరో సినిమా అనౌన్స్ చేశాడు. ఈ సినిమాకి అభిషేక్ నామాతో పాటు రవితేజ కూడా నిర్మాతగా వ్యవహరించనున్నాడు. కాబట్టి లాభాల్లో వాటా తీసుకోబోతున్నాడు. 


అయితే తొలిసారి ఆయన ఒక సినిమా రూ.18 కోట్లు తీసుకోబోతున్నాడట. ఆ సినిమా ఏంటంటే.. టైగర్ నాగేశ్వరావు బయోపిక్. చాలా రోజులుగా ఇండస్ట్రీలో ఈ సినిమా తెరకెక్కనుందని వార్తలొస్తున్నాయి. కానీ ఇప్పటివరకు సెట్స్ పైకి వెళ్లలేదు. చాలా మంది హీరోలకు ఈ కథను వినిపించారు. ఫైనల్ గా రవితేజ దగ్గరకు వెళ్లి ఆగింది. దర్శకుడు వంశీ కృష్ణ రూపొందించనున్న ఈ సినిమాకి అభిషేక్ అగర్వాల్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. రూ.50 కోట్ల బడ్జెట్ తెరకెక్కనున్న ఈ సినిమాకి ఒక్క రవితేజ రెమ్యునరేషన్ రూ.18 కోట్లట. మరి ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ ఇస్తున్నారంటే.. నిర్మాతలకు ఎలా వర్కవుట్ అవుతుందో చూడాలి!


Also Read: సంక్రాంతి బరిలో రాజ'శేఖర్'... యాంగ్రీ స్టార్ తగ్గేదే లే!


Also Read: 'ఆర్ఆర్ఆర్' గ్లింప్స్‌లో ఇవి గ‌మ‌నించారా!? 


Also Read: ఆర్ఆర్ఆర్... బ్రదర్ & బావా... 45 సెకన్లలో ఎలా?


Also Read: కాజల్ మేడమ్... ఇద్దరూ కలిసి తాగుతున్నారా!? తాగి తాగి సచ్చిపోండి!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి