RRR Glimpse: 'ఆర్ఆర్ఆర్' గ్లింప్స్‌లో ఇవి గమనించారా!?
'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' గ్లింప్స్ ప్రారంభించడమే కథానేపథ్యంలోకి తీసుకువెళ్లారు రాజమౌళి. ఎడ్లబండ్లు, తలపాగాతో మనుషులు... దేశానికి స్వాతంత్య్రం రావడానికి ముందు కాలంలోకి తీసుకువెళ్లారు. విజువల్స్ గ్రాండ్‌గా ఉన్నాయి. (Image credit: DVV Entertainment/Youtube)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఎన్టీఆర్‌కు, పులికి మధ్య 'ఆర్ఆర్ఆర్'లో ఓ ఫైట్ ఉందని ప్రచారం జరుగుతోంది. ఆ ఫైట్ చూపించలేదు గానీ... ఎన్టీఆర్‌ను వెంటాడుతున్న పులిని చూపించారు. మరీ అంత చూపించలేదు. అందువల్ల, నిశితంగా గమనిస్తే తప్ప కనిపించదు. (Image credit: DVV Entertainment/Youtube)
సినిమాలో రామ్ చరణ్ పేరు... ఎ. రామరాజు. ఎ అంటే అల్లూరి. మరి, ఎందుకు అల్లూరిని వాడలేదో? ఇక, రామ్ చరణ్‌ను ప్రజలను ముట్టడించడం చూస్తుంటే... పోలీస్ కాబట్టి బ్రిటీషర్లకు వ్యతిరేకంగా అతడిని స్వాతంత్య్ర కాంక్షతో ముట్టడించారేమో!? (Image credit: DVV Entertainment/Youtube)
రామ్ చరణ్ పోలీస్. ఇన్ని రోజులు ఖాకీ దుస్తుల్లో కనిపించారు. కానీ, ఈ గ్లింప్స్‌లో డ్రస్ కలర్ మారింది. పోలీస్ శాఖలో ఆయన పదోన్నతికి చిహ్నంగా ఈ రంగును చూపించి ఉండవచ్చు. (Image credit: DVV Entertainment/Youtube)
ఆలియా భట్... కనిపించింది కాసేపే! కానీ, ఆమె ఎక్స్‌ప్రెషన్ చూస్తే ఏదో విషయమై ఆందోళన చెందుతున్నట్టు ఉన్నారు. (Image credit: DVV Entertainment/Youtube)
ఆలియా భట్ కనిపించారు సరే... మరి, ఎన్టీఆర్ సరసన నటించిన ఒలీవియా మోరిస్ ఎక్కడ? అనుకుంటున్నారా!? మంటల్లో కారు వెనుక ఉన్నారు. జాగ్రత్తగా పరిశీలిస్తే తప్ప గ్లింప్స్‌లో ఆవిడను గమనించడం కష్టం. (Image credit: DVV Entertainment/Youtube)
ఇప్పటివరకూ విడుదల చేసిన టీజర్లలో ఎన్టీఆర్‌ను అడవిలో చూపించారు. రామ్ చరణ్‌తో స్టిల్స్‌లో బైక్ మీద కనిపించారు. కానీ, ఈ గ్లింప్స్‌లో అడివి నుండి ఎన్టీఆర్ కోటకు వచ్చారు. బ్రిటీషర్ల మీద ఫైట్ చేశారు. (Image credit: DVV Entertainment/Youtube)
గ్లింప్స్‌లో రాహుల్ రామకృష్ణ ఉన్నారు చూశారా? ఎవరి నుండో తప్పించుకోవడానికి పరుగు తీస్తున్న దృశ్యం మనకు రిజిస్టర్ అవుతుంది. అయితే... అతడు ఎన్టీఆర్ వెనుక ఉన్న దృశ్యం ఎంతమంది గమనించారు? బహుశా... సినిమాలో ఎన్టీఆర్ అనుచరుడిగా రాహుల్ రామకృష్ణ కనిపించవచ్చు. (Image credit: DVV Entertainment/Youtube)
గ్లింప్స్ ప్రారంభంలో ఒకసారి... చివర్లో మరోసారి... రెండుసార్లు బహిరంగంగా ఉరి వేసే ప్రాంగణాన్ని చూపించారు. ప్రజలను కట్టడి చేయడానికి భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు. అయితే, ఎవరికి ఉరి వేశారు? అనేది ఆసక్తికరం. (Image credit: DVV Entertainment/Youtube)
రైల్ అండ్ రోడ్ బ్రిడ్జ్... రాజమండ్రి బ్రిడ్జ్ తరహాలో మీద భారీ ఫైట్ ఉంది. ఆయిల్ ట్యాంకర్లు బ్లాస్ట్ అవ్వడం కనిపించింది. అయితే... త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని గుర్రం మీద నుండి నదిలోకి ఓ వ్యక్తి దూకుతున్నారు. అది రామ్ చరణ్ కావచ్చు. ఆ దృశ్యాన్ని గమనించారా? (Image credit: DVV Entertainment/Youtube)
కళ్లుచెదిరే విజువల్స్ కు నదీతీరంలో జనావాస ప్రాంతం. అది ఓ కాలనీలా ఉంది. అయితే... అక్కడ ఓ పాటను భారీ స్థాయిలో చిత్రీకరించారు. ఉట్టి కొట్టడం వంటివి కూడా పాటలో ఉన్నాయి. అదొక విజువల్ ట్రీట్. (Image credit: DVV Entertainment/Youtube)
శ్రియా శరణ్ సైతం గ్లింప్స్‌లో ఉన్నారు. చిన్న పిల్లలను తీసుకుని వెళ్తుండటం చూస్తుంటే... వాళ్లను రక్షించడానికి తాపత్రయపడుతున్నట్టు అర్థమవుతోంది. (Image credit: DVV Entertainment/Youtube)
రామ్ చరణ్ పాత్ర స్వభావం నిప్పులాంటిది. అది చెప్పడానికి పోరాట దృశ్యాల్లో అతడి చుట్టూ నిప్పును చూపించారు. అంతకు ముందు గన్ ఫైరింగ్ చేసే దృశ్యంలో రామ్ చరణ్ కళ్లలో ఒక ఇంటెన్స్ కనిపించింది. (Image credit: DVV Entertainment/Youtube)
ఎన్టీఆర్ పాత్ర స్వభావం నీరులాంటిది. పోరాట దృశ్యాల్లో అతడి చుట్టూ నీరు ఉంది. అంతకు ముందు రక్తం కారే దృశ్యంలో ఎన్టీఆర్ కళ్లలో తీవ్రత ప్రేక్షకుల్ని కట్టిపడేసేలా ఉంది. (Image credit: DVV Entertainment/Youtube)
అజయ్ దేవగన్ బ్రిటీషర్ల మీద కాల్పులు జరిపే దృశ్యం ఒకటి ఉంది. బుల్లెట్ దూసుకు వెళ్లిన తీరు చూశారు. గురి తప్పకుండా మైక్ లోనుంచి బ్రిటీష్ సైనికుడి తలను కాల్చారు. హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా తీశారని చెప్పాలి. (Image credit: DVV Entertainment/Youtube)
ఎన్టీఆర్, రామ్ చరణ్ పాత్రల మధ్య స్నేహాన్ని చూపించే విధంగా ఓ షాట్ ఉంది. ఓ వైపు నీరు... మరోపక్క కొండలు... ఆ విజువల్ కనులవిందుగా ఉంది. (Image credit: DVV Entertainment/Youtube)
రాహుల్ రామకృష్ణ పరిగెడుతున్నారు. అయితే... అతడిని తరుముతున్నది ఎవరు? సినిమాలో కీలక సన్నివేశానికి సంబంధిచినది అయ్యి ఉంటుంది. (Image credit: DVV Entertainment/Youtube)
లాస్ట్. బట్ నాట్ లీస్ట్! బ్రిటీషర్లకు వ్యతిరేకంగా భారతీయుల తరఫున పులి పోరాడింది చూశారూ... అదీ రాజమౌళి మార్క్ షాట్. భావోద్వేగాలను తారాస్థాయికి తీసుకువెళ్లడం అంటే ఇదే. (Image credit: DVV Entertainment/Youtube)