మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం - సినిమాలో దమ్ముకొట్టే, మందు తాగే సన్నివేశాలుంటే... సినిమా ప్రారంభంలో కచ్చితంగా చెప్పాల్సిందే. అలాగే, ఆయా సన్నివేశాల్లో తెరపై ఆ అక్షరాలు పడాల్సిందే. నటీనటులను ప్రేక్షకులు ఫాలో అవుతారు కనుక... సినిమాలు చూసి ఎవరూ దమ్ము, మందు కొట్టకూడదని!


మద్యపానం, ధూమపానం వ్యక్తిగత విషయం అయినప్పటికీ... సినిమా తారలు ఆ విషయంలో బాధ్యతగా ఉండాలి. హీరో హీరోయిన్లు, నటీనటుల్లో చాలామంది మందు, సిగరెట్ వంటి వాణిజ్య ప్రకటనలకు దూరంగా ఉంటున్నారు. కొంతమంది మాత్రమే నటిస్తున్నారు. ఈ మధ్య కొత్త ట్రెండ్ మొదలైంది. సోషల్ మీడియాలో లిక్కర్ బ్రాండ్ ప్రమోషన్ షురూ అయ్యింది. లిక్కర్ బ్రాండ్ గురించి ఓ పోస్ట్ చేస్తే... ఫాలోయర్లను బట్టి పారితోషికం ముడుతుంది. రాధికా ఆప్టే ఓ లిక్కర్ బ్రాండ్ గురించి పోస్టులు చేశారు. ఈ జాబితాలో కొంతమంది ఉన్నారు. అందులో లేటెస్టుగా కాజల్ అగర్వాల్ కూడా ఎంటరయ్యారు.


భర్తతో కలిసి దిగిన ఓ ఫొటో పోస్ట్ చేసిన కాజల్ అగర్వాల్... ఓ లిక్కర్ బ్రాండ్ ప్రమోట్ చేస్తూ పోస్ట్ పెట్టారు. ఈ కంటెంట్ పాతికేళ్ల పైబడినవాళ్లకు మాత్రమేనని, మద్యం సేవించేటప్పుడు బాధ్యతగా ఉండాలని పేర్కొన్నారు. దాంతో కాజల్ మీద సోషల్ మీడియాలో జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డబ్బుల కోసం ఇటువంటి పోస్టులు ఏంటి? అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. భర్తతో కలిసి దిగిన ఫొటో పోస్ట్ చేయడంతో "అంటే ఇద్దరూ కలిసి వేస్తున్నారా మేడమ్" అని ఒకరు కామెంట్ చేశారు. "మీ దుంపతెగ... మీరు ఎక్కడ తగిలారు రా బాబు, తాగి తాగి సచ్చిపోండి" అని ఇంకో నెటిజన్ విమర్శించారు. ఆల్కహాల్ కమర్షియల్ ప్రమోషన్ మంచిది కాదని ఒకరు హితవు పలికారు. వీటిపై కాజల్ ఇప్పటివరకూ ఏమీ స్పందించలేదు. తర్వాత స్పందిస్తారేమో చూడాలి. 



Also Read: ఆర్ఆర్ఆర్... బ్రదర్ & బావా... 45 సెకన్లలో ఎలా?


Also Read: కారు యాక్సిడెంట్ లో మృతి చెందిన మాజీ మిస్ కేరళ, రన్నరప్..


Also Read: 'ఆర్ఆర్ఆర్' గ్లింప్స్‌లో ఇవి గ‌మ‌నించారా!?


Also Read: నరాలు తెగే ఉత్కంఠ.. చూపు తిప్పుకోలేని విజువల్ వండర్


Also Read: ఆ పద్దెనిమిది వందల మందిని నేను చదివిస్తా.. పునీత్ కి మాటిచ్చిన విశాల్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి