వాట్సాప్‌ యూజర్లకు శుభవార్త! తమ పేమెంట్స్‌ విధానం ఉపయోగించేందుకు కంపెనీ ఆకర్షణీయమైన ఆఫర్‌ ప్రకటించింది. వాట్సాప్‌ పేమెంట్స్‌ ద్వారా లావాదేవీలు చేస్తే రూ.51 క్యాష్‌బ్యాంక్‌ అందిస్తామని ప్రకటించింది. ఈ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ ఎంపిక చేసిన కస్టమర్లు, ఆండ్రాయిడ్‌ బీటా యూజర్లకు మాత్రమే వర్తించనుంది.

వెర్షన్‌ ఇదీఆండ్రాయిడ్‌ బీటా వెర్షన్‌ 2.21.20.3 వాడుతున్న యూజర్లకు ఈ ఆఫర్‌ ప్రమోట్‌ చేస్తే బ్యానర్‌ కనిపిస్తోంది. 'నగదు పంపండి.. రూ.51 క్యాష్‌బ్యాక్‌ పొందండి' అంటూ బ్యానర్‌ ఫ్లాష్‌ అవుతోంది. క్రమం తప్పకుండా వాట్సాప్‌ పేమెంట్స్‌ను ఉపయోగించే వారికి ఈ ఆఫర్‌ను విస్తరించనుంది.

ఎంత పంపించాలంటే?కనీస మొత్తం ఎంత పంపించాలో వాట్సాప్‌ చెప్పలేదు. అంటే ఒక్క రూపాయి పేమెంట్‌ చేసినా రూ.51 క్యాష్‌బ్యాక్‌ రావొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒక యూజర్‌ ఐదుసార్లు క్యాష్‌బ్యాక్‌ పొందొచ్చు. అంటే మొత్తంగా రూ.255 వరకు ఈ ఆఫర్‌ను ఉపయోగించుకొని సంపాదించొచ్చు.

షరుతులు ఏంటంటే?ఈ ఆఫర్‌ వినియోగించుకొనేందుకు వాట్సాప్‌ ఎక్కువ షరతులేమీ విధించలేదు. అయితే యూజర్‌ తమ ఖాతా నుంచి ఐదు వేర్వేరు బ్యాంక్‌ ఖాతాలకు డబ్బును పంపించాలి. నగదు పంపించగానే క్యాష్‌బ్యాక్‌ బ్యాంకులో జమ అవుతుంది. తన పోటీదారైన గూగుల్‌ పేను ఈ ఆఫర్‌తో ఢీకొట్టాలని వాట్సాప్‌ భావిస్తోంది. గూగుల్‌ సైతం ఆరంభంలో ఇలాగే క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లు ఇచ్చి యూజర్లను ఆకట్టుకుంది. రూ.1000 వరకు స్క్రాచ్‌ కార్డులను ఇచ్చింది. ఇప్పుడు క్యాష్‌బ్యాక్‌ బదులు డిస్కౌంట్లు, ఇతర కంపెనీల ఓచర్లను ఇస్తోంది.

Also Read: Azim Premji Update: అజీమ్‌ ప్రేమ్‌జీని మించి ప్రేమించేదెవరు! రోజుకు రూ.27 కోట్లు దానం చేసిన ఆధునిక కర్ణుడు!

Also Read: Saving Accounts Interest Rates: సేవింగ్స్‌ ఖాతాలపై 7 శాతం వడ్డీ కావాలా..! ఈ బ్యాంకుల్లో ఇస్తున్నారు

Also Read: Aadhar Card Updates: ఆధార్‌ మిస్‌యూజ్‌ అవుతోందని డౌటా? ఫోన్‌కు ఓటీపీ రావడం లేదా? ఇలా తెలుసుకోండి!

Also Read: Financial Tips: డబ్బు సంపాదించాలంటే ఈ 6 అలవాట్లు చేసుకోండి..! ఆ తర్వాత...!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి