'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం'...  జస్ట్ సినిమా మాత్రమే కాదు, అంతకు మించి! తొలిసారి నందమూరి, కొణిదెల కుటుంబాలకు చెందిన హీరోలు... యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్‌స్టార్‌ రామ్ చరణ్ కలిసి చేస్తున్న చిత్రమిది. 'బాహుబలి' తర్వాత దర్శక ధీరుడు తెరకెక్కిస్తున్న చిత్రమిది. అన్నిటికీ మించి... దేశానికి స్వాతంత్య్రం రావడానికి ముందు తెలంగాణ ప్రాంతానికి చెందిన యోధుడు కొమరం భీమ్, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు కలిస్తే ఎలా ఉంటుందనే ఊహాజనిత కథతో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రమిది. కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు... ప్రపంచవ్యాప్తంగా చాలామంది సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. దీపావళికి ముందుగా సినిమా గ్లింప్స్‌ విడుదల చేసి... ప్రేక్షకులకు ధమాకా అందించారు. 45 సెకన్ల నిడివి గల 'ఆర్ఆర్ఆర్' గ్లింప్స్‌ ఈ రోజు విడుదలైంది.

 

గ్లింప్స్‌లో సినిమా ఎంత గ్రాండియ‌ర్‌గా ఉంటుంద‌నేది రాజ‌మౌళి చూపించారు. ముఖ్యంగా బ్రిటీష‌ర్ల‌పై ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్‌, అజ‌య్ దేవ‌గ‌న్ స‌హా  భార‌తీయులు ఎలా పొరాడిందీ చూపించ‌డానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. టీజ‌ర్ అంతా రాజ‌మౌళి మార్క్ స్ప‌ష్టంగా క‌నిపించింది. టేకింగ్ టాప్ క్లాస్‌లో ఉంది. ఎన్టీఆర్‌,  రామ్ చ‌ర‌ణ్ క‌ళ్ల‌లో ఇంటెన్స్ క‌నిపించింది. ఆలియా భ‌ట్ ఎక్స్‌ప్రెష‌న్ ఏదో జ‌ర‌గ‌బోతుంద‌నే హింట్ ఇచ్చింది. కీర‌వాణి నేప‌థ్య సంగీతం స‌న్నివేశాల‌ను మ‌రింత ఎలివేట్ చేసింది. సినిమాపై అంచ‌నాలు పెంచింది. గ్లింప్స్ మొత్తం మీద హైలైట్ అంటే... చివ‌ర్లో పులి పంజా విస‌ర‌డ‌మ‌ని చెప్పాలి.

 

ఎన్టీఆర్ సరసన విదేశీ భామ ఒలీవియా మోరిస్, రామ్ చరణ్ జోడీగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటించిన ఈ చిత్రంలో అజయ్ దేవగన్, శ్రియా శరణ్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. హాలీవుడ్ యాక్టర్లు అలీసన్ డూండీ, రే స్టీవెన్ కీలక పాత్రల్లో నటించారు. తమిళ దర్శకుడు, నటుడు సముద్రఖని ఓ పాత్ర చేశారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ముందు జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే. డివివి దానయ్య నిర్మాణంలో రూపొందుతోన్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీత దర్శకుడు.

 



Also Read: హార్ట్ ఎటాక్ కాదు... నా దగ్గరకు వచ్చేసరికి పునీత్ పరిస్థితి ఇలా ఉంది... షాకింగ్ విషయాలు బయటపెట్టిన ఫ్యామిలీ డాక్టర్


Also Read: అర్ధరాత్రి హైద‌రాబాద్‌లో ఆ బ్రిడ్జ్ మీద వెంకీ, వరుణ్! ఏం చేస్తున్నారంటే?


Also Read: శాండిల్‌వుడ్‌కు పునీత్ పరిచయం చేసిన హీరోయిన్లు ఎవరో తెలుసా?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి