పెళ్లయిన హిందూ మహిళలు మంగళసూత్రానికి చాలా విలువనిస్తారు. ఫ్యాషన్ డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ ‘ఇంటిమేట్ ఫైన్ జ్యూయలరీ’ పేరుతో మంగళసూత్రాలను తయారుచేసి మార్కెట్లోకి దించారు. అంతవరకు బాగానే ఉన్నా... వాటి ప్రచారం కోసం తయారుచేసిన వాణిజ్య ప్రకటనలే చాలా వివాదాస్పదంగా మారాయి.  మంగళసూత్రాన్ని అవమానించేలా లోదుస్తులతో మాత్రమే ఉన్న అమ్మాయి, తన భర్త గుండెలపై వాలినట్టు ఓ ప్రచార చిత్రాన్ని విడుదలచేశారు. మరో దాంట్లో ఇద్దరు హోమోసెక్సువల్ అబ్బాయిలు నల్లపూసలను వేసుకుని కనిపించారు. వీటిని చూస్తుంటే అవి లోదుస్తుల ప్రకటనగా ఉంది కానీ పవిత్రమైన మంగళసూత్రం ప్రకటనగా లేదంటూ నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నెటిజన్ల నుంచి వస్తున్న వ్యతిరేకత ప్రభుత్వానికి కూడా తగిలింది. దీంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం కలుగజేసుకుంది. 


ఉపసంహరించాల్సిందే....
ఆ వాణిజ్య ప్రకటనను 24 గంటల్లోగా ఉపసంహరించుకోవాలని మధ్యప్రదేశ్ హోంశాఖ మంత్రి నరోత్తమ్ మిశ్రా అల్టిమేటం జారీచేశారు. వెంటనే ఆ ప్రకటనను ఉపసంహరించుకోకపోతే పోలీసు బలగాలను పంపించాల్సి వస్తుందని హెచ్చరించారు. దీంతో సబ్యసాచి ముఖర్జీ తలవంచక తప్పలేదు. ఆ సంస్థకు చెందిన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ‘ఈ ప్రచారాన్ని మేము ఒక వేడుకలా భావించాం, కానీ అది సమాజంలోని ఒక వర్గాన్ని కించపరిచేలా చేసినందుకు మేము చాలా చింతిస్తున్నాము. కాబట్టి మేము ఆ ప్రచార ప్రకటనను ఉపసంహరించుకుంటున్నాము’ అని తమ ఇన్ స్టా ఖాతాలో సంస్థ ప్రకటించింది. 


ఈ మధ్య యాడ్ ల విషయంలో నెటిజన్లు ప్రతిది పరిళీలిస్తున్నారు. మొన్నటిమొన్న అలియా భట్ పెళ్లి యాడ్ కూడా వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. 


[tw]





Also read: ఇది మంగళసూత్రం ప్రకటనా లేక లోదుస్తుల ప్రకటనా?


Also read: నిమ్మరసం చేర్చిన కాఫీ తాగితే కెలోరీలు కరిగిపోయే ఛాన్స్... ఇది నిజమేనా?


Also read: CPR అంటే ఏమిటి? గుండె పోటు వచ్చిన వ్యక్తికి ప్రాణం పోస్తుందా? CPR ఎలా చేయాలి?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి