జాతి, కుల, మత, వర్గ విభేదాలు లేకుండా సమైక్యంగా జరుపుకునే పండుగ దీపావళి.  ఈ రోజున ఊరూ వాడా బాణసంచా వెలుగులతో నిండిపోతుంది. అయితే టపాసులు కాల్చొద్దు, ప్రకృతిని కలుషితం చేయొద్దంటూ పెద్ద హడావుడే జరుగుతోంది. కానీ టపాసులు కాల్చడం వెనుకున్న ఆంతర్యం ఏంటంటే...
బాణసంచా కాల్చడం ఎప్పుడు మొదలైంది
చైనా వారు తుపాకి మందు కనిపెట్టడానికి ముందే భారత్ లో దానిని ఉపయోగించినట్లు ఆధారాలున్నాయి. చాణక్యుని అర్థశాస్త్రం, శుక్రాచార్యుడి 'శుక్రనీతి'లోను దీని గురించిన ప్రస్తావనలున్నాయి. "అరబ్బులు, పర్షియన్లు తుపాకి మందు ఎలా తయారు చేయాలో భారతీయుల నుంచి నేర్చుకున్నారని చెబుతారు. అంతకుముందు నాఫ్తా అనే ద్రవరూప రసాయనం పోసిన బాణాలు, ఆయుధ ప్రయోగంలో సూరేకారం వాడేవారట. అంటే తుపాకీ మందు , అది ఉపయోగించే ఆయుధాలు తయాలు చేయడానికి ఆద్యులు భారతీయులే. సైనిక వేడుకల్లోనే కాకుండా ఇతర  సమయాల్లోనూ భారతదేశంలో బాణసంచా కాల్చేవారనీ క్రీ.శ. 7వ శతాబ్దం నాటి చైనా సాహిత్యంలో ప్రస్తావించారట. 
Also Read: ఐదు రోజుల పండుగ దీపావళి... ''ధంతేరాస్'' నుంచి ''భగనీహస్తం భోజనం'' ప్రతిరోజూ ప్రత్యేకమే..
బాణసంచా తయారీలో ప్రధానమైనది తుపాకి మందు. ఇది సూరేకారం, గంధకం, బొగ్గుల మిశ్రమం. గంధకం, బొగ్గు మందుగుండు ఎక్కువసేపు కాలడానికి దోహదం చేస్తే, సూరేకారం మిరమిట్లు గొలిపే ఎర్రటి కాంతులు విరజిమ్ముతుంది. 
యుగ యుగాల పండుగ
రావణ వధ అనంతరం వనవాసాన్ని ముగించుకుని అయోధ్యలో సీతారాములు అడుగుపెట్టిన సందర్భాన్ని పురస్కరించుకుని దీపావళి జరుపుకున్నారని చెబుతారు. ద్వారప యుగంలో నరకాసుల వధ తర్వాత బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారంటారు. అయితే  ఇప్పుడు కొత్తగా బాణసంచా కాల్చడం వల్ల పర్యావరణ కాలుష్యం అనే వాదన వినిపిస్తోంది.
బాణసంచా ఎందుకు కాల్చాలి
భారతదేశం వ్యవసాయ ప్రధాన దేశం. చాలా ప్రాంతాల వారి ప్రధాన ఆహారం...శీతాకాలంలోనే వృద్ధి చెందుతుంది. దీపావళితో శీతాకాలం ప్రారంభమవుతుంది. ఈ సమయంలోనే పంటను నాశనం చేసే రకరకాల కీటకాలు వృద్ధి చెందుతాయి. వీటి కారణంగా పంట దిగుబడి తగ్గిపోతుంది. ఈ కీటకాల కారణంగా ప్రజలు అనారోగ్యం పాలవుతారు. ఈ సమస్యకు గంధకం వినియోగం మంచి పరిష్కారం. దీపావళి రోజు బాణసంచా కాల్చడం వల్ల గాలిలో గంధకం పొగ వ్యాపించి కీటకాలను నివారిస్తుంది. 
Also Read: యక్ష ప్రశ్నలంటే ఏంటి.. వాటికి సమాధానం ఎవరు ఎవరికి ఏ సందర్భంలో చెప్పారు..
వివిధ ప్రాంతాల్లో దీపావళి
పశ్చిమ బెంగాల్‌లో 'తుర్బీ’ పోటీలు
పశ్చిమ బెంగాల్‌లో మకర్దాలో ఉండే పుర్బన్నపర వర్గానికి చెందిన ప్రజలు ‘తుర్బీ’ పోటీలు నిర్వహిస్తారు. తుర్బీ అంటే చిచ్చుబుడ్డి. చుట్టుపక్కల 24 పరగణాలకు చెందిన ప్రజలు ఈ పోటీల్లో పాల్గొంటారు. ఎవరి ‘తుర్బీ’ ఎక్కువ కాంతులు వెదజల్లుతూ బాగా పైకి ఎగజిమ్ముతుందో వారు గెలిచినట్లు. దీపావళి సందర్భంగా పశ్చిమబెంగాల్, ఒడిషాలలో కాళీమాతని ఆరాధించి  బాణసంచా కాలుస్తారు. తుర్బీ తరతరాలుగా నిర్వహిస్తున్నారు. తుర్బీల తయారీకి గంధకం, సూరేకారం, బొగ్గుల మిశ్రమాన్ని ఉపయోగిస్తారు. ఇందులో ఇనుపరజను కూడా కలుపుతారు. బాగా కాల్చిన కుండల్లో ఈ మిశ్రమాన్ని దట్టింటి ఓ రంధ్రం పెట్టి దీన్ని వెలిగిస్తారు.
గుజరాత్‌ లో బాణసంచాతో యుద్ధం
‘సవర్’ ‘కుండ్ల’ అనే గ్రామాలు కలిసి  ‘సవర్కుండ్ల’గా మారాయి.  గుజరాత్‌ అమ్రేలీ జిల్లాలో ఉన్న ఈ గ్రామాల ప్రజలు దీపావళిరోజు  అక్కడ ప్రవహిస్తున్న నదీ తీరం వద్దరు చేరి ఒకరిపై ఒకరు మండుతున్న బాణసంచా విసురుకుంటారు. ఈ వేడుక ఇరు వర్గాల మధ్య ఒక యుద్ధంలా సాగుతుంది.  ప్రతి ఒక్కరూ వారి ఇళ్లలోనే  బాణసంచా తయారుచేసుకుంటారు. ‘ఇంగోరియా’ అడవులలో దొరికే ఒక పండు. దీని పెంకు గట్టిగా ఉంటుంది. దీనికి పైన చిన్న రంధ్రం పెట్టి, లోపలి భాగాన్ని తొలిచేసి ఎండబెట్టి మందు దట్టిస్తారు. చుట్టుపక్కల అడవుల్లో దొరికే వెదురుతో ‘కొక్డీ’ అని పిలిచే వాటిని తయారు చేస్తారు. 
'భజ్' పట్టణంలో హారతితో ప్రారంభం
దీపావళి హడావిడి ధనత్రయోదశితో మొదలవుతుంది. ఆ రోజు తెల్లవారుజామున గుజరాత్‌లోని భుజ్  లో హామీర్సర్ సరస్సు దగ్గరున్న హఠకేశ్వర్ మందిరంలో హారతి కార్యక్రమంతో దీపావళి వేడుకలు మొదలవుతాయి. సంత్ నరసీ మెహతా వారసులుగా చెప్పేవారు భారీగా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. హారతి కార్యక్రమం పూర్తైన వెంటనే ‘మహాదేవ్ నక’ ప్రాంతంలో బాణసంచా కాలుస్తారు. అప్పుడెప్పుడో ‘నాగరి’ వర్గం వారు మొదలుపెట్టగా ఇప్పుడు అన్ని వర్గాల వారూ ఈ వేడుకలు జరుపుకుంటున్నారు. 


అయితే అతి సర్వత్రా వర్జయేత్ అనే మాటని ఇక్కడ మరిచిపోరాదు. క్రాకర్స్ కాల్చొచ్చు అనే వాదనతో వాయుకాలుష్యం, శబ్ధకాలుష్యం పెరిగేలా చర్యలు ఉండకూడదు.
Also Read: పడమర-దక్షిణం వైపు తిరిగి భోజనం చేస్తే ఏం జరుగుతుంది... తినడానికి కూడా రూల్స్ ఉన్నాయా..!
Also Read: మడి వంట అంటే ఏంటి... ఇది పాటించకపోతే ఏమవుతుంది..!
Also Read:  కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు పూరించిన పాంచజన్యం ఎక్కడుందంటే...
Also Read: కాకులకు చావు ఉండదా. కాకికి-కర్మ కాండలకు సంబంధం ఏంటి ...!
Also Read:అగ్గిపుల్లతో నేరుగా దీపం వెలిగిస్తున్నారా… దీపం ఏ దిశగా ఉంటే ఎలాంటి ఫలితం ఉంటుందంటే..
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి