Spirituality: పడమర-దక్షిణం వైపు తిరిగి భోజనం చేస్తే ఏం జరుగుతుంది... తినడానికి కూడా రూల్స్ ఉన్నాయా..!

అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటాం. దైవ సమానంగా భావించి మొదటి ముద్ద కళ్లకు అద్దుకుని మరీ తింటాం. మరి ఈ సమయంలో కొన్ని నియమాలు పాటించాలంటారు పండితులు. అవేంటంటే…

Continues below advertisement

మనిషి మాటలు నేర్చి, వివేకవంతుడు, విజ్ఞానవంతుడు అయిన తర్వాత ఆహారం విలువ గుర్తించాడు.  ప్రాథమిక అవసరాలన్నింటిలోకి ఆహారమే ముఖ్యమైనది అని తెలిసిన తర్వాత సహజంగానే భక్తిభావం పెరిగింది ‘ఆహార ఉపాహారాల ఇష్టత లేనివానికి సుఖాపేక్ష ఉండదు. సుఖాపేక్ష లేనివానికి సంతుష్టత ఉండదు. ఆహారాన్ని సక్రమంగా తీసుకోని వానికి ఏ కోరికలు ఉండవు' అని చెబుతుంది భగవద్గీత. అందుకే పరబ్రహ్మ స్వరూపంగా భావించి అన్నం తినేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలని చెబుతారు.

Continues below advertisement

  • కాకులు ముట్టుకున్నదీ, కుక్కా, ఆవూ వాసన చూసిన భోజనం చేయకూడదు
  • పాలన్నం తిన్నాక పెరుగు అన్నం తినకూడదు
  • కాళ్ళు చాపుకుని, చెప్పులు వేసుకుని భోజనం చేయరాదు
  • భోజనం చేయడానికి ఎడమచేయి ఉపయోగించరాదు. నిల్వ ఉన్న, చల్లారిన ఆహారం తినకూడదు
  • 10-15 పదార్థాలతో భోజనం కన్నా కూర, పప్పు, పచ్చడి, మజ్జిగతో తీసుకునే ఆహారమే అమృతం
  • నిలువ పచ్చడిని వయసులో  ఉన్నవారు 2 రోజులకోసారి, మధ్య వయసులో  వారానికి 2 సార్లూ, నలభై దాటాక తర్వాత 15 రోజులకోసారి, యాభై దాటాక నెలకొకసారి తీసుకోవటం ఆరోగ్యకరం

Also Read: అగ్గిపుల్లతో నేరుగా దీపం వెలిగిస్తున్నారా… దీపం ఏ దిశగా ఉంటే ఎలాంటి ఫలితం ఉంటుందంటే..

  • గ్రహణం రోజున అంటే సూర్యగ్రహణానికి పన్నెండు గంటల ముందు, చంద్రగ్రహణానికి  తొమ్మిది గంటల ముందు ఎలాంటి ఆహారం తీసుకోకూడదు
  • దూడను కన్న తర్వాత పశువు నుంచి పదిరోజుల వరకూ పాలు తీసుకోకూడదు
  • భోజనం మధ్యలో లేవటమూ, మాట్లాడటమూ  తగదు
  • అన్నాన్ని వృధా చేయరాదు, ఎంగిలి అన్నాన్ని ఇతరులకు పెట్టరాదు
  • అతిగా తింటే ఆయుష్షు తగ్గుతుంది  

Also Read: ఏడు వారాల నగలు వేసుకోవడం వెనుక ఆంతర్యం ఏంటి... ఏ రోజు ఏ రాళ్లు ధరిస్తారు..!  

  • ఆచమన విధి తెలియనప్పుడు భగవంతుడ్ని స్మరించి భుజించాలి
  • రోజుకు రెండుసార్లు భోజనం చేయాలి. ఈ  రెండుసార్లు మధ్యలో ఏ ఆహారం తీసుకోపోతే  ఉపవాస ఫలితం లభిస్తుందంటారు.
  • భోజనం చేసేటప్పుడు తూర్పు వైపుకి తిరిగి చేస్తే ఆయుష్షు, ఉత్తరం వైపు తిరిగి భోజనం చేస్తే కోరికలు ఫలిస్తాయి.  పడమర, దక్షిణం వైపు తిరిగి భోజనం చేయకూడదని వామనపురాణం, విష్ణుపురాణంలో ఉంది
  • ఆకుల మీద, ఇనుప పీటల మీద కూర్చొని భోజనం చెయ్యరాదు
  • మఱ్రి, జిల్లేడూ, రావి, తుమ్మి, కానుగ ఆకుల్లో భోజనం చేస్తే సంపద వృద్ధి చెందుతుంది
  • మోదుగ, తామర ఆకుల్లో సన్యాసులు మాత్రమే భుజించాలి.

ఇవన్నీ పురాణాల్లో ప్రస్తావించినవి, పండితులు చెప్పిన నియమాలు మాత్రమే. ఇవి ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవడం అన్నది వారి వారి విశ్వాసాలు, అభిప్రాయాలపై ఆధారపడి ఉంటుంది.

Also Read: ఏ దేవుడికి ఏం నివేదించాలి… అసలు నైవేద్యం ఎందుకు సమర్పించాలంటే.!
Also Read: పూజకు పనికిరాని పూలు ఏవి...ఎందుకు?
Also Read: ఈ శివాలయం నిర్మాణం ముందు తాజ్ మహల్ కూడా తక్కువే అంటారు..
Also Read:  ఈ చోటి కర్మ ఈ చోటే...ఈనాటి కర్మ మరునాడే అంటాం....మరి కర్మల నుంచి తప్పించుకోవాలంటే గీతలో కృష్ణుడు ఏం చెప్పాడు
Also Read: ఉప్పు, ఎముకలు, పిండి,వెంట్రుకలు, బస్మంతో తయారు చేసిన ఈ శివలింగాల గురించి మీకు తెలుసా?
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి


Continues below advertisement