సాధారణంగా ఆలయానికి వెళ్లినా, ఇంట్లో పూజ చేసినా  కొబ్బరికాయ, అరటి పండ్లు కామన్ గా ఉంటాయి. కానీ ఒక్కో దేవుడికి ప్రీతిపాత్రమైన నైవేద్యం ఒక్కోటి  ఉంటుందంటారు పండితులు. అవేంటంటే...



  • వినాయకుడికి బెల్లం అంటే ప్రీతి. ఇంకా ఉండ్రాళ్లు, జిల్లేడుకాయలు నైవేద్యంగా సమర్పించాలి. గణపయ్యకి గరిక మాల అంటే చాలా ఇష్టం.

  • శ్రీ వేంకటేశ్వరస్వామికి  తులసిమాల మెడలో వేసి వడపప్పు, పానకం  నైవేద్యంగా సమర్పించాలి. 

  • సత్యనారాయణస్వామికి  ఎర్ర గోధుమనూక, జీడిపప్పు, కిస్ మిస్, నెయ్యి, పంచదార కలిపిన ప్రసాదం నైవేద్యం పెట్టాలి. కదంబ పూలమాల స్వామికి ప్రీతి. 

  • హనుమంతుడికి అప్పాలంటే ఏంతో ఇష్టం. అందుకే అప్పాలు నైవేద్యంగా సమర్పించి సింధూరం, తమలపాకులతో పూజ చేయాలి. 

  • లలితాదేవికి  క్షీరాన్నం, పండ్లు, పులిహోర, పానకం, వడపప్పు, చలిమిడి నైవేద్యం ప్రీతి. అన్ని రకాల పూలు కలపిన మాల అమ్మవారికి వేయాలి.

  • దుర్గాదేవికి  మినపగారెలు నైవేద్యం పెట్టి . నిమ్మకాయల మాల అమ్మవారికి వేస్తే చాలా మంచిది.

  • లక్ష్మీదేవికి క్షీరాన్నం, పండ్లు పెట్టి  తామరపూలతో పూజించాలి.

  • సంతోషిమాతకి  పులుపులేని పిండివంటలు, తీపిపదార్ధాలు నైవేద్యంగా సమర్పించాలి.

  • సాయిబాబాకి పాలు, గోధుమరొట్టెలు నైవేద్యం పెట్టాలి.

  • శ్రీకృష్ణుడికి ఏం ఇష్టమో అందరకీ తెలిసిన విషయమే. అటుకులతో చేసిన తీపిపదార్ధాలు, వెన్న సమర్పించి  తులసీ దళాలతో పూజిస్తే మంచిది.

  • శివుడికి కొబ్బరికాయ, అరటిపండ్లు నైవేద్యం పెట్టాలి. మారేడు దళాలు, నాగమల్లి పువ్వులతో అర్చన చేయాలి.

  • సూర్యుడికి మొక్కపెసలు, క్షీరాన్నం నైవేద్యంగా సమర్పించి జిల్లేడు పూలతో పూజ చేయాలి.


Also Read:  తెల్లవారుజాము వచ్చే కలలు నిజమవుతాయా? దీనిపై పురాణాలు.. సైన్స్ ఏం చెబుతున్నాయి?


నైవేద్యం ఎందుకు పెట్టాలి: భగవంతుడికి సమర్పించే నైవేద్యాలను భగవంతుడు తినడు. కానీ పూజించేవారికి భగవంతుడిపై ఉన్న కృతజ్ఞతాభావాన్ని సూచిస్తుంది నైవేద్యం. లోకంలో మనిషి బతకడానికి భుజించే ఆహారపదార్థాలన్నీ ప్రకృతి ప్రసాదించినవే. ప్రకృతిని సృష్టించి చల్లగా కాపాడుతున్నందుకు ఆ దేవుడికి ఈ జీవుడు కృతజ్ఞతాపూర్వకంగా అర్పించేదే నైవేద్యం.  మనిషి జీవితం త్యాగ భావనలతోనే పరిపూర్ణమవుతుందనే సత్యాన్ని నివేదన చెబుతుంది. తాను అనుభవించడంకన్నా ఇతరులకు పంచడంలోనే ఆనందం ఉందని చాటిచెబుతుంది.
Also Read: ఈ శివాలయం నిర్మాణం ముందు తాజ్ మహల్ కూడా తక్కువే అంటారు..
భక్తి ప్రధానం: ఏ విధమైన పూజలో అయినా నైవేద్యానికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. పూట గడవని నిరుపేద నుంచి కోట్లకు పడగెత్తిన వారి వరకూ ఎవరి శక్తికి తగ్గా నైవేద్యం వారు సమర్పించుకుంటారు. భగవంతుడికి మాత్రం అందరూ సమానులే. భక్తితో ఏమిచ్చినా తీసుకుంటాడనేందుకు భక్త శబరి, భక్త కన్నప్పలే నిదర్శనం. వాస్తవానికి భగవంతుడి దృష్టి ప్రసరించిన ప్రతి పదార్థం అమృతమయమై, శరీరంలో తేజస్సును- ఆరోగ్యాన్ని వృద్ధి చేస్తుందని ప్రాచీనగ్రంథాలు చెబుతున్నాయి. భగవంతుడి ప్రసాదాన్ని స్వీకరిస్తే ఆయుష్షు పెరుగుతుందంటారు పండితులు. 


Also Read: దసరా తర్వాత సరిగ్గా 21 రోజులకు దీపావళి ఎందుకు వస్తుంది .. బండ్ల గణేష్ ట్వీట్ లో ఏముంది..వాస్తవం ఏంటి..!
Also Read: నిద్రలేవగానే ఎవర్ని చూడాలంటే…!
Also Read: కాశీకి ఎందుకెళతారు….అక్కడ ఏం వదిలేయాలి?
Also Read: నదిలో నాణేలు ఎందుకు వేస్తారో తెలుసా?
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి