ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు పదకొండు రోజుల వరకూ , ఆ తర్వాత  మూడో రోజు నుండి పదిరోజులలోపు కాకులకు పిండాలు పెడతారు. ఏడాది గడిచేవరకూ నెలకోసారి మాసికం, ఆ తర్వాత ఏడాదికోసారి తద్దినం పెడతారు. ఇవేమీ తెలియని వారు పుష్కరాల్లో పిండ ప్రదానం చేస్తారు. ఆ పిండాలను కాకులకు మాత్రమే ఎందుకు పెడతారన్నదే ఇప్పుడు చర్చ. సాధారణంగా కాకులు వాలితే దోషమని, కాకి  తంతే అరిష్టం అని భయపడతారు. మరికొందరైతే కాకి ఇంటిముందు అరిస్తే చుట్టాలొస్తారని నమ్ముతారు. ఇవన్నీ మూఢ నమ్మకాలా, నిజాలా అన్నది పక్కనపెడితే చాలామంది విశ్వసిస్తారన్నది మాత్రం నిజం. చనిపోయిన వారి ఆత్మలు కాకి రూపంలో వస్తాయని నమ్మకం. అందుకే వారిని తలుచుకుని కాకికి పిండం పెడతారని అంటారు. కాకులు పూర్తిగా తింటే మన పెద్దలు సంతృప్తిగా ఉన్నారని.. ఒకవేళ కాకులు ముట్టుకోకుంటే వారి కోరికలు ఏవో మనం నెరవేర్చలేదని, అందుకే అసంతృప్తితో ఉన్నారని భావిస్తారు. 
Also Read: మడి వంట అంటే ఏంటి... ఇది పాటించకపోతే ఏమవుతుంది..!



పురాణాల ప్రకారం 
రావణుడికి భయపడిన దేవతలంతా ఒక్కొక్కరు ఒక్కో  జంతువులోకి ప్రవేశించారట. తొండలోకి కుబేరుడు,  లేడి లోకి ఇంద్రుడు, నెమలిలోకి వరుణుడు, యుముడు కాకిలోకి ప్రవేశిస్తారు. రావణుడు వెళ్లిపోయాక ఆ జంతువుల శరీరంలోంచి బయటు వచ్చి వాటికి వరమిస్తారు. లేడికి వళ్లంతా కళ్లున్నట్టు అందంగా ఉండే వరం ఇస్తాడు ఇంద్రుడు. వర్షం పడే సమయంలో ఆనందంతో పురివిప్పి అందంగా ఆడేలా ఫించం ఇచ్చాడు వరుణుడు. కాకికి బలవర్మణం తప్ప స్వతహాగా మరణం ఉండదంటాడు యముడు. ఇక యమలోకంలో నరకం అనుభవించే వారిలో కాకులు ఎవరి పిండం అయితే తింటాయో వారికి ఈ నరక బాధల నుంచి విముక్తి కలుగుతుందని చెప్పాడట. అప్పటి నుంచీ పిండాలను కాకులకు పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. రామాయణం ప్రకారం రాముడు ఒక భక్తుడికి నీ పూర్వికులు కాకి రూపంలో విహరిస్తుంటారు, కాకులకి ఆహారం పెడితే నీ పూర్వికులకి చేరుతుందని ఒక వరం ఇస్తాడు, రాముడి వరం ప్రకారమే నేటికీ కాకులకి ఆహారాన్ని పెడతారనే నానుడి కూడా ఉంది.



దీని వెనుకున్న పరమార్థం
పితృకర్మలు, కర్మకాండల సమయంలోనే కాకుండా మిగిలిన సమయంలో కూడా పక్షులకు ఆహారం అందించాలంటారు పెద్దలు. అప్పట్లో కాకులు ఎక్కువగా ఉండడమే కాదు, పెరట్లోనూ కాకులే ఎక్కువగా ఉండేవి. అందుకే పిండాలు కాకులకు పెట్టేవారు.
Also Read:  ఐదు రోజుల పండుగ దీపావళి... ''ధంతేరాస్'' నుంచి ''భగనీహస్తం భోజనం'' ప్రతిరోజూ ప్రత్యేకమే..
నీటిలో వదిలే పిండం:
నీటిలో ఉండే జలచరాలకి ఆహారాన్ని పెట్టడం అనేది అందులో ఉన్న పరమార్థం, చాలామంది చనిపోయిన వారి ఆస్థికలని నది దగ్గరికి తీసుకెళ్లి పిండప్రదానం చేసి నదిలో వదిలేస్తారు, ఆస్థికలతో పాటు ఆహారాన్ని కూడా నదిలో వేస్తారు. కొందరు గోవులకు కూడా పెడుతుంటారు. మొత్తంగా హిందూ ధర్మంలో ప్రతి ఆచారం వెనుక సైన్స్ తో పాటు మనుషుల జీవనానికి ఉపయోగపడే ప్రయోజనాలు ఉన్నాయంటారు పెద్దలు.
Also Read: కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు పూరించిన పాంచజన్యం ఎక్కడుందంటే...
Also Read: పడమర-దక్షిణం వైపు తిరిగి భోజనం చేస్తే ఏం జరుగుతుంది... తినడానికి కూడా రూల్స్ ఉన్నాయా..!
Also Read: అగ్గిపుల్లతో నేరుగా దీపం వెలిగిస్తున్నారా… దీపం ఏ దిశగా ఉంటే ఎలాంటి ఫలితం ఉంటుందంటే..
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి