అజ్ఞాతవాసంలో భాగంగా పాండవులు ద్వైతవనానికి చేరుకున్నప్పుడు.... ఓ పండితుడు ధర్మరాజు వద్దకు వెళ్లి సహాయం అడుగుతాడు . తనవద్దనున్న 'అరణి' (నిప్పు పుట్టించడానికి ఉపయోగపడే కొయ్య)ని ఒక మృగం అపహరించిందని దాన్ని సంపాదించిపెట్టమని ప్రార్థిస్తాడు. ఆ పనిపై వెళ్లిన తన సోదరులు ఎంతసేపైనా తిరిగి రాకపోవడంతో ధర్మరాజు వాళ్లను వెతుక్కుంటూ వెళతాడు. ఓ సరస్సు దగ్గర విగతజీవులైన సోదరులను చూసి నోరు పిడచ గట్టుకుపోతుంది. నీళ్లు తాగుదామని సరస్సులో దిగుతుండగా  ఓ యక్షుడి హెచ్చరిక వినిపిస్తుంది. తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని యక్షుడు కోరడంతో సరే అంటాడు ధర్మరాజు. ఇంతకీ యక్షుడు ఎవరంటే యమధర్మరాజు. పాండవులను  పరీక్షించటానికి యముడే ఆ రూపంలో వచ్చి ప్రశ్నలు అడిగాడన్నమాట.

యక్షుడు ధర్మరాజుని అడిగి ప్రశ్నలివే

 

1 సూర్యుణ్ణి ఉదయించేలా చేసినదెవరు    బ్రహ్మం
2 సూర్యుని చుట్టూ తిరిగేదెవరు?  దేవతలు
3 సూర్యుని అస్తమింపచేసేది ఏది? ధర్మం
4 సూర్యుడు దేని ఆధారంగా నిలచియున్నాడు? సత్యం
5 మానవుడు దేనివలన శ్రోత్రియుడగును? వేదం
6 దేనివలన మహత్తును పొందుతాడు?  తపస్సు
7 మానవునికి సహాయపడేది ఏది?   ధైర్యం 
8 మానవుడు దేనివలన బుద్ధిమంతులవుతారు?   పెద్దలను సేవించడం
9 మానవుడు మానవత్వాన్ని ఎలా పొందుతారు?  అధ్యయనం 
10  మానవునికి సాధుత్వం ఎలా వస్తుంది?   తపస్సు వలన  
11 మానవుడు మనిషి ఎలా అవుతాడు?   మృత్యు భయము వలన
12 బతికి ఉండే చిచ్చినవాడితో సమానం ఎవరు   దేవతలకూ, అతిథులకు, పితృదేవతలకు పెట్టకుండా తినేవాడు
13 భూమికంటె భారమైనది ఏది?   తల్లి
14 ఆకాశంకంటే పొడవైనది ఎవరు?   తండ్రి
15 గాలికంటె వేగమైనది ఏది?   మనస్సు
16 మానవుడికి సజ్జనత్వం ఎలావస్తుంది?   ఇతరులు తనపట్ల ఏపని చేస్తే, ఏ మాట మాట్లాడితే తన మనస్సుకు బాధ కలుగుతుందో తాను ఇతరుల పట్ల అలా ప్రర్తించకుండా ఉండాలి
17 తృణం కంటే దట్టమైనది ఏది?   చింత
18 నిద్రలో కూడా కన్ను మూయనిది ఏది?   చేప
19 రాజ్యమేలేవాడు దైవత్వం ఎలా పొందుతాడు?   అస్త్ర విద్యతో
20 రాజ్యాధినేతకు సజ్జనత్వం ఎలా కలుగుతుంది?   యజ్ఞం చేయుటం వలన
21 జన్మించియున్నా ప్రాణంలేనిది?   గుడ్డు
22 రూపం ఉన్నా హృదయం లేనిదేది?   రాయి
23 మానవుడికి దుర్జనత్వం ఎలా వస్తుంది?   అడిగిన వాడికి సాయం చేయకపోవడం  
24 ఎల్లప్పుడూ వేగం గలదేది?   నది
25 రైతుకి ముఖ్యమైనది ఏది?   వాన
26 బాటసారికి, రోగికి, గృహస్థునకూ, చనిపోయిన వారికి బంధువులెవరు?  సార్ధం, వైద్యుడు, శీలవతి అనుకూలవతి అయిన భార్య, సుకర్మ వరుసగా బంధువులు
27 ధర్మానికి ఆధారమేది?   దయ దాక్షిణ్యం
28 కీర్తికి ఆశ్రయమేది?   దానం
29 దేవలోకానికి దారి ఏది?   సత్యం
30 సుఖానికి ఆధారం ఏది?   శీలం
31 మనిషికి దైవిక బంధువులెవరు?   భార్య/భర్త
32 మనిషికి ఆత్మ ఎవరు?   కుమారుడు
33 మానవుడికి జీవనాధారమేది?   మేఘం
34 మనిషికి దేనివల్ల సంతోషం లభిస్తుంది?   దానం
35 లాభాల్లో గొప్పది ఏది?   ఆరోగ్యం
36 సుఖాల్లో గొప్పది ఏది?   సంతోషం
37 ధర్మాల్లో ఉత్తమమైనది ఏది?   అహింస
38 దేనిని నిగ్రహిస్తే సంతోషం కలుగుతుంది?   మనస్సు
39  ఎవరితో సంధి శిథిలమవదు?   సజ్జనులతో
40 ఎల్లప్పుడూ తృప్తిగా పడిఉండేది ఏది?   యాగకర్మ
41 లోకానికి దిక్కు ఎవరు?  సత్పురుషులు
42 అన్నోదకాలు వేటి నుంచి ఉద్భవిస్తాయి?   భూమి, ఆకాశం నుంచి 
43 లోకాన్ని కప్పివున్నది ఏది?   అజ్ఞానం
44  శ్రాద్ధవిధికి సమయమేది?   బ్రాహ్మణుడు వచ్చినప్పుడు
45  మనిషి దేనిని విడిస్తే బాధ లేకుండా సుఖంగా ఉంటాడు  గర్వం, క్రోధం, లోభం, తృష్ణ 
46  తపస్సు అంటే?   తన వృత్తి, కుల ధర్మం ఆచరించడం
47  క్షమ అంటే ? ద్వంద్వాలు సహించడం
48  సిగ్గు అంటే ?   చేయరాని పనులంటే జడవడం
49  సర్వధనియనదగు వాడెవ్వడు?   ప్రియాప్రియాలను సుఖ దు:ఖాలను సమంగా చూసేవాడు
50  జ్ఞానం అంటే ?   మంచి చెడ్డల్ని గుర్తించగలగడం
51  దయ అంటే?   ప్రాణులన్నింటి సుఖం కోరడం
52  అర్జవం అంటే?   సదా సమభావం కలిగి ఉండడం
53  సోమరితనం అంటే?   ధర్మకార్యాలు చేయకుండా ఉండటం
54  దు:ఖం అంటే?   అజ్ఞానం కలిగి ఉండటం
55  ధైర్యం అంటే ? ఇంద్రియ నిగ్రహం
56  స్నానం అంటే ? మనస్సులో మాలిన్యం లేకుండా చేసుకోవడం
57  దానం అంటే ? సమస్తప్రాణుల్ని రక్షించడం
58  పండితుడెవరు?     ధర్మం తెలిసినవాడు
59  మూర్ఖుడెవడు?   ధర్మం తెలియక అడ్డంగా వాదించేవాడు
60  ఏది కాయం?   సంసారానికి కారణమైంది
61  అహంకారం అంటే?   అజ్ఞానం
62  డంభం అంటే ? తన గొప్పతానే చెప్పుకోవటం
63 ధర్మం, అర్ధం, కామం ఎక్కడ కలుగుతాయి?   తన భార్యలో, తన భర్తలో
64  నరకం అనుభవించే వారెవరు?   ఆశపెట్టి దానం ఇవ్వనివాడు, వేదాల్నీ, ధర్మ శాస్త్రాల్నీ, దేవతల్నీ, పితృదేవతల్నీ, ద్వేషించేవాడు, దానం చెయ్యనివాడు
65 బ్రాహ్మణత్వం ఇచ్చేది ఏది?   ప్రవర్తన మాత్రమే
66 మంచిగా మాట్లాడేవాడికి ఏం దొరుకుతుంది?   మైత్రి
67 ఆలోచించి పనిచేసేవాడు ఏమవుతాడు?   అందరి ప్రశంసలుపొంది గొప్పవాడవుతాడు
68 ఎక్కువమంది మిత్రులు ఉన్నవాడు ఏమవుతాడు?  సుఖపడతాడు
69 ఎవడు సంతోషంగా ఉంటాడు?   అప్పులేనివాడు, తనకున్న దానిలో తిని తృప్తి చెందేవాడు
70 ఏది ఆశ్చర్యం?    ప్రాణులు ప్రతిరోజూ మరణిస్తూ ఉండడం చూస్తూ మనిషి తానే శాశ్వతంగా ఈ భూమి మీద ఉండి పోతాననుకోవడం
71 లోకంలో అందరికన్న ధనవంతుడెవరు?   ప్రియం అప్రియం, సుఖం దు:ఖాన్ని సమంగా చూసేవాడు
72 స్థితప్రజ్ఞుడు అని ఎవరిని ఆంటారు?   లభించిన దానితో సంతృప్తుడై , అరిషడ్వర్గాలను జయించి స్ధిరమైన బుద్ధి కలవాడు.


Also Read: పడమర-దక్షిణం వైపు తిరిగి భోజనం చేస్తే ఏం జరుగుతుంది... తినడానికి కూడా రూల్స్ ఉన్నాయా..!
Also Read:  కాకులకు చావు ఉండదా. కాకికి-కర్మ కాండలకు సంబంధం ఏంటి ...!
ధర్మరాజు చెప్పిన సమాధానాలకు సంతృప్తి చెందిన యక్షుడు ( యముడు) ‘రాజా, నీ సమాధానాలతో ఎంతో తృప్తి పొందాను. నీ తమ్ముళ్లలో ఒకరిని కోరుకో’ అన్నాడు. నకులుణ్ని బతికించమని కోరుకున్న ధర్మరాజును- ధనుర్విద్యా పారంగతుడు అర్జునుణ్ని గాని, అమేయ బల సంపన్నుడైన భీముణ్ని గాని ఎందుకు ఎంచుకోలేదని ప్రశ్నించాడు. తన తల్లి కుంతికి తానున్నాను కనుక పినతల్లి కుమారుణ్ని జీవింపజేయమని అడిగానన్నాడు. యుధిష్ఠిరుడి ధర్మనిష్ఠకు పరమానందాన్ని పొందిన యక్షరూపంలో ఉన్న యముడు అందరికీ ప్రాణదానం చేశాడు. ధర్మాచరణ నిష్ఠను లోకానికి తెలియజేయడం కోసమే యముడు..ధర్మరాజుని ఈ ప్రశ్నలు అడిగాడు. 
Also Read: పూజకు పనికిరాని పూలు ఏవి...ఎందుకు?
Also Read: ఏ దేవుడికి ఏం నివేదించాలి… అసలు నైవేద్యం ఎందుకు సమర్పించాలంటే.!
Also Read: అగ్గిపుల్లతో నేరుగా దీపం వెలిగిస్తున్నారా… దీపం ఏ దిశగా ఉంటే ఎలాంటి ఫలితం ఉంటుందంటే..
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి