దేశవ్యాప్తంగా 29 శాసనసభ, 3 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అసోంలో 5 స్థానాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా భాజపా ఆధిక్యంలో దూసుకుపోతోంది.
మరోవైపు బంగాల్‌లో ఉపఎన్నికలు జరిగిన 4 స్థానాల్లోనూ అధికార తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.
మధ్యప్రదేశ్‌లో పృథ్వీపూర్, రాయ్‌గావ్, జోబాట్ స్థానాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుండగా రెండు స్థానాల్లో భాజపా అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఓ స్థానంలో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. మరోవైపు హిమాచల్ ప్రదేశ్‌లో 2 స్థానాల్లో కాంగ్రెస్, ఓ స్థానంలో భాజపా ముందంజలో ఉన్నాయి.
మిగిలిన రాష్ట్రాల్లో..
హిమాచల్ ప్రదేశ్, మేఘాలయ రాష్ట్రాల్లోని 3, బిహార్, కర్ణాటక, రాజస్థాన్‌లోని రెండు స్థానాలకు, హరియాణా, మహారాష్ట్ర, మిజోరాంలోని ఒక్కో స్థానానికి జరిగిన ఉపఎన్నికల ఓట్లను లెక్కిస్తున్నారు. దాద్రా నగర్ హవేలీ, హిమాచల్ ప్రదేశ్‌లోని మండి, మధ్యప్రదేశ్ లోని ఖాంద్వా పార్లమెంటు స్థానాలకు ఓట్ల లెక్కింపు జరుగుతోంది. అక్టోబర్ 30న ఈ ఉపఎన్నికలు జరిగాయి.
Also read: తీపి అధికంగా తింటున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే
Also read: ఈ పాపులర్ బ్రేక్‌ఫాస్ట్ మీ గుండెకు హాని చేయచ్చు... జాగ్రత్త
Also read: వారానికి రెండు సార్లు తింటే చాలు... మతిమరుపు మీ మెదడును చేరదు
Also read: నిమ్మరసం చేర్చిన కాఫీ తాగితే కెలోరీలు కరిగిపోయే ఛాన్స్... ఇది నిజమేనా?