దేశవ్యాప్తంగా 29 శాసనసభ నియోజకవర్గాలు, 3 లోక్‌సభ స్థానాల ఉపఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. అయితే దాదాపు ఉఎన్నికలు జరిగిన అన్ని రాష్ట్రాల్లోను భారతీయ జనతాపార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకుంది. మరోవైపు బంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ క్లీన్‌స్వీప్ దిశగా దూసుకెళ్తుంది.
కాంగ్రెస్ జెండా..
వరుస ఓటములతో డీలా పడ్డా కాంగ్రెస్ శ్రేణుల్లో ఈ ఉపఎన్నికలు ఉత్సాహం నింపాయి. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్‌లో జరిగిన 3 అసెంబ్లీ, ఒక లోక్‌సభ స్థానం ఉపఎన్నికల్లో కాంగ్రెస్ జెండా రెపరెపలాడింది. మండీ లోక్‌సభ స్థానాన్ని భాజపా కోల్పోయింది. ముఖ్యంగా రాష్ట్ర సీఎం జైరాం ఠాకూర్ సొంత జిల్లా మండీలో భాజపాకు ఇది గట్టి ఎదురుదెబ్బగా మారింది.
మూడు అసెంబ్లీ స్థానాలైన ఆర్కీ, ఫతేపుర్, జుట్టబ్ కొట్కాయ్ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు.
దీదీ హవా..
బంగాల్‌లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల జోరును అధికార తృణమూల్ కాంగ్రెస్ కొనసాగించింది. ఉపఎన్నికలు జరిగిన నాలు స్థానాల్లోను టీఎంసీ అభ్యర్థులు ఆధిక్యం కనబరిచారు. ముఖ్యంగా భాజపాకు పట్టున్న దిన్‌హటాలో దాదాపు లక్షన్నర మెజార్టీతో టీఎంసీ గెలుపొందింది. ఈ ఫలితాలపై సీఎం మమతా బెనర్జీ ఆనందం వ్యక్తం చేశారు. ఇది విద్వేష రాజకీయాలపై బంగాల్ సాధించిన విజయంగా మమతా బెనర్జీ అభివర్ణించారు.
మిగిలిన చోట్ల..
మిగిలిన రాష్ట్రాల్లోనూ భాజపాకు ఎదురుగాలి వీచింది. రెండు నియోజకవర్గాల్లో ఒకచోట భాజపా గెలవగా మరో చోట కాంగ్రెస్ విజయం సాధించింది. అయితే అసోంలో మాత్రం కాషాయ జెండా రెపరెపలాడింది. ఈ రాష్ట్రంలో వెలువడుతోన్న ఉపఎన్నికల ఫలితాల్లో ఓ చోట భాజపా విజయం సాధించగా మరో నాలుగు స్థానాల్లో ఎన్‌డీఏ కూటమి ఆధిక్యంలో ఉంది.
మధ్యప్రదేశ్‌లో కూడా భాజపా పట్టు నిలబెట్టుకుంది. ఖంద్వా లోక్‌సభ నియోజకవర్గంతో పాటు రెండు అసెంబ్లీ స్థానాల్లో భాజపా ఆధిక్యంలో ఉంది. మరో చోట కాంగ్రెస్ ముందంజలో ఉంది.
Also Read: Ajit Pawar Income Tax: డిప్యూటీ సీఎంకు ఐటీ శాఖ షాక్.. రూ.1000 కోట్ల విలువైన ఆస్తులు జప్తు!
Also Read: Corona Cases: దేశంలో భారీగా తగ్గిన కరోనా ఉద్ధృతి.. కొత్తగా 10 వేల కేసులు
Also Read: VS Achuthanandan Hospitalized: ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రికి అస్వస్థత.. ఐసీయూలో చికిత్స
Also Read: By Election Results 2021:అసోం, మధ్యప్రదేశ్‌లో భాజపా ముందంజ.. బంగాల్‌లో టీఎంసీ హవా
Also read: తీపి అధికంగా తింటున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే
Also read: ఈ పాపులర్ బ్రేక్‌ఫాస్ట్ మీ గుండెకు హాని చేయచ్చు... జాగ్రత్త
Also read: వారానికి రెండు సార్లు తింటే చాలు... మతిమరుపు మీ మెదడును చేరదు
Also read: నిమ్మరసం చేర్చిన కాఫీ తాగితే కెలోరీలు కరిగిపోయే ఛాన్స్... ఇది నిజమేనా?
Also Read: ఆ రాష్ట్రాల్లో దీపావళి అంటే బాణసంచాతో మినీ యుద్ధమే.. ఇంతకీ క్రాకర్స్ ఎందుకు కాల్చాలో తెలుసా..!
Also Read:యక్ష ప్రశ్నలంటే ఏంటి.. వాటికి సమాధానం ఎవరు ఎవరికి ఏ సందర్భంలో చెప్పారు..
Also Read: మడి వంట అంటే ఏంటి... ఇది పాటించకపోతే ఏమవుతుంది..!
Also Read: కాకులకు చావు ఉండదా. కాకికి-కర్మ కాండలకు సంబంధం ఏంటి ...!