అన్వేషించండి

Force Gurkha 5 Door Review: ‘ఫోర్స్ గుర్ఖా’ లుక్ అదుర్స్! 5-డోర్ వెర్షన్‌లో ఇది చాలా స్పెషల్

Force Gurkha SUV Car: ఆటోమొబైల్ పరిశ్రమలో మిగతా ఎస్‌యూవీలతో పోలిస్తే ఫోర్స్ గుర్ఖా 2024 మాత్రం చాలా ప్రత్యేకంగా నిలిచింది. కొన్ని ఫీచర్స్ దీన్ని ఇతర ఎస్‌యూవీల కంటే పెద్దగా కనిపించేలా చేస్తున్నాయి.

Force Motors Gurkha 5 Door Review: భారత్‌కు చెందిన ప్రముఖ కమర్షియల్ వాహనాల తయారీదారు ఫోర్స్ మోటర్స్ (బజాజ్ టెంపో మోటర్స్) గుర్ఖా పేరుతో ఓ ఎస్‌యూవీని లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే. ఆటో పరిశ్రమలో ఉన్న అన్ని ఎస్‌యూవీలతో పోలిస్తే గుర్ఖా మాత్రం చాలా ప్రత్యేక కనబర్చింది. దీని లాకింగ్ డిఫరెన్షియల్స్, గ్రౌండ్ క్లియరెన్స్‌తో బీస్ట్ తరహాలో ఉండి.. ఇది ఇతర ఎస్‌యూవీల కంటే మరింత ఎత్తుగా కనిపిస్తోంది. 

దీని 700 ఎంఎం వాటర్ వాడింగ్ కెపాసిటీతో చాలా సునాయసంగా వర్షాలు భారీగా ఉన్నప్పుడు కూడా వెళ్లవచ్చు. పైగా ఇది చూసేందుకు చాలా బాగుండడమే కాకుండా.. 5-డోర్స్‌తో ఈ గుర్ఖా మరింత భారీగా కనిపిస్తుంది. ఈ కొత్త గూర్ఖా గత మోడల్స్‌తో పోల్చితే బాగా మెరుగుపర్చినట్లుగా కంపెనీ చెబుతోంది. పైగా ఇప్పుడు 5-డోర్ వెర్షన్ లో మరింత స్పేస్ ఉంది. బేసిక్స్ పరంగా ఇది ఇప్పుడు మరింత మెరుగైన కారు అని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. 


Force Gurkha 5 Door Review: ‘ఫోర్స్ గుర్ఖా’ లుక్ అదుర్స్! 5-డోర్ వెర్షన్‌లో ఇది చాలా స్పెషల్

ధర ఎంతంటే..
దీని ధర రూ.18 లక్షల రేంజ్ లో ఉంది. ఈ రేంజ్ అంటే గూర్ఖా 5-డోర్ కారు అంత చౌక ఏం కాదు. కానీ, దీని షీర్ లుక్స్ బీస్ట్ లాంటి వాహనం, పైగా ఫీచర్ల కోసం ఆ ధర సబబుగాన ఉందని అంటున్నారు. ఈ రేంజ్‌లో దీని రైవల్ మోడల్స్ కంటే మరింత ప్రత్యేకంగా కనిపిస్తోంది. గూర్ఖాక 18 - ఇంచ్‌ల వీల్స్, జాక్ అప్ 233mm గ్రౌండ్ క్లియరెన్స్‌తో పాటు స్నార్కెల్‌ దీన్ని బీస్ట్‌గా మార్చాయి. ఇది మన రోడ్లపై అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఫోర్స్ మోటార్స్ 140 బీహెచ్‌పీ, 320 Nm టార్క్ తో ఇంజిన్ ను మరింత మెరుగుపర్చి, గత మోడల్స్‌లో ఎదుర్కొన్న సమస్యలను కూడా పరిష్కరించింది. పైగా దీని క్లచ్‌ కూడా ట్రాఫిక్ జామ్ సందర్భాల్లో చాలా సులభంగా ఉన్నట్లుగా చెబుతున్నారు.

5-స్పీడ్ మాన్యువల్ వేరియంట్ లో క్లచ్ చాలా లైట్ గా ఉంటుంది. ఇక ఇంజిన్ సౌండ్ కాస్త ఎక్కువే. గేర్లు లాంగ్ త్రో కలిగి ఉంటాయి. స్టీరింగ్ వీల్ కూడా కమర్షియల్ వెహికిల్స్ తరహాలో చాలా పెద్దగా ఇచ్చారు. టార్క్ మాత్రం పుష్కలంగా ఉంది. మెరుపర్చిన మార్పుల కారణంగా ఈ కొత్త ఫోర్స్ గూర్ఖా ఇప్పుడు గతంలో కంటే బాగా ప్రయాణిస్తుందని కంపెనీ చెబుతుంది. వేగం, రిలాక్సింగ్ విషయాల్లో చాలా మార్పులు చేసినట్లు చెబుతున్నారు. మైలేజీ మాత్రం లీటరుకు 15 కిలో మీటర్లు అని కంపెనీ చెబుతోంది.


Force Gurkha 5 Door Review: ‘ఫోర్స్ గుర్ఖా’ లుక్ అదుర్స్! 5-డోర్ వెర్షన్‌లో ఇది చాలా స్పెషల్

గుర్ఖా ఫీచర్స్ 
ఇక డ్రైవింగ్ పొజిషన్ బస్ డ్రైవర్ల మాదిరిగానే కాస్త ఎత్తులోనే ఉండేలా ఉంది. తద్వారా రోడ్డుపై విజన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంతకుముందు గూర్ఖాలో ఇన్‌సైడ్ ఫ్యూయల్ లిడ్ ఓపెనర్, డెడ్ పెడల్, రేర్ కెమెరా, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే వంటివి లేవు. కానీ, కొత్త దాంట్లో అవన్నీ పొందుపర్చారు. ఇది పవర్డ్ మిర్రర్‌లను కూడా కలిగి ఉంది. సన్ రూఫ్, హీట్ సీట్ల విషయంలోనూ వినియోగదారులు సంతృప్తి చెందుతారని అంటున్నారు. కానీ, ఆటోమెటిక్ వేరియంట్లో మరిన్ని ఫీచర్స్ జోడించి ఉండాల్సిందన్న అభిప్రాయం ఉంది. దాంట్లో 6 ఎయిర్‌బ్యాగ్స్ కూడా ఉండే బాగుంటుందన్న వాదన ఉంది. 

5-డోర్ అంటే వెనుక వైపు డోర్ తీసి అక్కడున్న సీట్లలో కూర్చోవచ్చు. ఇది చాలా సులభంగా ఉంటుంది. హెడ్‌రూమ్ లో రూఫ్ బ్లోవర్‌తో పాటు సెకండ్ రో ను కూడా బాగా చల్లబరుస్తుంది. కానీ, నీ రూం (Knee Room) స్పేస్ తక్కువగా ఉంది. కానీ, ఆర్మ్‌రెస్ట్‌ ఇచ్చారు. అయినా పొడవు ఎక్కువగా ఉన్న వ్యక్తులకు కాస్త ఇబ్బందే. మూడో వరుస సీట్లలోకి ప్రవేశించడం.. రేర్ డోర్ ద్వారా మాత్రమే ఉంటుంది. రేర్ సీట్స్ ను వాడితే లగేజీ స్పేస్ వాడుకోలేకుండా ఉంది.Force Gurkha 5 Door Review: ‘ఫోర్స్ గుర్ఖా’ లుక్ అదుర్స్! 5-డోర్ వెర్షన్‌లో ఇది చాలా స్పెషల్

ఇది కూల్ లుక్స్‌తో, బీభత్సమైన బేసిక్స్ తోఆఫ్-రోడ్ విషయంలో కూడా గూర్ఖా ఇప్పుడు మరింత మెరుగ్గా ఉందని ఆటోమొబైల్ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇది నిజమైన ఎస్‌యూవీ లవర్స్‌ అంచనాలకు మాత్రం అందుకోలేకపోయిందని అభిప్రాయం ఉంది. ఇది అధిక ఫీచర్లను ఇంకా ఆటోమేటిక్‌ ఫీచర్స్ కూడా అందించదు. అందువల్ల, ఇది ఇప్పటికీ హార్డ్‌కోర్ ఆఫ్-రోడర్ మాత్రమే అని అంటున్నారు. కానీ, ఫ్యామిలీ మొత్తం ప్రయాణించడానికి మాత్రం ఈ ఫోర్స్ మోటర్స్ వారి గుర్ఖా మంచిదని అంటున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pushpa 2 Ticket Rates: పుష్ప 2 బెనిఫిట్ షోలు, టికెట్ ధర పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి - తెలంగాణ కంటే ఎక్కువే
పుష్ప 2 బెనిఫిట్ షోలు, టికెట్ ధర పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి - తెలంగాణ కంటే ఎక్కువే
Metro Rail In Vizag and Vijayawada: విశాఖ, విజయవాడ ప్రజలకు శుభవార్త, మెట్రోరైల్ ప్రాజెక్టు డీపీఆర్‌లకు ఏపీ ప్రభుత్వం ఆమోదం
విశాఖ, విజయవాడ ప్రజలకు శుభవార్త, మెట్రోరైల్ ప్రాజెక్టు డీపీఆర్‌లకు ఏపీ ప్రభుత్వం ఆమోదం
Tiruvannamalai Landslide: ఇళ్లపై కొండచరియలు విరిగిపడి ఐదుగురు దుర్మరణం, తిరువణ్ణామలైలో విషాదం
ఇళ్లపై కొండచరియలు విరిగిపడి ఐదుగురు దుర్మరణం, తిరువణ్ణామలైలో విషాదం
Sundar Pichai: గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కి ముంబై కోర్టు నోటీసులు, అసలేం జరిగింది!
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కి ముంబై కోర్టు నోటీసులు, అసలేం జరిగింది!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

#UITheMovie Warner  Decode | Upendra సినిమా తీస్తే మరి అంత సింపుల్ గా ఉండదుగా.! | ABP DesamUnstoppable With NBK Season 4 Ep 6 Promo |  Sreeleela తో నవీన్ పోలిశెట్టి ఫుల్ కామెడీ | ABP Desamజగన్ కేసుల్లో పురోగతి! సుప్రీం  కీలక ఆదేశాలుఆసిఫాబాద్ జిల్లాలో పులుల దాడిపై ఏబీపీ గ్రౌండ్ రిపోర్ట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pushpa 2 Ticket Rates: పుష్ప 2 బెనిఫిట్ షోలు, టికెట్ ధర పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి - తెలంగాణ కంటే ఎక్కువే
పుష్ప 2 బెనిఫిట్ షోలు, టికెట్ ధర పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి - తెలంగాణ కంటే ఎక్కువే
Metro Rail In Vizag and Vijayawada: విశాఖ, విజయవాడ ప్రజలకు శుభవార్త, మెట్రోరైల్ ప్రాజెక్టు డీపీఆర్‌లకు ఏపీ ప్రభుత్వం ఆమోదం
విశాఖ, విజయవాడ ప్రజలకు శుభవార్త, మెట్రోరైల్ ప్రాజెక్టు డీపీఆర్‌లకు ఏపీ ప్రభుత్వం ఆమోదం
Tiruvannamalai Landslide: ఇళ్లపై కొండచరియలు విరిగిపడి ఐదుగురు దుర్మరణం, తిరువణ్ణామలైలో విషాదం
ఇళ్లపై కొండచరియలు విరిగిపడి ఐదుగురు దుర్మరణం, తిరువణ్ణామలైలో విషాదం
Sundar Pichai: గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కి ముంబై కోర్టు నోటీసులు, అసలేం జరిగింది!
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కి ముంబై కోర్టు నోటీసులు, అసలేం జరిగింది!
Andhra Pradesh News: పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
Most Expensive Android Smartphones: ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఆండ్రాయిడ్ ఫోన్లు - టాప్ మోడల్ రేటెంతో తెలుసా?
ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఆండ్రాయిడ్ ఫోన్లు - టాప్ మోడల్ రేటెంతో తెలుసా?
AP Liquor Fine: మద్యం ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తే భారీ జరిమానా, లైసెన్స్ రద్దు! ఉత్తర్వులు జారీ
మద్యం ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తే భారీ జరిమానా, లైసెన్స్ రద్దు! ఉత్తర్వులు జారీ
Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం - చిరు వ్యాపారులపైకి దూసుకెళ్లిన లారీ, నలుగురు మృతి
రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం - చిరు వ్యాపారులపైకి దూసుకెళ్లిన లారీ, నలుగురు మృతి
Embed widget