అన్వేషించండి

Rahul Gandhi: రాహుల్ గాంధీకి ముగ్గురు గర్ల్‌ఫ్రెండ్స్‌, హిందువులపై దాడులు ఆయన ప్లానే - బంగ్లాదేశ్ జర్నలిస్ట్ సంచలన ఆర్టికల్‌

Bangladesh: బంగ్లాదేశ్‌కి చెందిన ఓ ఇ-మ్యాగజైన్ రాహుల్ గాంధీపై పబ్లిష్ చేసి ఆర్టికల్‌ సంచలనమవుతోంది. ఆయన వ్యక్తిగత విషయాలెన్నో ఇందులో ప్రస్తావించారు.

Blitz Magazine: కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బంగ్లాదేశ్ జర్నలిస్ట్ చేసిన ఆరోపణలు సంచలనమవుతున్నాయి. Blitz అనే ఓ ఇ-మ్యాగజైన్‌లో ఓ ఆర్టికల్‌ పబ్లిష్ చేశాడు జర్నలిస్ట్ సలాహుద్దీన్ షోయబ్ చౌదురి. రాహుల్‌తో పాటు సోనియాకి సంబంధించి సంచలన విషయాలూ అందులో ప్రస్తావించాడు. రాహుల్‌ గాంధీ వ్యక్తిగత జీవితం గురించి ఈ ఆర్టికల్‌లో రాశాడు సలాహుద్దీన్. ఆయన వ్యాపారాల గురించీ వివరించాడు. అంతే కాదు. సోనియా గాంధీ అసలు పేరు హెడ్విగే ఆంటోనియా ఆల్బినా మైనో (Hedwige Antonia Albina Maino) అని చెప్పాడు. దీంతో పాటు మరి కొన్ని కీలక విషయాలు ఈ ఆర్టికల్‌లో వివరించాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో అనిశ్చితి నెలకొంది. ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా అక్కడి నుంచి ఇండియాకి పారిపోయి వచ్చారు. అక్కడ ఇప్పుడు ఆపద్ధర్మ ప్రభుత్వం కొనసాగుతోంది. షేక్ హసీనా పార్టీకి చెందిన నేతలందరినీ ఈ ప్రభుత్వం పక్కన పెట్టేస్తోంది. కానీ...డాక్టర్ గౌహర్ రిజ్వీని మాత్రం ఏమీ చేయడం లేదని చెప్పాడు జర్నలిస్ట్ సలాహుద్దీన్. ఆ వ్యక్తి మరెవరో కాదని,  సోనియా గాంధీ కజిన్‌ భర్తేనని అన్నాడు. 

సోనియా గాంధీకి కావాల్సిన వ్యక్తి అవడం వల్లే అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని చెప్పాడు. ఇంత కన్నా సంచలన విషయం ఏంటంటే...బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులకు రాహుల్ గాంధీకి లింక్ ఉందని తీవ్ర ఆరోపణలు చేశాడు. బంగ్లాదేశ్‌లోని BNP పార్టీ చీఫ్  ఖలీదా జియా కొడుకు తారిక్ రెహమాన్‌తో రాహుల్ గాంధీ లండన్‌లో భేటీ అయ్యాడని, అక్కడే ఇదంతా ప్లాన్ చేశారని ఆరోపించాడు. ఇంత జరుగుతుంటే భారత ప్రభుత్వానికి విచారణ జరిపించే బాధ్యత లేదా అని ఆ ఆర్టికల్‌లో ప్రశ్నించాడు. 

"నేను లౌకికవాదాన్ని నమ్మే మనిషిని. జవహర్ లాల్ నెహ్రూ ఎన్ని పెళ్లి చేసుకున్నాడన్నది నాకు అనవసరమైన విషయం. ఆ వ్యక్తిగత విషయాలు అందరికీ తెలిసినవే. నా ఉద్దేశం ఒకటే. రాహుల్ గాంధీ గురించి భారతీయులు ఎన్నో నిజాలు తెలుసుకోవాలి. రాహుల్ గాంధీకి ముగ్గురు గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నారు. ముగ్గురు పిల్లలున్నారు. విదేశాల్లో ఆయన రౌల్ విన్సీ అనే పేరుతో చెలామణి అవుతున్నాడు. బ్రిటీష్ పౌరసత్వం కూడా ఉంది"

- బంగ్లాదేశ్ జర్నలిస్ట్ 

కేంద్ర ప్రభుత్వం రాహుల్ గాంధీపై మెతక వైఖరి ప్రదర్శిస్తోందని, ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించాడు ఈ జర్నలిస్ట్. అంతే కాదు. హోం మంత్రి పదవిలో ఉన్న అమిత్ షా కూడా మౌనంగా ఉండడం ఆశ్చర్యకరంగా ఉందని అన్నాడు. రాహుల్ గాంధీ బ్రిటీష్ పౌరసత్వంపై గతంలో విచారణ జరిగింది. అలాటిందేమీ లేదని రాహుల్ సమాధానమిచ్చిన విషయాన్నీ ఈ ఆర్టికల్‌లో ప్రస్తావించాడు బంగ్లాదేశ్ జర్నలిస్ట్. దాదాపు పదేళ్లుగా ప్రధానిగా ఉంటున్న నరేంద్ర మోదీ రాహుల్ గాంధీపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించాడు. ఓ జాతీయ పార్టీ, నేతపై ఈ స్థాయిలో ఆరోపణలు చేయడం సంచలనమవుతోంది. పైగా ఈ ఆర్టికల్‌పై కాంగ్రెస్ ఎలాంటి నోటీసులు ఇవ్వకపోవడం మరింత కీలకంగా మారింది. 

Also Read: Kolkata: కోల్‌కతా కేసులో మరో సంచలనం, అనాథ శవాలు అమ్ముకున్న మాజీ ప్రిన్సిపల్ - బంగ్లాదేశ్‌తోనూ లింక్‌లు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Harish Rao: సిగ్గులేకుండా మాట్లాడింది నువ్వే, ఇజ్జత్ మొత్తం పోయింది - హరీశ్ రావు
సిగ్గులేకుండా మాట్లాడింది నువ్వే, ఇజ్జత్ మొత్తం పోయింది - హరీశ్ రావు
Arikepudi Vs Koushik: కౌశిక్ రెడ్డిని చంపే కుట్ర! రేవంత్‌ని చూస్తే జాలేస్తోంది - కేటీఆర్, హరీశ్
కౌశిక్ రెడ్డిని చంపే కుట్ర! రేవంత్‌ని చూస్తే జాలేస్తోంది - కేటీఆర్, హరీశ్
Vijayawada: కష్టతరంగా బోట్ల కటింగ్ పనులు! బ్యారేజీ నుంచి తొలగింపునకు రూ.కోట్ల ఖర్చు
కష్టతరంగా బోట్ల కటింగ్ పనులు! బ్యారేజీ నుంచి తొలగింపునకు రూ.కోట్ల ఖర్చు
Karimnagar: కరీంనగర్‌లో సైకో టీచర్, బాత్రూంలో పిల్లలు బట్టలేకుండా ఉండగా వీడియోలు!
కరీంనగర్‌లో సైకో టీచర్, బాత్రూంలో పిల్లలు బట్టలేకుండా ఉండగా వీడియోలు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కొడుతూ వీడియోలు తీస్తుందని... పీఈటీపై విద్యార్థినుల ఆగ్రహంచీఫ్‌ జస్టిస్ ఇంట్లో గణపతి పూజలో ప్రధాని మోదీ, ప్రతిపక్షాల ఫైర్ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్లను కట్ చేయడానికి శ్రమిస్తున్న సిబ్బందివినాయక నిమజ్జనంలో ఘర్షణలు, కర్ణాటకలో తీవ్ర ఉద్రిక్తతలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao: సిగ్గులేకుండా మాట్లాడింది నువ్వే, ఇజ్జత్ మొత్తం పోయింది - హరీశ్ రావు
సిగ్గులేకుండా మాట్లాడింది నువ్వే, ఇజ్జత్ మొత్తం పోయింది - హరీశ్ రావు
Arikepudi Vs Koushik: కౌశిక్ రెడ్డిని చంపే కుట్ర! రేవంత్‌ని చూస్తే జాలేస్తోంది - కేటీఆర్, హరీశ్
కౌశిక్ రెడ్డిని చంపే కుట్ర! రేవంత్‌ని చూస్తే జాలేస్తోంది - కేటీఆర్, హరీశ్
Vijayawada: కష్టతరంగా బోట్ల కటింగ్ పనులు! బ్యారేజీ నుంచి తొలగింపునకు రూ.కోట్ల ఖర్చు
కష్టతరంగా బోట్ల కటింగ్ పనులు! బ్యారేజీ నుంచి తొలగింపునకు రూ.కోట్ల ఖర్చు
Karimnagar: కరీంనగర్‌లో సైకో టీచర్, బాత్రూంలో పిల్లలు బట్టలేకుండా ఉండగా వీడియోలు!
కరీంనగర్‌లో సైకో టీచర్, బాత్రూంలో పిల్లలు బట్టలేకుండా ఉండగా వీడియోలు!
Crime News: ఏపీలో దారుణం - ఆస్తి కోసం కన్నతండ్రినే చంపేసిన కసాయి కొడుకు, మరో చోట అప్పుల బాధతో అన్నదమ్ముల ఆత్మహత్య
ఏపీలో దారుణం - ఆస్తి కోసం కన్నతండ్రినే చంపేసిన కసాయి కొడుకు, మరో చోట అప్పుల బాధతో అన్నదమ్ముల ఆత్మహత్య
Gummadi Sandhya Rani: మంత్రి సంధ్యారాణి ఎస్కార్ట్ వాహనానికి ప్రమాదం - భద్రతా సిబ్బంది సహా ముగ్గురికి గాయాలు
మంత్రి సంధ్యారాణి ఎస్కార్ట్ వాహనానికి ప్రమాదం - భద్రతా సిబ్బంది సహా ముగ్గురికి గాయాలు
Telangana Cabinet :  తెలంగాణ కేబినెట్‌ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ - రేవంత్ అనుకున్న వారికే పదవులు ఇవ్వగలరా ?
తెలంగాణ కేబినెట్‌ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ - రేవంత్ అనుకున్న వారికే పదవులు ఇవ్వగలరా ?
Andhra Pradesh News: ఇన్సూరెన్స్‌ కంపెనీల వద్దకు విజయవాడ వరద బాధితుల క్యూ- బీమా సంస్థల కొర్రీలపై ప్రజల అసహనం
ఇన్సూరెన్స్‌ కంపెనీల వద్దకు విజయవాడ వరద బాధితుల క్యూ- బీమా సంస్థల కొర్రీలపై ప్రజల అసహనం
Embed widget