అన్వేషించండి

లోక్‌సభ ముందుకు ఎంపీ మహువా మొయిత్రా పై ఎథిక్స్ కమిటీ నివేదిక, విపక్షాల ఆందోళన

టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా ప్రశ్నలు అడిగినందుకు డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆమెను పార్లమెంట్ నుంచి బహిష్కరించాలంటూ ఎథిక్స్‌ కమిటీ నివేదిక ఇచ్చింది.

టీఎంసీ (TMC) ఎంపీ మహువా మొయిత్రా (Mahua Moitra) ప్రశ్నలు అడిగినందుకు డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆమెను పార్లమెంట్ నుంచి బహిష్కరించాలంటూ ఎథిక్స్‌ కమిటీ నివేదిక ఇచ్చింది. దీంతో సభలో విపక్షాలు ఆందోళన చేపట్టాయి. ఎంపీ మహువా మొయిత్రా పై పార్లమెంటు నైతిక విలువల కమిటీ రూపొందించిన నివేదిక లోక్‌సభ (Lok sabha) ముందుకు వచ్చింది. ఈ నివేదికను బీజేపీ ఎంపీ, ఎథిక్స్‌ కమిటీ (Ethics Committee) ఛైర్మన్‌ విజయ్‌ సోన్కర్‌ శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఎథిక్స్ కమిటి నివేదికను లోక్‌సభలో ప్రవేశపెట్టడంపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా లోక్‌సభలో నినాదాలు చేశాయి. ఎథిక్స్‌ కమిటీ నివేదిక కాపీ తమకు ఇవ్వాలని, దీనిపై ఓటింగ్‌ నిర్వహించడానికి ముందు సభలో చర్చ జరగాలని పట్టుబట్టాయి. స్పీకర్‌ వారించినా విపక్ష సభ్యులు ఆందోళనను విరమించలేదు. దీంతో సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. ఈ నివేదికను సభ ఆమోదించినట్లయితే మహువా మొయిత్రా (Mahua Moitra) లోక్‌సభ నుంచి బహిష్కరణకు గురవుతారు. దీనిపై లోక్‌సభ నేడే నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

నిషికాంత్‌ దుబే ఆరోపణలతో వెలుగులోకి...

తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీలో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందిన ఎంపీ మహువా మొయిత్రాపై బీజేపీ ఎంపీ (Bjp Mp ) నిషికాంత్‌ దుబే (Nishikanth dube ) సంచలన ఆరోపణలు చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో ప్రశ్నలు అడిగేందుకు డబ్బు తీసుకున్నారని దూబే ఆరోపించారు. అదానీ గ్రూప్, ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్‌ చేసి మాట్లాడేందుకు వ్యాపారవేత్త దర్శన్‌ హీరానందానీ నుంచి మహుబా డబ్బులు తీసుకున్నారని అన్నారు. పారాదీప్, ధమ్రా పోర్ట్ నుంచి చమురు, గ్యాస్‌ సరఫరా, యూరియా సబ్సిడీ, రియల్ ఎస్టేట్‌పై ప్రభావం చూపుతున్న ఉక్కు ధరలు, ఆదాయపు పన్ను శాఖ అధికారాలపై మహువా ప్రశ్నలు అడిగారని గుర్తు చేశారు. తక్షణమే ఆమెను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ, స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. పార్లమెంటరీ హక్కులను ఉల్లంఘించడం, సభా ధిక్కారం, నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని లేఖలో పేర్కొన్నారు. 

ఖరీదైన బహుమతులు 
ఓ కాంట్రాక్టు అదానీ గ్రూపునకు దక్కడంతో హీరానందానీ గ్రూపు వ్యాపార ప్రయోజనాలను కాపాడేందుకు ఎంపీ మహువా మొయిత్రా ప్రయత్నించారని నిషికాంత్ దూబే ఆరోపించారు. హీరానందానీ గ్రూపునకు అనుకూలంగా ప్రశ్నలు అడిగినందుకు  రూ.2కోట్లు, ఐఫోన్‌ వంటి ఖరీదైన బహుమతులు, ఎన్నికల్లో పోటీకి రూ.75లక్షలు ఇచ్చారని లేఖలో ప్రస్తావించారు. ఎంపీ మహువా, వ్యాపారవేత్త మధ్య లంచాల మార్పిడికి సంబంధించి ఆధారాలను ఓ లాయర్ తనకు ఇచ్చారని లేఖలో ప్రస్తావించారు. 2019 నుంచి 2023 మధ్య కాలంలో మహువా అడిగిన 61 ప్రశ్నల్లో 50 ప్రశ్నలు దర్శన్‌ హీరానందానీ కోరిక మేరకు మహువా అడిగారని నిషికాంత్‌ తెలిపారు. 

మహాభారత యుద్ధాన్ని చూస్తారన్న మహువా మొయిత్రా
దుర్గా మాత వచ్చిందని... ఇక చూసుకుందామన్నారు టీఎంసీ పార్లమెంట్ సభ్యురాలు మహువా మొయిత్రా. వినాశనం సంభవించినప్పుడు.. తొలుత కనుమరుగయ్యేది వివేకమేనన్న ఆమె, వస్త్రాపహరణాన్ని వాళ్లు మొదలుపెట్టారని... ఇక మహాభారత యుద్ధాన్ని చూస్తారని బీజేపీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

టాప్ హెడ్ లైన్స్

Shubman Gill Ranking Surge: నంబర్ వన్ ర్యాంక్ కి ఒక్క అడుగు దూరంలో గిల్.. విరాట్, రోహిత్ ల క్రేజీ రేస్, ఐసీసీ ర్యాంకింగ్స్ లో భార‌త బ్యాట‌ర్ల జోరు!
నంబర్ వన్ ర్యాంక్ కి ఒక్క అడుగు దూరంలో గిల్.. విరాట్, రోహిత్ ల క్రేజీ రేస్, ఐసీసీ ర్యాంకింగ్స్ లో భార‌త బ్యాట‌ర్ల జోరు!
ABP Desam Top 10, 22 July 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
ABP Desam Top 10, 22 July 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
Sonam Wangchuk Letter:సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ! నిరాహార దీక్ విరమణకు షరతులు!
సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ రాశారు! నిరాహార దీక్ విరమణకు షరతులు విధించారు!
Rahul Gandhi: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్

వీడియోలు

NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
Sanju Samson vs Rohit Sharma | రోహిత్ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్
Telugu Serial Actor Debjani Modak Biography | ఎన్నెన్నో జన్మల బంధం' వేద అన్‌సీన్ లైఫ్
Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan On Panchadarla Land Issue: పంచదార్ల భూముల వివాదంపై పవన్ సంచలన నిర్ణయం- వైసీపీ పోరాటంతో దిగొచ్చిన ప్రభుత్వం
పంచదార్ల భూముల వివాదంపై పవన్ సంచలన నిర్ణయం- వైసీపీ పోరాటంతో దిగొచ్చిన ప్రభుత్వం
Tirumala Anjaneya Swamy Idol Stolen Case: తిరుమల విగ్రహం చోరీ కేసును 15 గంటల్లోనే ఛేదించిన పోలీసులు- ఒంగోలు రైల్వేస్టేషన్‌లో నిందితుడు అరెస్టు 
తిరుమల విగ్రహం చోరీ కేసును 15 గంటల్లోనే ఛేదించిన పోలీసులు- ఒంగోలు రైల్వేస్టేషన్‌లో నిందితుడు అరెస్టు 
Telangana Schools Bandh On Friday: తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
Bigg Boss 10: బిగ్‌బాస్ 10 కోసం మంచిర్యాల యువకుడి పాదయాత్ర! అవకాశం ఇవ్వాలని నాగార్జునకు రిక్వస్ట్‌!
బిగ్‌బాస్ కోసం మంచిర్యాల యువకుడి పాదయాత్ర! అవకాశం ఇవ్వాలని నాగార్జునకు రిక్వస్ట్‌!
Mee Bhoomi Blockchain Project:ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌!
ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌! "మీ భూమి–బ్లాక్‌ చెయిన్" ప్రాజెక్టు ప్రయోజనమేంటి?
Sonam Wangchuk Letter:సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ! నిరాహార దీక్ విరమణకు షరతులు!
సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ రాశారు! నిరాహార దీక్ విరమణకు షరతులు విధించారు!
Adilabad Latest News:
"ఆదిలాబాద్‌ సీసీఐ కర్మాగార పునరుద్ధరణకు రూ.250 కోట్లు కేటాయించలేరా?" రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ!
Rahul Gandhi: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
Embed widget