పాకిస్థాన్ మళ్లీ పాత పాటే పాడింది. దేని గురించి అనుకుంటున్నారా? ఇటీవల కెప్టెన్ అభినందన్ వర్ధమాన్‌కు 'వీర్ చక్ర' పురస్కారాన్ని భారత ప్రభుత్వం అందించడంపై పాకిస్థాన్ విషం కక్కింది. 2019 ఫిబ్రవరిలో పాకిస్థాన్‌కు చెందిన యుద్ధ విమానం ఎఫ్-16ను తాము కూల్చివేశామని భారత్ చేస్తోన్న వ్యాఖ్యలను పాకిస్థాన్ ఖండించింది. ఇది నిరాధారమని ఆరోపించింది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
పాకిస్థాన్‌తో జరిగిన వాయు ఘర్షణలో అభినందన్ చూపిన శౌర్యానికి 'వీర్ చక్ర' పురస్కారంతో కేంద్రం సత్కరించింది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఆయన సోమవారం ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
బాలాకోట్ ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన దాడుల తర్వాత.. 2019, ఫిబ్రవరి 27న భారత్, పాక్ మధ్య జరిగిన ఘర్షణలో అభినందన్ ధైర్యసాహసాలు చూపించారు. పాక్ వైమానికదళంతో వీరోచితంగా పోరాడి దాయాదుల ఎఫ్-16 యుద్ధ విమానాన్ని కుప్పకూల్చారు.
Also Read: Punjab Elections 2022: 'కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు.. కానీ ఆ చెత్త మాకొద్దు'
Also Read: Covid 19 3rd Wave: భారత్‌లో కరోనా థర్డ్ వేవ్ వస్తుందా? నిపుణులు ఏమంటున్నారంటే?
Also Read: Central Vista Project: సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్‌పై మరో పిటిషన్ తిరస్కరణ.. ఇక లైన్ క్లియర్!
Also Read: Corona Cases: దేశంలో 543 రోజుల కనిష్ఠానికి రోజువారి కరోనా కేసులు
Also Read: గురుకుల స్కూల్‌లో కరోనా కలకలం.. 29 మంది విద్యార్థినులకు కొవిడ్ పాజిటివ్.. సిబ్బంది అలర్ట్
Also Read: Foods: ఎక్కువకాలం జీవించాలనుందా... అయితే ఇవి కచ్చితంగా తినండి
Also Read: ఒకే ఒక్కడు.. వెయ్యిమందిని కాపాడాడు.. కోవూరు ఎస్సైకి జనం జేజేలు