భారత్‌కు కరోనా మూడో వేవ్ ముప్పు తప్పిందా? ఈ ఏడాది ఆగస్టులోనే మూడో వేవ్ వస్తుదని నిపుణులు చెప్పినప్పటికీ రాలేదు. అయితే వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి మూడో వేవ్ వస్తుందని ఇటీవల ఓ అధ్యయనం వెల్లడించింది. కానీ ప్రస్తుతం కేసుల సరళిని గమనిస్తే భారత్‌కు థర్డ్ వేవ్ ముప్పు లేనట్లేనని నిపుణులు చెబుతున్నారు.
తగ్గుతున్న కేసులు..
దీపావళి తర్వాత మూడు వారాలుగా నమోదవుతున్న కరోనా కేసుల సరళిని గమనిస్తే దేశంలో కరోనా మూడో ముప్పు లేకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కరోనా రెండో దశలో దేశంలో చాలా మంది కరోనా బారినపడటం, వ్యాక్సినేషన్ ఊపందుకోవడం వల్ల మూడో ముప్పు ఉండే అవకాశాలు తక్కువే అంటున్నారు.
కొత్త వేరియంట్ వస్తే..
ప్రస్తుతానికి కరోనా మూడో ముప్పు లేకపోయినప్పటికీ కొత్త వేరియంట్ వెలుగు చూస్తే మాత్రం థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలు లేకపోలేదని నిపుణులు హెచ్చరించారు. శీతాకాలం ప్రారంభమైనందు వల్ల కేసులు పెరగొచ్చని తెలిపారు.
డిసెంబర్ చివరి నుంచి ఫిబ్రవరి మధ్యలో కరోనా కేసులు పెరగొచ్చని నిపుణులు అంటున్నారు. అయితే రెండో దశలో వేలమంది మరణించి, లక్షలాది మంది ఆస్పత్రులపాలైనట్లుగా ఈసారి ఉండదని అంచనా వేస్తున్నారు.
వ్యాక్సినేషన్..
కరోనా కేసులు తగ్గడానికి దేశంలో వ్యాక్సినేషన్ జోరుగా సాగడం మరో కారణమని నిపుణులు అంటున్నారు. ఇటీవల దేశంలో 100 కోట్ల టీకా డోసులు పంపిణీ చేసి కేంద్ర ఆరోగ్య శాఖ రికార్డ్ సృష్టించింది.
దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. కొత్తగా 7,579 కేసులు నమోదుకాగా 236 మంది మరణించారు. గత 543 రోజుల్లో ఇదే కనిష్ఠం. 12,202 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
Also Read: Central Vista Project: సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్‌పై మరో పిటిషన్ తిరస్కరణ.. ఇక లైన్ క్లియర్!
Also Read: Corona Cases: దేశంలో 543 రోజుల కనిష్ఠానికి రోజువారి కరోనా కేసులు
Also Read: గురుకుల స్కూల్‌లో కరోనా కలకలం.. 29 మంది విద్యార్థినులకు కొవిడ్ పాజిటివ్.. సిబ్బంది అలర్ట్
Also Read: Foods: ఎక్కువకాలం జీవించాలనుందా... అయితే ఇవి కచ్చితంగా తినండి
Also Read: ఒకే ఒక్కడు.. వెయ్యిమందిని కాపాడాడు.. కోవూరు ఎస్సైకి జనం జేజేలు