కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఎక్ అఫీషియో సభ్యునిగా ఎంపీ కేశినేని నాని ఓటు వినియోగిచుకోడం చట్ట విరుద్ధమంటూ వైఎస్ఆర్‌సీపీ నేతలు రెండు రోజులుగా ఎన్నికలను జరగనీయడం లేదు. కౌన్సిల్ హాల్లో విధ్వంసం సృష్టిస్తున్నారు. ఈ కారణంగా రెండు రోజుల పాటు ఎన్నిక వాయిదా పడింది. దీంతో ఉద్దేశపూర్వంగా ఎన్నికలకు ఆటంకం కల్పిస్తున్నారని.. అధికారులు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ తెలుగుదేశం పార్టీ నేతలు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణకు ఇంచార్జ్ సీపీని, రిటర్నింగ్ అధికారిని హైకోర్టు పిలిపించింది. విచారణ జరిపి బుధవారం ఎన్నిక నిర్వహించాలని స్పష్టం చేసింది. కౌన్సిలర్లకు భద్రత కల్పించాలని ఆదేశించింది.
Also Read: పంచాయతీ నిధులు తీసేసుకున్న ఏపీ ప్రభుత్వం.. కడప జిల్లాలో వైఎస్ఆర్‌సీపీ సర్పంచ్‌ల రాజీనామా
సోమవారం వైఎస్ఆర్‌సీపీ కౌన్సిలర్లు విధ్వంసం సృష్టించడంతో మంగళవారానికి ఎన్నిక వాయిదా వేశారు. మంగళవారం కూడా కౌన్సిల్ హాల్లో విధ్వంసం జరిగింది. ఆపేందుకు ఎవరూ ప్రయత్నించలేదు. దీంతో ఎన్నికల అధికారిక ఎంపిక ప్రక్రియను నిరవధికంగావాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు. అయితే హైకోర్టు ఆదేశంతో బుధవారం ఎన్నిక నిర్వహించక తప్పని పరిస్థితి ఏర్పడింది.
Also Read: మండలిని రద్దు చేయవద్దు ..ప్లీజ్.. ! కేంద్రానికి ఏపీ ప్రభుత్వం మరో తీర్మానం !
కొండపల్లి నగర పంచాయతీలో 29 వార్డులు ఉన్నాయి. ఇందులో టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ చెరో 14 స్థానాలు గెల్చుకున్నాయి. ఓ స్థానాన్ని టీడీపీ రెబల్ అభ్యర్థి గెల్చుకున్నారు. అయితే వెంటనే ఆ కౌన్సిలర్ టీడీపీలో చేరిపోయారు. దీంతో టీడీపీ బలం 15కు చేరుకుంది. ఎక్స్ అఫీషియో మెంబర్‌గా టీడీపీ ఎంపీ కేశినేని నానికి ఓటు హక్కు వినియోగించుకునేందుకు హైకోర్టు అవకాశం కల్పించింది. వైఎస్ఆర్‌సీపీ తరపున ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఓటు హక్కు లభించింది. దీంతో బలాలు టీడీపీకి 16, వైఎస్ఆర్‌సీపీకి 15 తేలాయి. టీడీపీకి చైర్మన్ పీఠం లభించడం ఖాయం అయింది.
Also Read: మీ పతనం చూడాలనే ఆత్మహత్య చేసుకోలేదు.. చంద్రబాబుకు ముద్రగడ బహిరంగ లేఖ !
అయితే కొండపల్లిని తామే గెల్చుకుంటామని వైఎస్ఆర్‌సీపీ నేతలు చెబుతూ వచ్చారు. ఆ ప్రకారం ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దీంతో ఉద్దేశపూర్వకంగా కౌన్సిలర్లు విధ్వంసం సృష్టించి వాయిదా పడేలా చేశారని అంటున్నారు. నిజానికి 16 మంది సభ్యులు ఉంటే కోరం ఉన్నట్లే. ఎన్నికలు నిర్వహించాలి. కానీ మున్సిపల్ కమిషనర్ ఎన్నికను నిర్వహించకుండా అధికార పార్టీ నేతల ఒత్తిళ్ల మేరకు వ్యవహరిస్తున్నారని.. అందుకే నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికను వాయిదా వేయించారని ఆరోపిస్తున్నారు. పూర్తి స్థాయిలో బలం ఉన్నా... టీడీపీకి కొండపల్లి మున్సిపల్ చైర్మన్ పీఠం ఎన్నిక జరగకపోవడం వల్ల దక్కలేదు. బుధవారం ఎన్నిక నిర్వహించినా ఫలితం మాత్రం ప్రకటించవద్దని హైకోర్టు ఆదేశిచింది. .
Also Read: మళ్లీ 3 రాజధానులా? అసలు జీతాలకు డబ్బులున్నాయా? ఆత్మ పరిశీలన చేసుకోండి: సోము వీర్రాజు