టాలీవుడ్ స్టార్ హీరోలు సూపర్ స్టార్ మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ లు ఒకేవేదికపై సందడి చేయబోతున్నారు. ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తోన్న 'ఎవరు మీలో కోటీశ్వరులు' కార్యక్రమానికి సామాన్యులతో పాటు హీరోలు, దర్శకులు, సంగీత దర్శకులు, చాలా మంది సినిమా సెలబ్రిటీలు వచ్చారు. తాజాగా మహేష్ బాబు ఈ షోలో పాల్గొన్నారు. త్వరలోనే ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. 39 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో అభిమానులను ఆకట్టుకుంటుంది. 
 
 
మహేష్ బాబుని 'అన్నా' అని స్టేజ్ పైకి పిలిచారు ఎన్టీఆర్. ఆ తరువాత 'నా రాజా' అంటూ షో మొదలుపెట్టారు. 'అదిరిపోయింది సెటప్ అంతా' అని మహేష్ కామెంట్ చేశారు. ఆ తరువాత 'కరెక్ట్ ఆన్సర్ ని అటు తిప్పి ఇటు తిప్పి ఎందుకు..?' అని ప్రశ్నించారు మహేష్. 'సరదాగా' అంటూ బదులిచ్చాడు ఎన్టీఆర్. ఆ వెంటనే 'గురువుగారే (కంప్యూటర్‌) బెటర్‌గా ఉన్నారు నీకన్నా' అంటూ మహేష్ చెప్పిన డైలాగ్ తో అందరూ నవ్వేశారు. 
 
ఈ షోలో మహేష్ బాబు పాతిక లక్షలు గెలుచుకున్నట్టు సమాచారం. తాను గెలుచుకున్న మొత్తాన్ని ఓ స్వచ్చంద సంస్థకు విరాళంగా ఇచ్చేశారట ప్రిన్స్. అభిమానులు ఈ ఎపిసోడ్ కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక రీసెంట్ గా ఈ షోలో బి.రాజా రవీంద్ర అనే వ్యక్తి కోటి రూపాయలు గెలుచుకున్నారు. గతంలో గన్ షూటింగ్ లో జాతీయ, అంతర్జాతీయ పోలీస్ క్రీడా పోటీలలో పాల్గొన్నా అనుభవం, పలు పథకాలు సొంతం చేసుకున్న ఘనత రాజా రవీంద్ర సొంతం. ఎప్పటికైనా ఒలింపిక్స్‌లో పాల్గొని ఎయిర్ రైఫిల్ షూటింగ్‌లో మెడల్ సాధించాలనేది తన లక్ష్యమని, అందుకోసం తనకొచ్చిన కోటి రూపాయలను ఉపయోగిస్తానని ఆయన తెలిపారు.

Also Read: అవన్నీ వదంతులే... కైకాల సత్యనారాయణ తాజా ఆరోగ్య పరిస్థితిపై కుమార్తె స్పందన ఇది

Also Read: ఆ నవమన్మథుడే ఈ చిన్న బంగార్రాజు.. టీజర్‌తో వచ్చేసిన బర్త్‌డే బాయ్ నాగ చైతన్య

Also Read: 'కె.జి.యఫ్' రేంజ్‌లో NTR31... ఆ సినిమా గురించి ఎన్టీఆర్ ఏమన్నారంటే?

Also Read: నాటు నాటు... ఆ స్టెప్పులు అంత ఈజీ ఏం కాదు! ఎన్టీఆర్, రామ్ చరణ్ ఎన్ని టేక్స్ తీసుకున్నారంటే?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి