Central Vista Project: సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్‌పై మరో పిటిషన్ తిరస్కరణ.. ఇక లైన్ క్లియర్!

ABP Desam Updated at: 23 Nov 2021 04:18 PM (IST)
Edited By: Murali Krishna

సెంట్రల్ విస్టా ప్రాజెక్టుపై దాఖలైన మరో పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది.

సెంట్రల్ విస్టా ప్రాజెక్టుపై మరో పిటిషన్ తిరస్కరణ

NEXT PREV

సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా ఉప రాష్ట్రపతి అధికారిక నివాసాన్ని నిర్మించేందుకు కేటాయించిన స్థలంపై సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. సదరు భూమి వినియోగాన్ని మార్చడానికి కారణాలను సంబంధిత అధికారులు వివరించారని, ఈ వివరణ సమర్థనీయంగా ఉందని తెలిపింది. జస్టిస్ ఏఎం ఖన్విల్కర్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌కు విచారణార్హత లేదని పేర్కొంది.



ఈ పిటిషన్‌పై తదుపరి విచారణ జరపడానికి తగిన కారణం లేదు. అందువల్ల దీనిని కొట్టివేయడం ద్వారా మొత్తం వివాదానికి ముగింపు పలుకుతున్నాం.                                         - సుప్రీం ధర్మాసనం


సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా నూతన పార్లమెంటు భవనాన్ని, ఉప రాష్ట్రపతి అధికారిక నివాసాన్ని, ఇతర కార్యాలయాలను నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టును 2019 సెప్టెంబరులో ప్రకటించారు. 2022 నాటికి దీనిని పూర్తి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.


ప్రత్యేకతలు..


ప్రజాస్వామ్య దేవాలయంగా పరిగణించే పార్లమెంట్‌ నూతన భవనంలో అణువణువనా భారతీయత ప్రతిబింబించనుంది. లోక్‌సభ పైకప్పు పురివిప్పి ఆడుతున్న నెమలి ఆకృతిలో, రాజ్యసభ పైకప్పు విరబూసిన కమలం రూపంలో ఉండనున్నాయి. జాతీయ వృక్షమైన మర్రిచెట్టు పార్లమెంట్‌లో అంతర్భాగంగా నిలువనుంది. 


సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా ఉపరాష్ట్రపతి నివాసాన్ని మార్చనున్నారు. ప్రభుత్వ కార్యాలయాల కోసం శాస్త్రి  భవన్, నిర్మాణ్ భవన్, ఉద్యోగ్ భవన్, కృషి భవన్, వాయు భవన్ ఇలా 10 నూతన భవనాలు ఏర్పాటు కానున్నాయి. 


అయితే ఈ సెంట్రల్ విస్టా ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు విమర్శలు కురిపిస్తున్నాయి. కరోనా సంక్షోభం వేళ ఈ ప్రాజెక్టు కోసం కేంద్రం ఖర్చు చేయడాన్ని తప్పుబడుతున్నాయి. దీనికి అయ్యే డబ్బును కరోనాపై యుద్ధానికి ఖర్చు చేయాలని కాంగ్రెస్ నేతలు పలుమార్లు విమర్శించారు.


Also Read: Corona Cases: దేశంలో 543 రోజుల కనిష్ఠానికి రోజువారి కరోనా కేసులు


Also Read: Nizamabad: కాసేపట్లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా కవిత నామినేషన్.. కాంగ్రెస్, బీజేపీ పోటీకి దూరం, కారణం ఏంటంటే..


Also Read: గురుకుల స్కూల్‌లో కరోనా కలకలం.. 29 మంది విద్యార్థినులకు కొవిడ్ పాజిటివ్.. సిబ్బంది అలర్ట్


Also Read: Foods: ఎక్కువకాలం జీవించాలనుందా... అయితే ఇవి కచ్చితంగా తినండి  


Also Read: ఒకే ఒక్కడు.. వెయ్యిమందిని కాపాడాడు.. కోవూరు ఎస్సైకి జనం జేజేలు 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at: 23 Nov 2021 04:17 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.