బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ మొదలైంది. ఇందులో భాగంగా 'నియంత మాటే శాసనం' అనే టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్.
గార్డెన్‌ ఏరియాలో ఒక నియంత సింహాసనం ఉంటుంది. బజర్ మోగగానే ఎవరు ముందుగా కూర్చుంటారో వాళ్లు ఆ రౌండ్ లో సేఫ్ అవడమే కాదు నియంతగా వ్యవహించాలి. మిగిలిన ఇంటి సభ్యులు తమని తాము సేవ్ చేసుకునేందుకు ఛాలెంజ్ లో పాల్గొనడంతో పాటూ బాటమ్ లో మిగిలిన ఇద్దరు కంటిస్టెంట్స్ తమని సేవ్ చేయమని నియంతని రిక్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అలా సేవ్‌ అయిన వారు కెప్టెన్‌ పోటీదారులు అవుతారంటూ బిగ్‌బాస్‌ ఈ టాస్క్‌ను డిజైన్‌ చేశారు.


 


 

తాజాగా విడుదలైన ప్రోమోలో సింహాసనంపై సిరి కూర్చోగా.. రవి-సన్నీ ఆమెని కాపాడమని రిక్వెస్ట్ చేసుకుంటూ కనిపించారు. దీనికి సిరి.. తనకు ఇద్దరితో మంచి ర్యాపో ఉందని.. కానీ గేమ్ ని దృష్టిలో పెట్టుకొని ఆడాలి కాబట్టి రవిని సేవ్ చేయాలనుందని చెప్పింది. దానికి సన్నీ 'కెప్టెన్సీ కంటెండర్స్ కి ఇది లాస్ట్ ఛాన్స్ ఒక్కసారి ఆలోచించు' అని సిరిని అడిగాడు. కానీ సిరి రవినే సేవ్ చేయడంతో సన్నీ హర్ట్ అయ్యాడు. కోపంగా అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ఆ తరువాత కాజల్ ఏడుస్తూ.. 'this is the last chance' అని డైలాగ్ వేసింది. 

 

మరోసారి బజర్ మోగగానే ప్రియాంక, సిరి, షణ్ముఖ్, రవి పరిగెత్తుకుంటూ వెళ్లి కుర్చీలో కూర్చోవడానికి ప్రయత్నించారు. కానీ సిరి, ప్రియాంక ముందుగా వెళ్లారు. 'నేనే ఫస్ట్ కూర్చున్నా..' అంటూ సిరి చెప్పింది. ప్రియాంక కూడా తనే ముందుగా కూర్చున్నానని చెప్పడంతో సంచాలక్ మానస్.. ప్రియాంకకు సపోర్ట్ చేశాడు. 'ఇదే నీ డెసిషన్ అయితే చెప్పు.. నేను వదిలేస్తా.. కానీ ఇది ఫెయిర్ కాదు' అని చెప్పింది సిరి. అప్పటికీ మానస్.. ప్రియాంకకే సపోర్ట్ చేయడంతో ఆమె కోపంగా బెడ్ రూమ్ లోకి వెళ్లి ఏడ్చేసింది. 'అన్నీ అబద్దాలు.. పింకీని గెలిపించుకోవాలంటే డైరెక్ట్ గా చెప్పేయొచ్చు కదా' అంటూ సిరి ఫైర్ అయింది.