బుల్లితెరపై నెంబర్ వన్ షోగా దూసుకుపోతుంది బిగ్ బాస్. ప్రేక్షకుల్లో ఈ షోకి ఉన్న పాపులారిటీనే వేరు. ఈ షో చాలా మందికి లైఫ్ ఇచ్చింది. అప్పటివరకు ఎవరో తెలియని కంటెస్టెంట్స్ కూడా ఈ షోలో పాల్గొని బాగా పాపులర్ అయ్యారు. వంద రోజులకు పైగా సాగే ఈ బిగ్ బాస్ హౌస్ లో లవ్ ట్రాక్ లు కూడా నడుస్తుంటాయి. హౌస్ లో ఒకరంటే ఒకరికి పడని వారు కూడా చివరికి ఫ్రెండ్స్ అయిపోతుంటారు. కొందరు ఎమోషనల్ కనెక్షన్ తో తమ రిలేషన్ ను మరింత ముందుకు తీసుకెళ్తారు.
ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 5లో పాల్గొన్న ప్రియాంక పరిస్థితి కూడా అలానే ఉంది. రోజురోజుకి ఆమెకి మానస్ పై ఫీలింగ్స్ పెరిగిపోతున్నాయి. ఇదే విషయాన్ని నాగార్జున కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచిన మానస్ తో చెప్పారు. ఈ పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేస్తావో చూస్కో అని అన్నారు. మానస్.. పింకీతో స్నేహంగానే మెలుగుతున్నాడు. ఆమెకి ఫీలింగ్స్ ఉన్నాయని తెలిసినా.. హర్ట్ చేయకుండా నీట్ గా ఉంటున్నాడు.
మానస్ పై తనకున్న ప్రేమను సోమవారం నాటి ఎపిసోడ్ లో ప్రియాంక బయటపెట్టింది. నవంబర్ 22నాటి ఎపిసోడ్ లో ప్రియాంక.. మానస్ కి ప్రపోజ్ చేసింది. 'నేను నిన్ను ఇష్టపడుతున్నానేమో అనిపిస్తుంది మానస్' అని చెప్పింది. ఫస్ట్ టైమ్ నిన్ను చూసినప్పటి నుంచి ఏదో పాజిటివ్ ఫీలింగ్ అని చెప్పుకొచ్చింది. ఇది కరెక్ట్ కాదని తెలిసినా.. నీ విషయంలో నాకు ఇలానే అనిపిస్తుందంటూ తన ఫీలింగ్స్ ను బయటపెట్టింది.
ఈ సన్నివేశాలను బిగ్ బాస్ అన్ సీన్ లో చూపించారు. పింకీ ప్రపోజ్ చేస్తుంటే.. మానస్ రియాక్ట్ అవ్వకుండా అలానే ఉండిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వారం ప్రియాంక కూడా నామినేషన్ లో ఉండడంతో ఆమె హౌస్ నుంచి వెళ్లిపోయే ఛాన్స్ ఉందని జోస్యం చెబుతున్నారు. అలా జరిగితే పింకీ పరిస్థితి ఏమవుతుందో..!
Also Read: బ్రేకింగ్ న్యూస్... సుబ్బరాజు, జె.డి. చక్రవర్తితో రెజీనా సినిమా... షూటింగ్ షురూ
Also Read: సుమ సినిమాలో ఓ ప్రేమ పాట... ఎవరి మీద తీశారు? ఎవరు విడుదల చేశారంటే?
Also Read: సినిమాతో పాటు దర్శకుడి మాటలు వినిపిస్తే? ఇండియాలో కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టిన దేవ్ కట్టా 'రిపబ్లిక్'
Also Read: అవన్నీ వదంతులే... కైకాల సత్యనారాయణ తాజా ఆరోగ్య పరిస్థితిపై కుమార్తె స్పందన ఇది
Also Read: ఆ నవమన్మథుడే ఈ చిన్న బంగార్రాజు.. టీజర్‌తో వచ్చేసిన బర్త్‌డే బాయ్ నాగ చైతన్య
Also Read: 'కె.జి.యఫ్' రేంజ్‌లో NTR31... ఆ సినిమా గురించి ఎన్టీఆర్ ఏమన్నారంటే?
Also Read: నాటు నాటు... ఆ స్టెప్పులు అంత ఈజీ ఏం కాదు! ఎన్టీఆర్, రామ్ చరణ్ ఎన్ని టేక్స్ తీసుకున్నారంటే?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి