ఇప్పటికే హౌజ్ లో గ్రూపులుగా విడిపోయి ఓ రేంజ్ లో గొడవలు పెట్టుకుంటున్న ఇంటి సభ్యులు సమయం దొరికిందే తడవుగా రెచ్చిపోతున్నారు. ఆరంభం నుంచి నారదమునీంద్రుడు అనిపించుకున్న రవి ఎప్పటికప్పుడు ఆ పనిలో బిజీగా ఉంటున్నాడు. మొన్నటి వరకూ గట్టిగట్టిగా అరిచిన సన్నీ ఇప్పుడు కాస్త తగ్గి ఓ వైపు గేమ్ ఆడడంతో పాటూ అప్పుడప్పుడు కామెడీ చేస్తున్నాడు. ఇక శ్రీరామ్ సంగతి చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. ప్రవోక్ చేయడంలో చాలా బిజీగా ఉంటున్నాడు. ఎప్పటికప్పుడు సన్నీ, కాజల్ ని టార్గెట్ చేస్తూ రెచ్చిపోతున్నాడు. సన్నీ-కాజల్ టెంపర్ సంగతి తెలిసే కావాలనే వాళ్లు రెచ్చిపోయేలా చేసేందుకు తెగ ట్రై చేస్తున్నాడు. అయినప్పటికీ సన్నీ-కాజల్ అప్పటికి తగ్గా సమాధానం చెప్పి కూల్ అయిపోతున్నారు. ముఖ్యంగా యానీ మాస్టర్ తర్వాత శ్రీరామ్ చంద్ర బిహేవియర్ పై సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. ఇక సోమవారం నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో మంగళవారం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్.





 నియంత మాటే శాసనం ( కెప్టెన్సీ పోటీదారుల టాస్క్)
ఈ టాస్క్ లో భాగంగా గార్డెన్ ఏరియాలో  నియంత సింహాసనం పెట్టారు. బజర్ మోగగానే ఎవరు ముందుగా కూచుంటారో వాళ్లు ఆ రౌండ్ లో సేఫ్ అవడమే కాదు నియంతగా వ్యవహించాలి. మిగిలిన ఇంటి సభ్యులు తమని తాము సేవ్ చేసుకునేందుకు ఛాలెంజ్ లో పాల్గొనడంతో పాటూ బాటమ్ లో మిగిలిన ఇద్దరు కంటిస్టెంట్స్ తమని సేవ్ చేయమని నియంతని రిక్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. నియంత కుర్చీని కూడా శ్రీరామచంద్ర...కాజల్ పై కక్ష తీర్చుకునేందుకు వాడుకున్నాడంటున్నారు బిగ్ బాస్ అభిమానులు. అక్కడ టాస్క్ పరంగా ఆడకుండా ఆమెని కావాలనే టార్గెట్ చేస్తున్నాడంటున్నారు. ఈ విషయం తనకు ముందే తెలుసన్న కాజల్ ఇంత డొంక తిరుగుడు అవసరమా అని కౌంటర్ ఇచ్చింది. మొత్తానికి రచ్చ కొనసాగుతోంది. మరి ఈ వారం కెప్టెన్సీ పోటీదారులుగా ఎవరెవరు నిలుస్తారో చూడాలి. 
Also Read:  సందీప్ కిషన్ - విజయ్ సేతుపతి పాన్ ఇండియా సినిమాలో విలన్‌గా ఫేమస్ తమిళ దర్శకుడు
Also Read: ఫైనల్ వ‌ర్క్స్‌లో బాలకృష్ణ 'అఖండ'... ఫినిషింగ్ టచ్ ఇస్తున్న తమన్!
Also Read: రవిపై దారుణమైన ట్రోలింగ్.. ఫ్యామిలీను కూడా లాగుతూ..
Also Read: అల్లు అర్జున్ తగ్గేదే లే... ఫుల్ స్వింగులో పుష్పరాజ్ డబ్బింగ్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి